Sunday, June 14, 2020

Kalidas

कालिदासस्य कृतिषु भारतीय-संस्कृतिः (२)

भारतीय-संस्कृतेः एकं वैशिष्ट्यम् विद्यते। अत्र जीवनस्य सर्वेषां पक्षाणां न केवलं स्वीकरणम् अपि तु समानं महत्त्वं च भवति। अस्य विषयस्य प्रतिपादनं कालिदासेन रघुकलस्य राज्ञः चरितानां वर्णने मनोहारि-रूपेण कृतम् अस्ति।

धर्मः, अर्थः, कामः मोक्षः च एते चत्वारः पुरुषार्थाः। एते सर्वे मानवजीवनस्य अभिन्नानि अङ्गानि इति अपि वक्तुं शक्यते। बाल्यावस्थायां बुद्धेः ग्रहणशक्तिः तीक्ष्णतरा वर्तते इति, अस्मिन् वयसि प्राप्ताः संस्काराः आजीवनं लाभप्रदाः भवन्ति, सदैव मनुष्यस्य उपकारिणः सन्ति इति कारणेन बाल्यात् आरभ्य पञ्चविंशतिवर्षपर्यन्तं विद्यार्जनं करणीयम् इति निर्दिष्टम्। ब्रह्मचर्यं पालयन्तः तस्मिन् काले गुरुकुले गुरुणा सर्वेऽपि समानरीत्या भावयन्ति स्म। सर्वे शिष्याः गुरोः आज्ञां पालयन्तः, अनुशासनेन परिश्रमेण च विद्यार्जनं कुर्वन्ति स्म। न कोऽपि धनाढ्यः सम्पन्नः इति विशेषरूपेण सत्क्रियते अथवा दरिद्रः विजातीयः इति विप्रकार्यते। अनेन समदर्शनः भावः स्वतः सर्वत्र दृश्यते स्म। किमपि अस्य विषये पाठनीयः कल्पनीयः वा न अभवत्, वस्तुतः सर्वे अनेन भावेन व्यवह्रियन्ते स्म, एतावदेव। एवं राजकुमाराः अपि समत्त्वस्य, सरलजीवनस्य कठिनश्रमस्य च व्यावहारिकं शिक्षणं प्राप्नुवन् । सर्वे छात्राः विद्या सर्वोपरि अस्ति इति जानतः श्रद्धया विद्यार्जनं अकुर्वन्। सर्वैः बालैः विद्वांसः पूजनीयाः इति एषः संस्कारः बाल्यात् एव साक्षात् दर्शनेन ज्ञायते स्म। उपदेशेन वा वारं वारं कथनेन वा विद्यार्थिषु तथा प्रभावः न जायते यथा ज्येष्ठैः कथं व्यवह्रियते, अनुष्ठीयते तस्य साक्षात् अनुकरणेन भवति इति तु विदितम् एव।

एवमेव रघुवंशीयाः राजानः यौवने गार्हस्थ्यधर्मं स्वीकृत्य भोगविलासानि सुखानि च अनुभवन्ति स्म। सत्पथेन सत्कर्मणा धनम् अर्जयन्ति स्म। गृहस्थाः  स्वे स्वे कर्मणि रताः अर्थं कामं च  पुरुषार्थौ पालयन्ति स्म।

सूर्यवंशीयाः महीपतयः वार्धके वानप्रस्थाश्रमं स्वीकुर्वन्ति स्म, आध्यात्मिकं विषयं प्रति अधिकं उन्मुखाः अभवन् । अन्तिमे काले तु योगेन शरीरं त्यजन्ति स्म।

शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणाम् ।
वार्द्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् ॥ १-८॥

कालिदासेन रघुकुले जायमानाः राजानः किमर्थं कथं च पुरुषार्थम् अपालयन् इति अपि सम्यक् विवृतः अस्मिन् श्लोके –

