Sunday, June 14, 2020

Kalidas

कालिदासस्य कृतिषु भारतीय-संस्कृतिः (२)

भारतीय-संस्कृतेः एकं वैशिष्ट्यम् विद्यते। अत्र जीवनस्य सर्वेषां पक्षाणां न केवलं स्वीकरणम् अपि तु समानं महत्त्वं च भवति। अस्य विषयस्य प्रतिपादनं कालिदासेन रघुकलस्य राज्ञः चरितानां वर्णने मनोहारि-रूपेण कृतम् अस्ति।

धर्मः, अर्थः, कामः मोक्षः च एते चत्वारः पुरुषार्थाः। एते सर्वे मानवजीवनस्य अभिन्नानि अङ्गानि इति अपि वक्तुं शक्यते। बाल्यावस्थायां बुद्धेः ग्रहणशक्तिः तीक्ष्णतरा वर्तते इति, अस्मिन् वयसि प्राप्ताः संस्काराः आजीवनं लाभप्रदाः भवन्ति, सदैव मनुष्यस्य उपकारिणः सन्ति इति कारणेन बाल्यात् आरभ्य पञ्चविंशतिवर्षपर्यन्तं विद्यार्जनं करणीयम् इति निर्दिष्टम्। ब्रह्मचर्यं पालयन्तः तस्मिन् काले गुरुकुले गुरुणा सर्वेऽपि समानरीत्या भावयन्ति स्म। सर्वे शिष्याः गुरोः आज्ञां पालयन्तः, अनुशासनेन परिश्रमेण च विद्यार्जनं कुर्वन्ति स्म। न कोऽपि धनाढ्यः सम्पन्नः इति विशेषरूपेण सत्क्रियते अथवा दरिद्रः विजातीयः इति विप्रकार्यते। अनेन समदर्शनः भावः स्वतः सर्वत्र दृश्यते स्म। किमपि अस्य विषये पाठनीयः कल्पनीयः वा न अभवत्, वस्तुतः सर्वे अनेन भावेन व्यवह्रियन्ते स्म, एतावदेव। एवं राजकुमाराः अपि समत्त्वस्य, सरलजीवनस्य कठिनश्रमस्य च व्यावहारिकं शिक्षणं प्राप्नुवन् । सर्वे छात्राः विद्या सर्वोपरि अस्ति इति जानतः श्रद्धया विद्यार्जनं अकुर्वन्। सर्वैः बालैः विद्वांसः पूजनीयाः इति एषः संस्कारः बाल्यात् एव साक्षात् दर्शनेन ज्ञायते स्म। उपदेशेन वा वारं वारं कथनेन वा विद्यार्थिषु तथा प्रभावः न जायते यथा ज्येष्ठैः कथं व्यवह्रियते, अनुष्ठीयते तस्य साक्षात् अनुकरणेन भवति इति तु विदितम् एव।

एवमेव रघुवंशीयाः राजानः यौवने गार्हस्थ्यधर्मं स्वीकृत्य भोगविलासानि सुखानि च अनुभवन्ति स्म। सत्पथेन सत्कर्मणा धनम् अर्जयन्ति स्म। गृहस्थाः  स्वे स्वे कर्मणि रताः अर्थं कामं च  पुरुषार्थौ पालयन्ति स्म।

सूर्यवंशीयाः महीपतयः वार्धके वानप्रस्थाश्रमं स्वीकुर्वन्ति स्म, आध्यात्मिकं विषयं प्रति अधिकं उन्मुखाः अभवन् । अन्तिमे काले तु योगेन शरीरं त्यजन्ति स्म।

शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणाम् ।
वार्द्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् ॥ १-८॥

कालिदासेन रघुकुले जायमानाः राजानः किमर्थं कथं च पुरुषार्थम् अपालयन् इति अपि सम्यक् विवृतः अस्मिन् श्लोके –

