🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
వాక్సుద్ధి !
➖➖➖✍
ఒక సారి భోజరాజుకు ఒక వింత కోరిక కలిగింది. ‘నేను మరణించిన తర్వాత కాళిదాసు తన గురించి ఏమి చెప్తాడు?’
అని. కాళిదాసును పిలిపించి తన కోరిక చెప్పాడు.
కాళిదాసు ‘మీ కోరిక పిచ్చిగానూ, అమంగళ కరము గానూ వుంది నేను తీర్చలేను క్షమించండి’ అన్నాడు.
‘రాజాజ్ఞను ధిక్కరించిన వారికి దేశ బహిష్కారమే శిక్ష!’ అన్నాడు రాజు కాళిదాసు
భయపడి చెప్తాడేమో నని.
కానీ కాళిదాసు ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే'అని చెప్పి ధారానగరం విడిచి వెళ్ళిపోయాడు.
యిలా జరుగుతుందని వూహించని రాజు దిగులు పడిపోయాడు. కాళిదాసు లేకుంటే ఆయనకు ఒక్క రోజు కూడా గడవదు.
కొన్నాళ్ళు గడిచాక, కాళిదాసు ఏకశిలా నగరం లో ఉన్నాడని భోజరాజుకు వేగులు చెప్పారు.
వెంటనే భోజరాజు గడ్డాలూ మీసాలూ పెట్టుకొని యోగి వేషంలో కాళిదాసును వెతకడానికి ఏకశిలా నగరానికి వెళ్ళాడు.
అక్కడ కాళిదాసు ఆయనకు ఎదురుపడ్డాడు. భోజరాజు ఆయనను చూసి ‘మహా కవీ! అభివాదాలు’ అన్నాడు. ‘నేను ధారా నగరం నుండి వస్తున్నాను’ అన్నాడు.
‘అలాగా అయితే భోజరాజు గారు యెలా వున్నారు?’ అని ఆత్రంగా అడిగాడు
కాళిదాసు.
అప్పుడు యోగి వేషంలో వున్న భోజరాజు విచారంగా ‘యింకెక్కడి భోజరాజు? కాళిదాసు గారు వెళ్లిపోగానే ఆయన ఆదిగులుతో మరణించారు’ అన్నాడు.
కాళిదాసు అదిరి పడ్డాడు. ఆయనకు భోజరాజుతో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి అప్రయత్నంగా ఆయన నోటివెంట ఓ శ్లోకం వచ్చింది.
*"అద్యధారా నిరాధారా నిరాలంబా సరస్వతీ *
*పండితా ఖండితా సర్వే భోజరాజే దివంగతే!*
అర్థము:-“ఈరోజు ధారానగరం నిరాధారమై పోయింది. వాగ్దేవికి ఆలంబన పోయింది. భోజరాజు దివంగతుడు కావటంతో పండితు లందరికీ చావు దెబ్బ తగిలింది.”
కానీ ఆయన వాక్శుద్ధి ప్రభావంతో ఆ యోగి అకస్మాత్తుగా కూలి చనిపోయాడు.
నిదానంగా చూసి ఆయోగిని రాజుగా గుర్తించి “ఎంత పని చేశారు మహారాజా!” అని రోదించాడు కాళిదాసు.
వెంటనే కర్తవ్యం స్ఫురించి భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తన శ్లోకాన్ని మార్చి చదివాడు.
*అద్యధారా సదా ధారా, సదాలంబా సరస్వతీ*
*పండితా మండితా సర్వే, భోజరాజే భువంగతే.*
అర్థము:-“ఈరోజు ధారానగరానికీ,సరస్వతీ దేవికీ చక్కని ఆలంబన దొరికింది.
భోజరాజు భూలోకంలో అవతరించగానే పండితులందరూ చక్కగా సత్కరించబడ్డారు.”
శ్లోకం వినగానే భోజరాజు సజీవుడై లేచి కూర్చున్నాడు. రాజూ, కవిరాజూ గాడంగా కౌగలించు కున్నారు. ధారా నగరానికి తిరిగి వెళ్లి పోయారు. కాళిదాసు వాక్శుద్ధి అలాంటిది మరి!._✍
🌷🙏🌷