त्यागाय संभृतार्थानां सत्याय मितभाषिणाम् ।
यशसे विजिगीषूणां प्रजायै गृहमेधिनाम् ॥ १-७
एते राजानः अर्थस्य संग्रहणम् अकुर्वन्। किमर्थम् इत्युक्ते स्वार्थसिद्ध्यर्थं वा भोगविलासार्थं वा इति न। दानाय, परोपकाराय, प्रजाभ्यः आनुकूल्यार्थमेव रघुकुलवंशीयाः धनसञ्चयम् अकुर्वन्। सत्यं वदन्तः ते मितं च सारं च भाषन्ते स्म। युद्धः क्षत्रियाणां धर्मः। दिलीपः आदयः नृपाः यशसे अयुध्यन्त, जेतुकामाः च आसन्। कुलस्य वर्धनाय, संरक्षणाय च गार्हस्थ्यधर्मं पालयन्ति स्म।

एवं रघुकुलवंशीयानां चरितं वर्णयन् कविः कालिदासः भारतीय-संस्कृतेः केचन अंशान् सोदाहरणं वर्णितवान्। चतुर्णां पुरुषार्थाणां कानि प्रयोजनानि, वर्णाश्रमाः के? ते कथं आचरेयुः इति प्रतिपादितवान् च।

Saturday, June 13, 2020

Kalidasa kavitha

కాళిదాసు రచించిన
कालिदासः भारतीय-संस्कृतिः च
कविकुलगुरुः कालिदासः रघुवंशे काव्ये सूर्यवंशीयानां राज्ञां विषये व्यवृणोत्। राज्ञां गुणान् विवृत्य कविः भारतस्य संस्कृतेः विषये अपि अनेकान् विषयान् प्रतिपादितवान्।
वृद्धत्वं इति शब्देन प्रायः वयोवृद्धत्वस्य एव बोधः भवति। रघुवंशीयाः आयुषा वृद्धाः न। किन्तु ते शीलवृद्धाः, ज्ञानवृद्धाः, वैराग्यवृद्धाः च।

सर्वविधं वार्धक्यं सम्मानं अपेक्ष्यते। वयोवृद्धाः सम्माननीयाः! जनाः तेषां आशीः सदैव आप्नुयुः।

वार्धक्यं चतुर्विधम् अस्ति। शास्त्रेषु अस्य किञ्चित् विवरणम् दृश्यते। वयोवृद्धत्वं, शीलवृद्धत्वं, ज्ञानवृद्धत्वं वैराग्यवृद्धत्वञ्चेति। एतदपि सूचितं तत्र यत् एषु चतुर्षु उत्तरोत्तरं अधिकं श्रेष्ठतरं वृद्धत्वं किमिति। वयोवृद्धत्वात् शीलवृद्धत्वं, शीलवृद्धत्वात् ज्ञानवृद्धत्वं, ज्ञानवृद्धत्वात् वैराग्यवृद्धत्वं श्रेष्ठतरम् इति।
मनुस्मृति-ग्रन्थे मनुः ऋषिः अपि उक्तवान् –

न तेन वृद्धो भवति येनास्य पलितं शिरः।
युवाप्यधीयानस्तं देवाः स्थविरं विदुः।। २/१५६ मनुस्मृतिः

राजा दिलीपस्य गुणान् वर्णयन् कालिदासः वदति –
अनाकृष्टस्य विषयैर्विद्यानां पारदृश्वनः,
तस्य धर्मरतेरासीत् वृद्धत्वं जरसा विना।।

रघुकुले उत्पन्नः दिलीपराजस्य वयो-वार्धक्यं विना वृद्धत्वम् आसीत् । सः सदैव धर्मरतः आसीत्। सः, तस्य अनुयायिन्यः प्रजाः च रेखामात्रमपि मनुना प्रणीतेन मार्गेण विक्षुण्णाःः न भवन्ति स्म। अतः दिलीपः शीलवृद्धः। सर्वासु विद्यासु पारङ्गतः सः ज्ञानवृद्धः। विषयवस्तूनां प्रति सः न कदापि आकृष्टः अभवत् इति कारणात् तस्य वैराग्यवृद्धत्वम् अपि सिद्धम् । एवं दिलीपः राजा शीलात्, ज्ञानात्, वैराग्यात् च प्रौढताम् प्राप्नोत्। वयोवृद्धः न सन्नपि तस्य वार्धक्यम् आसीत्।

