Sunday, September 7, 2014

amarnath yathra అమరనాథ్ యాత్ర

అమరనాథ్  యాత్ర
అమరనాథ్ దర్శించాలకోరిక తీరుతుందనుకోలేదు.  అమరనాథుని దయతో మా ప్రయాణం జులై  8 న హిమసాగర్ ఎక్స్ప్రెస్ లో బెజవాడలొ సా 5 గం  చల్లని వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదంగా మొదలైoది . పది మంది కలసి  బయలు దేరాము .మిత్రుడు శ్రీనివాస్ పూ ర్వానుభవంతో చక్కని ప్రణాళిక తయారు చేశాడు . మేమందరము ఏఆలోచనా లేకుండా ప్రశాంతంగా రైలు ఎక్కాము . రాత్రికి  చపాతి. మరో పది రోజులు అదే తిండి కదా ! చల్లగాలి హాయుగా నిద్రప ట్టి o ది . పొ ద్దున స్నానానికి లేపారు ( రైలు లోనే ). కొందరు స్నానంచేసారు . రోజంతా ప్రయాణం. రాత్రి 8గం డిల్లి చే రాము . మరునాడు 8గం జలంధర్ చేరాము . చక్రధర్ వాళ్ళబ్బాయ్ టిఫిన్ తెచ్చాడు . తరువాత పఠాన్ కోట్ లో మిత్రురాలుజస్విన్ దర్ కౌర్ భోజనం తెచ్చి oది . మధ్యాహ్నం 2 గం జమ్మూ చేరాం . వై ష్నో ధాం లో  దిగాము .స్టేషన్ కి బాగా దగ్గర . బాగుంది .   స్నానాలు . అందరం రంగనాథ ఆలయానికి బయలు దేరాం . గుడి చాలా బాగుంది . లక్ష శివలింగాలు గుడిచుట్టూ  ఉన్నాయి . అన్ని దేవుళ్ళ విగ్రహాలు,ఇంతకు ముందు ఎక్కడ చూడని దేవతా మూర్తుల ప్రతిమలు . చక్కని ప్రయత్నం . చాలాబాగుంది . ఎక్కడ చూసినా జవాన్లే . అడుగడుగుకి పరిశీ లనే.  రంగనాథుని గుడిలో  లక్ష్మీ నారాయణు లను  దర్శించి ప్రతాప సింహ  ఆలయానికి చే రాము . అక్కడినుంచి అమ్మవారి  ఆలయానికి . 5గం ల  వరకే  గుడి . చూడలేదు . అక్కడే రాజభవన్ . పక్కనే  తవి నది . నీళ్ళు లేవు చాలా లోతు దాదాపు కిలో మీటరు వెడల్పు . తిరిగి అందరం రూంకి చేరాం . మధ్యలో గుప్తా ట్రావెల్ లో  ప్రయాణం . రాత్రి  8. 15 అయి నా  చీకటి పడలేదు . చాలా ఆశ్చర్యం.రా 11 న  ఉ 5 గం  ప్రయాణం మొదలు .

















No comments:

Post a Comment