त्यागाय संभृतार्थानां सत्याय मितभाषिणाम् ।
यशसे विजिगीषूणां प्रजायै गृहमेधिनाम् ॥ १-७
एते राजानः अर्थस्य संग्रहणम् अकुर्वन्। किमर्थम् इत्युक्ते स्वार्थसिद्ध्यर्थं वा भोगविलासार्थं वा इति न। दानाय, परोपकाराय, प्रजाभ्यः आनुकूल्यार्थमेव रघुकुलवंशीयाः धनसञ्चयम् अकुर्वन्। सत्यं वदन्तः ते मितं च सारं च भाषन्ते स्म। युद्धः क्षत्रियाणां धर्मः। दिलीपः आदयः नृपाः यशसे अयुध्यन्त, जेतुकामाः च आसन्। कुलस्य वर्धनाय, संरक्षणाय च गार्हस्थ्यधर्मं पालयन्ति स्म।

एवं रघुकुलवंशीयानां चरितं वर्णयन् कविः कालिदासः भारतीय-संस्कृतेः केचन अंशान् सोदाहरणं वर्णितवान्। चतुर्णां पुरुषार्थाणां कानि प्रयोजनानि, वर्णाश्रमाः के? ते कथं आचरेयुः इति प्रतिपादितवान् च।

Saturday, June 13, 2020

Kalidasa kavitha

కాళిదాసు రచించిన
कालिदासः भारतीय-संस्कृतिः च
कविकुलगुरुः कालिदासः रघुवंशे काव्ये सूर्यवंशीयानां राज्ञां विषये व्यवृणोत्। राज्ञां गुणान् विवृत्य कविः भारतस्य संस्कृतेः विषये अपि अनेकान् विषयान् प्रतिपादितवान्।
वृद्धत्वं इति शब्देन प्रायः वयोवृद्धत्वस्य एव बोधः भवति। रघुवंशीयाः आयुषा वृद्धाः न। किन्तु ते शीलवृद्धाः, ज्ञानवृद्धाः, वैराग्यवृद्धाः च।

सर्वविधं वार्धक्यं सम्मानं अपेक्ष्यते। वयोवृद्धाः सम्माननीयाः! जनाः तेषां आशीः सदैव आप्नुयुः।

वार्धक्यं चतुर्विधम् अस्ति। शास्त्रेषु अस्य किञ्चित् विवरणम् दृश्यते। वयोवृद्धत्वं, शीलवृद्धत्वं, ज्ञानवृद्धत्वं वैराग्यवृद्धत्वञ्चेति। एतदपि सूचितं तत्र यत् एषु चतुर्षु उत्तरोत्तरं अधिकं श्रेष्ठतरं वृद्धत्वं किमिति। वयोवृद्धत्वात् शीलवृद्धत्वं, शीलवृद्धत्वात् ज्ञानवृद्धत्वं, ज्ञानवृद्धत्वात् वैराग्यवृद्धत्वं श्रेष्ठतरम् इति।
मनुस्मृति-ग्रन्थे मनुः ऋषिः अपि उक्तवान् –

न तेन वृद्धो भवति येनास्य पलितं शिरः।
युवाप्यधीयानस्तं देवाः स्थविरं विदुः।। २/१५६ मनुस्मृतिः

राजा दिलीपस्य गुणान् वर्णयन् कालिदासः वदति –
अनाकृष्टस्य विषयैर्विद्यानां पारदृश्वनः,
तस्य धर्मरतेरासीत् वृद्धत्वं जरसा विना।।

रघुकुले उत्पन्नः दिलीपराजस्य वयो-वार्धक्यं विना वृद्धत्वम् आसीत् । सः सदैव धर्मरतः आसीत्। सः, तस्य अनुयायिन्यः प्रजाः च रेखामात्रमपि मनुना प्रणीतेन मार्गेण विक्षुण्णाःः न भवन्ति स्म। अतः दिलीपः शीलवृद्धः। सर्वासु विद्यासु पारङ्गतः सः ज्ञानवृद्धः। विषयवस्तूनां प्रति सः न कदापि आकृष्टः अभवत् इति कारणात् तस्य वैराग्यवृद्धत्वम् अपि सिद्धम् । एवं दिलीपः राजा शीलात्, ज्ञानात्, वैराग्यात् च प्रौढताम् प्राप्नोत्। वयोवृद्धः न सन्नपि तस्य वार्धक्यम् आसीत्।

अहो वाग्मिता कालिदासस्य! भारतस्य संस्कृतिं प्रति कियती श्रद्धा, कियान् गौरवः, भारतीयसंस्कृतेः कियत् ज्ञानं च।

Sunday, May 10, 2020

మాతృ పంచకం శంకరాచార్య విరచిత

మాతృ పంచకం

మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం

(అర్థ తాత్పర్యాలతో)
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరcణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.

ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.

"ఆస్తాం తావదియం ప్రసూతి
సమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ
 శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార
 భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి
 తనయః తస్యై జనన్యై నమః".

 తాత్పర్యము:
అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను(కడుపునొప్పి) అనుభవించావో కదా !
కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా ! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు.
ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు నమస్కారం చేస్తున్నాను.

"గురుకులముప సృత్య
స్వప్న కాలే తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః."
తాత్పర్యము:
కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను

"అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః."
తాత్పర్యము:
పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా ! గోవిందా !" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

"న దత్తం మాతస్తే
మరణ సమయే తోయమపివా
స్వ ధా వా నో దత్తా
మరణదివసే శ్రాద్ధవిధినా
న జప్త్వా మాతస్తే మరణ
సమయే తారక మను-
రకాలే సంప్రాప్తే మయి
 కురు దయాం మాతురతులామ్."

తాత్పర్యము: అమ్మా ! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని(ఓం రామాయనమః" అను ఆఱు అక్షరముల మంత్రమని కొందఱు "ఓం శ్రీరామరామ" అనునదే తారకమని మరికొందరు) చదవలేదు . నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ !!

"ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్."
తాత్పర్యము:
అమ్మా !
"నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా ! , నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి " అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను.నన్నుక్షమించు.

Wednesday, April 29, 2020

రామాయణం ఏడు తాడి చెట్టు

శ్రీ రాముడు మరమర (ఒకే వరుసలో ఉండే చెట్లు) చెట్ల పైకి బాణాన్ని ఎందుకు గురి పెట్టాడు?
కింది పిక్ చూడండి.

ఒకప్పుడు ఒక రాజు మనిభద్ర అనే వారు ఉండే, ఆయనకు 7మంది మగ  సంతానం,ఆయన భార్య పేరు కవిక.ఆ ఏడుగురు కొడుకులు  కూడా క్షుద్ర పూజలు, మాయలు లాంటి యక్షిణీ విద్యలు నేర్చుకున్నారు.ఒకరోజు వారు నేర్చుకున్న శక్తులతో ఒక  పెద్ద పాము ను సృష్టించారు. అలా ఋష్య మూక పర్వతానికి వెళ్తున్నప్పుడు వారికి అగస్త్య ముని కనిపించాడు. వారు వెంటనే ఒక పామును చేసి దానిని భూమిలో రంద్రం చేసి పాతేసి దాని మీద ఒక చెట్ల వరుసలా మారిపోయారు.

ఇదంతా తెలుసుకొన్న మహర్షి ఎప్పటికీ శాశ్వతం గా అలాగే చెట్ల లాగానే ఉండిపొమ్మని శాపం ఇచ్చాడు. జరిగిన దానికి పశ్చాత్తాప పడిన వారు శాప విమోచనం కోరగా అప్పుడు ఆ మహర్షి ఎప్పుడైతే శ్రీ రాముడు వచ్చి ఒకే బాణం తో మిమ్మల్ని కూలుస్తాడో అప్పుడే మీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.

రాముడు వచ్చి ఆ చెట్లను చూసి జరిగిన విషయం గ్రహించి ఆ పాముగా మారిన రాయిని తన బొటనవేలితో పట్టుకొని ఒక్క బాణాన్ని చెట్ల పైకి వదిలాడు.అవి టపటప మని కూలిపోతూ కిందపడి పోయాయి,వారికి శాప విమోచనం జరిగింది.

ఇది అప్పటి సందర్భాన్ని గుర్తు చేస్తూ చెక్కిన శిల్పము,ఇది ఋష్యమూక పర్వతం, కిష్కింధ, అని మాత్రమే నాకు తెలుసు.