अहो वाग्मिता कालिदासस्य! भारतस्य संस्कृतिं प्रति कियती श्रद्धा, कियान् गौरवः, भारतीयसंस्कृतेः कियत् ज्ञानं च।

Sunday, May 10, 2020

మాతృ పంచకం శంకరాచార్య విరచిత

మాతృ పంచకం

మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం

(అర్థ తాత్పర్యాలతో)
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరcణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.

ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.

"ఆస్తాం తావదియం ప్రసూతి
సమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ
 శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార
 భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి
 తనయః తస్యై జనన్యై నమః".

 తాత్పర్యము:
అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను(కడుపునొప్పి) అనుభవించావో కదా !
కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా ! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు.
ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు నమస్కారం చేస్తున్నాను.

"గురుకులముప సృత్య
స్వప్న కాలే తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః."
తాత్పర్యము:
కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను

"అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః."
తాత్పర్యము:
పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా ! గోవిందా !" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

"న దత్తం మాతస్తే
మరణ సమయే తోయమపివా
స్వ ధా వా నో దత్తా
మరణదివసే శ్రాద్ధవిధినా
న జప్త్వా మాతస్తే మరణ
సమయే తారక మను-
రకాలే సంప్రాప్తే మయి
 కురు దయాం మాతురతులామ్."

తాత్పర్యము: అమ్మా ! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని(ఓం రామాయనమః" అను ఆఱు అక్షరముల మంత్రమని కొందఱు "ఓం శ్రీరామరామ" అనునదే తారకమని మరికొందరు) చదవలేదు . నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ !!

"ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్."
తాత్పర్యము:
అమ్మా !
"నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా ! , నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి " అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను.నన్నుక్షమించు.

Wednesday, April 29, 2020

రామాయణం ఏడు తాడి చెట్టు

శ్రీ రాముడు మరమర (ఒకే వరుసలో ఉండే చెట్లు) చెట్ల పైకి బాణాన్ని ఎందుకు గురి పెట్టాడు?
కింది పిక్ చూడండి.

ఒకప్పుడు ఒక రాజు మనిభద్ర అనే వారు ఉండే, ఆయనకు 7మంది మగ  సంతానం,ఆయన భార్య పేరు కవిక.ఆ ఏడుగురు కొడుకులు  కూడా క్షుద్ర పూజలు, మాయలు లాంటి యక్షిణీ విద్యలు నేర్చుకున్నారు.ఒకరోజు వారు నేర్చుకున్న శక్తులతో ఒక  పెద్ద పాము ను సృష్టించారు. అలా ఋష్య మూక పర్వతానికి వెళ్తున్నప్పుడు వారికి అగస్త్య ముని కనిపించాడు. వారు వెంటనే ఒక పామును చేసి దానిని భూమిలో రంద్రం చేసి పాతేసి దాని మీద ఒక చెట్ల వరుసలా మారిపోయారు.

ఇదంతా తెలుసుకొన్న మహర్షి ఎప్పటికీ శాశ్వతం గా అలాగే చెట్ల లాగానే ఉండిపొమ్మని శాపం ఇచ్చాడు. జరిగిన దానికి పశ్చాత్తాప పడిన వారు శాప విమోచనం కోరగా అప్పుడు ఆ మహర్షి ఎప్పుడైతే శ్రీ రాముడు వచ్చి ఒకే బాణం తో మిమ్మల్ని కూలుస్తాడో అప్పుడే మీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.

రాముడు వచ్చి ఆ చెట్లను చూసి జరిగిన విషయం గ్రహించి ఆ పాముగా మారిన రాయిని తన బొటనవేలితో పట్టుకొని ఒక్క బాణాన్ని చెట్ల పైకి వదిలాడు.అవి టపటప మని కూలిపోతూ కిందపడి పోయాయి,వారికి శాప విమోచనం జరిగింది.

