మాళవ రాజధాని ధారానగరంలో అప్పుడే సూర్యాస్తమయం అయింది.అస్తమిస్తున్న అరుణారుణ చైత్ర సంధ్యా శోభలు ధారానగర ప్రాసాదగోపురాలపై ప్రతిష్ఠించిన స్వర్ణ కళాశాలతో దోబూచు లాడుకుంటున్నాయి.
అదే సమయంలో భోజరాజు రాజప్రాసాదం పైఅంతస్థులో కొలువుదీరి కవితా గోష్ఠితో
వినోదిస్తున్నాడు. మహారాజు దృష్టి యెర్రని సంజవెలుగుల సొగసులతో లీనమైపోయింది.
ప్రక్కనే వున్న కవీశ్వరులవైపు సాభిప్రాయంగా చూశాడు. ఆయనభావం గ్రహించిన వారు
అందరూ ఒక్క్కొక్కరు ఒక్కొక్క పాదం చొప్పున సాంధ్య వర్ణన కవితలు చెప్పడం ప్రారంభించారు.
" పరిపతతి పయోనిధౌ పతంగః" సూర్యుడు సముద్రములో పడిపోతున్నాడు.
అని కృష్ణ కవి చెప్పాడు.
అయితే భోజరాజు ముఖంలో అసంతృప్తి కనిపించింది. ఆయన కళింగ కవి వైపు చూశాడు. వెంటనే అతడు
"ఉపవన తరుకోటరే విహంగః " ఉద్యానవనంలోని చెట్టు తొర్రలో పక్షి ప్రవేశిస్తున్నది. అని అర్థం. ఇంకా మహారాజుకు తృప్తి కలుగలేదు. పక్కనే కూచున్న మహేశ్వర కవి వైపు చూశాడు. ఆయన వెంటనే
"సరసిరుహా ముద రేషు మత్త భృంగః" సాయంకాలం కాగానే మదించిన తుమ్మెద తామర
పూవులో పడిపోతున్నదని. భావం. ఇంకా రాజుకు తృప్తి కలగలేదు. కొంచెం దూరం లో నున్న కాళిదాసు వైపు చూశాడు. కాళిదాసు కొంచెం సేపు ఆలోచించి,
"యువతి జనేషు శనైశ్మనై రనంగః" అని శ్లోకం పూర్తి చేశాడు. అంటే సాయంకాలం కాగానే
యువతీ జనంలో నెమ్మది నెమ్మదిగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు. అని తాత్పర్యం.
సభాసదులంతా ఒక్కసారిగా శిరః కంపం చేసి కరతాళ ధ్వనులు చేసి ఔను ఔనని
ప్రశంసించారు. వెంటనే కాళిదాసు ఆ శ్లోకం అంతా ఎంతో శ్రావ్యంగా పఠించాడు.
"పరిపతతి పయోనిధౌ పతంగః"
ఉపవన తరు కోటరే విహంగః
సరసిరుహా ముదరేషు మత్త భృంగః
యువతి జనేషు శనైశ్మనై రనంగః
శ్లోకం పూర్తి చేసేసరికి తిరిగీ సభాసదులు హర్షామోదాలతో క్రేతాన్కరతాళ ధ్వనులు చేశారు.
వెంటనే భోజరాజు తన మెడలోని ముత్యాలహారం తీసి కాళిదాసకవి కంఠం లో అలంక రించారు. సభాసదులందరూ భోజరాజు ఔదార్యాన్ని అనేక విధాలుగా ప్రశంసించారు.

No comments:
Post a Comment