The Story of Rama putting an arrow through maramara trees

By

P.R.Ramachander

There was a king called Manibhadra and he had several sons from his wife Kavika. Seven those sons learnt evil magic,One day by their magic they made a big serpent.When going over Rishya mooka mountains , they saw Agasthya coming that way.They made the snake in to a circle ,buried it in earth and stood on it as Sala trees,Understanding the truth , the sage cursed them to stand there forever as trees.They realized their mistake and begged the sage for relief from the curse.He told them when Rama puts in an arrow in all of them , they would get freedom freom the curse.When Rama came there , he recognized them and by his thumb pressed a stone on which the serpent was lying , which made it straight and Rama put an arrow through them.

Sunday, April 19, 2020

Sanskrit

श्लोकः :- क्षणशः कणशश्चैव विद्यामर्थश्च चिन्तयेत्।
               क्षणत्यागे कुतो विद्या कणत्यागे कुतो धनम्।।
 ---------------------
#अर्थः :- क्षण-क्षण विद्या के लिए और कण-कण धन के लिए प्रयत्न करना चाहिए। समय नष्ट करने पर विद्या और साधनों के नष्ट करने पर धन कैसे प्राप्त हो सकता है॥
-----------------
#Meaning :-   One should try moment-to-moment for learning and particles-to-particles for riches. How can one get education by wasting time and money by wasting resources?

#Sanskrit #india  #culture #money #education #knowledge #moment #resources #particles #waste #gyan #try #success #life #rech #SanskritSlogans #truthoflife #संस्कृतम् #संस्कृतंभारतम् #संस्कृतसूक्ति #संस्कृतसूक्तिः #संस्कृतभाषा #देवभाषा

Tuesday, April 7, 2020

బార్బరీకుడు

(కధ అర్థం కావడం కోసం ఇంగ్లీష్ పదాలు వాడారు )

మహాభారతంలోని బర్బరీకుడి  కథ..!