ఇది అప్పటి సందర్భాన్ని గుర్తు చేస్తూ చెక్కిన శిల్పము,ఇది ఋష్యమూక పర్వతం, కిష్కింధ, అని మాత్రమే నాకు తెలుసు.

The Story of Rama putting an arrow through maramara trees

By

P.R.Ramachander

There was a king called Manibhadra and he had several sons from his wife Kavika. Seven those sons learnt evil magic,One day by their magic they made a big serpent.When going over Rishya mooka mountains , they saw Agasthya coming that way.They made the snake in to a circle ,buried it in earth and stood on it as Sala trees,Understanding the truth , the sage cursed them to stand there forever as trees.They realized their mistake and begged the sage for relief from the curse.He told them when Rama puts in an arrow in all of them , they would get freedom freom the curse.When Rama came there , he recognized them and by his thumb pressed a stone on which the serpent was lying , which made it straight and Rama put an arrow through them.

Sunday, April 19, 2020

Sanskrit

श्लोकः :- क्षणशः कणशश्चैव विद्यामर्थश्च चिन्तयेत्।
               क्षणत्यागे कुतो विद्या कणत्यागे कुतो धनम्।।
 ---------------------
#अर्थः :- क्षण-क्षण विद्या के लिए और कण-कण धन के लिए प्रयत्न करना चाहिए। समय नष्ट करने पर विद्या और साधनों के नष्ट करने पर धन कैसे प्राप्त हो सकता है॥
-----------------
#Meaning :-   One should try moment-to-moment for learning and particles-to-particles for riches. How can one get education by wasting time and money by wasting resources?

#Sanskrit #india  #culture #money #education #knowledge #moment #resources #particles #waste #gyan #try #success #life #rech #SanskritSlogans #truthoflife #संस्कृतम् #संस्कृतंभारतम् #संस्कृतसूक्ति #संस्कृतसूक्तिः #संस्कृतभाषा #देवभाषा

Tuesday, April 7, 2020

బార్బరీకుడు

(కధ అర్థం కావడం కోసం ఇంగ్లీష్ పదాలు వాడారు )

మహాభారతంలోని బర్బరీకుడి  కథ..!