ఎన్ని రకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు... మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు..! బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో.. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి... కృష్ణుడు తన మాయోపాయంతో బలిగొన్న మరో మహాభారత పాత్ర ఇది... నిజానికి భాగవతం అంటేనే కృష్ణుడి చరిత్ర అనుకుంటాంగానీ, నిజానికి భారతం నిండా కూడా కృష్ణుడే... తను లేనిదే భారతం లేదు.... భారతం లేనిదే కృష్ణుడూ లేడు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా..? తను ఘటోత్కచుడి కొడుకు. (ఘటోత్కచుడు ఎవరూ అని అడగకండి. మాయాబజార్ సినిమా చూడని తెలుగువాడు ఎవరున్నారని..?) లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో... హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు. (ఆ కథ వేరు. వాళ్ల కొడుకే ఘటోత్కచుడు.. ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు మురు బిడ్డ మౌర్వి (అహిలావతి) ని పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు... నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు...
రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని... అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా.. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది. ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను 'త్రిబాణధారి' అంటారు.
పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక... భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ.. బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని కోరుకుంటాడు... వెళ్లే ముందు తల్లికి ఓ మాటఇస్తాడు. "ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే మాత్రం... నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను... ఓడిపోయేవారిని గెలిపిస్తాను".. ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు...
యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడినీ కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు.. 'నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు.?' ఇదీ ప్రశ్న... 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు... 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు... ఇలా తలాఓరకంగా చెబుతారు... దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు కృష్ణుడు... ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి.. 'కృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా..? అని అడుగుతాడు... నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు... కృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు... వాటి శక్తి వివరిస్తాడు.
నేను ఒక బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని. వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది... (టార్గెట్స్ ను ఐడెంటిఫై చేస్తుంది. రెండే బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది... మూడే బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు... నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవడూ దీన్ని నమ్మడు.. నమ్మలేడు అంటాడు కృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు కృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు... చేసి చూపించుఅంటాడు కృష్ణుడు...
బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లుమూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు కృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా కృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది. అందుకే అదక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి. లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు.. తప్పనిసరై పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది... (రక్షింపబడాల్సినవి... తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది.... ఆశ్చర్యంగా చూస్తాడు కృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు... బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే.. కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేననీ గుర్తిస్తాడు... కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనమడు కాబట్టి. పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది..? అందుకే దివ్యదృష్టిని సారించి, కొన్ని నిజాలు తెలుసుకుని, ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు.ఏమోయీ, నువ్వు ఎవరు..? నువ్వు కూడా యుద్ధం చేస్తావా..?నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను, చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను...
పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది... కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు... అంటే పాండవులే బలహీనులు కదా...అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది...
అదే జరిగితే, వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు, కౌరవులు బలహీనులు అవుతారు కదా...అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా.. మరేం చేయుట..?ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని, అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి, ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ. విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది... కృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా...ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు కృష్ణుడు... అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు కృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు...సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు... "యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా.. ఇంత భారీ జనహనన యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ, నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి, నాకివ్వు..' అంటాడు కృష్ణుడు... నన్నే ఎందుకు బలి ఇవ్వాలి, ఇంతమంది యోధులు ఉండగా... పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని .ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు.“బర్బరీకా.... నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి.. భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి విష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు... దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను... ఇదంతా వింటున్న నువ్వు 'ఈమాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి..? నేనొక్కడిని చాలనా' అని ఒకింత పొగరుగా మాట్లాడావు.. దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. 'ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు, మొట్టమొదట బలయ్యేది నువ్వే' అని శపించాడు. అందుకే నీ బలి... అంతేకాదు, నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు కృష్ణుడు. కానీ నాకు యుద్దానికి చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు కృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు... కృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు...యుద్ధం ముగిసింది. విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు కృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత కృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు... "వత్సా. ఈ మొత్తం యుద్దంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే.. నువ్వు చెప్పు. ఏం గమనించావో..?" స్వామీ, ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను... మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను... ఆ మహాశక్తి, నువ్వు మాత్రమే యుద్ద కారకులు, యుద్ధకర్తలు... మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే... అని సమాధానమిచ్చి, తన శాపం ముగిసిపోయి, తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ..!

Wednesday, March 18, 2020

కోటేరు

*కోటేరు లాంటి ముక్కు  అంటారు.  దయచేసి వివరించ గలరు*
----------------------------

కోటేరు అన్నది కోట +ఏరు అన్న రెండు పదాల కలయిక.

*కోట్- అన్న ధాతువుకు వంగిన అన్న అర్థాలున్నాయి.  తమిళంలో, మలయాళంలో కోటుకై అంటే వంగిన చేయి. తెలుగులో కూడా కొడవలి అన్న పదంలో ఉన్న కొడ్- వంగిన అన్న అర్థంలోదే. అలాగే, గోడివడు- అంటే వంగు అన్న అర్థం కూడా దీనికి చెందిందేనని నా అభిప్రాయం.

ఏరు- అన్నది మళ్ళీ నాగలికి సంబంధించిందే. భద్రిరాజు కృష్ణమూర్తి ప్రకారం దీని మూలధాతువు *చేర్-. కన్నడ, తమిళాదులలో ఇది ఆర్, ఎర్, సేర్ అని కూడా కనిపిస్తుంది. 

తమిళంలో కోటర్ అంటే నాగలి చివర భాగం, అంటే కఱ్ఱు (ploughshare). తెలుగులో కూడా ఉన్న కోటేరు నాగలి చివరిభాగాన్నే సూచిస్తుందని భావించాలి (నాగటి దుంప యందు అమర్చెడి ఇనుప పాళము). అయితే కోటేరు లాంటి ముక్కు అన్నప్పుడు పూర్తిగా నాగలి రూపాన్ని తలపించే ముక్కనే అనుకోవాలి. ముక్కు దూలం మహా సూటిగా ఉండి చివర నాగటి  కఱ్ఱు లాగా వంపు తిరిగినది అని భావన.