ఎన్ని రకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు... మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు..! బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో.. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి... కృష్ణుడు తన మాయోపాయంతో బలిగొన్న మరో మహాభారత పాత్ర ఇది... నిజానికి భాగవతం అంటేనే కృష్ణుడి చరిత్ర అనుకుంటాంగానీ, నిజానికి భారతం నిండా కూడా కృష్ణుడే... తను లేనిదే భారతం లేదు.... భారతం లేనిదే కృష్ణుడూ లేడు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా..? తను ఘటోత్కచుడి కొడుకు. (ఘటోత్కచుడు ఎవరూ అని అడగకండి. మాయాబజార్ సినిమా చూడని తెలుగువాడు ఎవరున్నారని..?) లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో... హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు. (ఆ కథ వేరు. వాళ్ల కొడుకే ఘటోత్కచుడు.. ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు మురు బిడ్డ మౌర్వి (అహిలావతి) ని పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు... నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు...
రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని... అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా.. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది. ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను 'త్రిబాణధారి' అంటారు.
పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక... భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ.. బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని కోరుకుంటాడు... వెళ్లే ముందు తల్లికి ఓ మాటఇస్తాడు. "ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే మాత్రం... నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను... ఓడిపోయేవారిని గెలిపిస్తాను".. ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు...
యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడినీ కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు.. 'నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు.?' ఇదీ ప్రశ్న... 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు... 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు... ఇలా తలాఓరకంగా చెబుతారు... దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు కృష్ణుడు... ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి.. 'కృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా..? అని అడుగుతాడు... నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు... కృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు... వాటి శక్తి వివరిస్తాడు.
నేను ఒక బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని. వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది... (టార్గెట్స్ ను ఐడెంటిఫై చేస్తుంది. రెండే బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది... మూడే బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు... నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవడూ దీన్ని నమ్మడు.. నమ్మలేడు అంటాడు కృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు కృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు... చేసి చూపించుఅంటాడు కృష్ణుడు...
బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లుమూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు కృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా కృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది. అందుకే అదక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి. లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు.. తప్పనిసరై పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది... (రక్షింపబడాల్సినవి... తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది.... ఆశ్చర్యంగా చూస్తాడు కృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు... బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే.. కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేననీ గుర్తిస్తాడు... కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనమడు కాబట్టి. పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది..? అందుకే దివ్యదృష్టిని సారించి, కొన్ని నిజాలు తెలుసుకుని, ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు.ఏమోయీ, నువ్వు ఎవరు..? నువ్వు కూడా యుద్ధం చేస్తావా..?నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను, చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను...
పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది... కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు... అంటే పాండవులే బలహీనులు కదా...అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది...
అదే జరిగితే, వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు, కౌరవులు బలహీనులు అవుతారు కదా...అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా.. మరేం చేయుట..?ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని, అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి, ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ. విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది... కృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా...ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు కృష్ణుడు... అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు కృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు...సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు... "యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా.. ఇంత భారీ జనహనన యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ, నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి, నాకివ్వు..' అంటాడు కృష్ణుడు... నన్నే ఎందుకు బలి ఇవ్వాలి, ఇంతమంది యోధులు ఉండగా... పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని .ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు.“బర్బరీకా.... నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి.. భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి విష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు... దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను... ఇదంతా వింటున్న నువ్వు 'ఈమాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి..? నేనొక్కడిని చాలనా' అని ఒకింత పొగరుగా మాట్లాడావు.. దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. 'ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు, మొట్టమొదట బలయ్యేది నువ్వే' అని శపించాడు. అందుకే నీ బలి... అంతేకాదు, నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు కృష్ణుడు. కానీ నాకు యుద్దానికి చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు కృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు... కృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు...యుద్ధం ముగిసింది. విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు కృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత కృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు... "వత్సా. ఈ మొత్తం యుద్దంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే.. నువ్వు చెప్పు. ఏం గమనించావో..?" స్వామీ, ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను... మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను... ఆ మహాశక్తి, నువ్వు మాత్రమే యుద్ద కారకులు, యుద్ధకర్తలు... మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే... అని సమాధానమిచ్చి, తన శాపం ముగిసిపోయి, తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ..!

Wednesday, March 18, 2020

కోటేరు

*కోటేరు లాంటి ముక్కు  అంటారు.  దయచేసి వివరించ గలరు*
----------------------------

కోటేరు అన్నది కోట +ఏరు అన్న రెండు పదాల కలయిక.

*కోట్- అన్న ధాతువుకు వంగిన అన్న అర్థాలున్నాయి.  తమిళంలో, మలయాళంలో కోటుకై అంటే వంగిన చేయి. తెలుగులో కూడా కొడవలి అన్న పదంలో ఉన్న కొడ్- వంగిన అన్న అర్థంలోదే. అలాగే, గోడివడు- అంటే వంగు అన్న అర్థం కూడా దీనికి చెందిందేనని నా అభిప్రాయం.

ఏరు- అన్నది మళ్ళీ నాగలికి సంబంధించిందే. భద్రిరాజు కృష్ణమూర్తి ప్రకారం దీని మూలధాతువు *చేర్-. కన్నడ, తమిళాదులలో ఇది ఆర్, ఎర్, సేర్ అని కూడా కనిపిస్తుంది. 

తమిళంలో కోటర్ అంటే నాగలి చివర భాగం, అంటే కఱ్ఱు (ploughshare). తెలుగులో కూడా ఉన్న కోటేరు నాగలి చివరిభాగాన్నే సూచిస్తుందని భావించాలి (నాగటి దుంప యందు అమర్చెడి ఇనుప పాళము). అయితే కోటేరు లాంటి ముక్కు అన్నప్పుడు పూర్తిగా నాగలి రూపాన్ని తలపించే ముక్కనే అనుకోవాలి. ముక్కు దూలం మహా సూటిగా ఉండి చివర నాగటి  కఱ్ఱు లాగా వంపు తిరిగినది అని భావన.

Monday, February 17, 2020

పెళ్ళి కూతురు

*పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి*

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది.

గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.
సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు.
సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు.
అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.
ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!

 పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది.
అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.
ఆమెయే ఆతని లక్ష్మి.
అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.
అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.
అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.
ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది.

ఆమె ‘నిత్యానపాయినీ’.
ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.
శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ,
విరజానది గౌతమిగా,
వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!
అని గోపరాజు గారు.

 శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.
ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు.
అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ.
అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది.
ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.

ఇక్కడ లక్ష్మి పుట్టింది.
అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను.
ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది.
అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం.
ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.

 ఎంతో ధార్మికంగా సంపాదించాలి.
ఆయనకి సంతానం కలగాలి.
ఆయన సంతోష పడిపోవాలి.
ఆయన తండ్రి కావాలి,
 తాత కావాలి.
ముత్తాత కావాలి.

ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.
ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.
 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి.
అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం.
ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు.
తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.
ఈమె నీ లక్ష్మి.
ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ.
మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది.
బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు.
మేనమామలు ప్రేమైక మూర్తులు.

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం.
నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది.

నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.
 అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు.
లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి.
మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు.
మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది.
అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను.
భర్తృ  భావనతో చూడలేదు.

 పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు.
అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.

అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక? నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి.

అధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు.
వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు.

ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి.

                                 ఇట్లు
                                    మీ
                  అవధానుల శ్రీనివాస శాస్త్రి

పెళ్ళి కూతురు

*పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి*

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది.

గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.
సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు.
సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు.
అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.
ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!

 పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది.
అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.
ఆమెయే ఆతని లక్ష్మి.
అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.
అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.
అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.
ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది.

ఆమె ‘నిత్యానపాయినీ’.
ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.
శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ,
విరజానది గౌతమిగా,
వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!
అని గోపరాజు గారు.

 శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.
ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు.
అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ.
అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది.
ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.

ఇక్కడ లక్ష్మి పుట్టింది.
అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను.
ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది.
అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం.
ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.

 ఎంతో ధార్మికంగా సంపాదించాలి.
ఆయనకి సంతానం కలగాలి.
ఆయన సంతోష పడిపోవాలి.
ఆయన తండ్రి కావాలి,
 తాత కావాలి.
ముత్తాత కావాలి.

ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.
ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.
 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి.
అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం.
ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు.
తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.
ఈమె నీ లక్ష్మి.
ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ.
మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది.
బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు.
మేనమామలు ప్రేమైక మూర్తులు.

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం.
నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది.

నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.
 అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు.
లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి.
మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు.
మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది.
అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను.
భర్తృ  భావనతో చూడలేదు.

 పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు.
అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.

అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక? నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి.

అధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు.
వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు.

ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి.

                                 ఇట్లు
                                    మీ
                  అవధానుల శ్రీనివాస శాస్త్రి

Tuesday, February 11, 2020

రుద్రం

రుద్రాభిషేకం 🙏
“రుద్రం” (శివ స్వరూపము) - 1వ భాగము.
విశ్లేషణ - శాస్త్రి ఆత్రేయ (ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

రుద్రం - లయం చేసేది / చీకట్లను నిర్మూలించేది / అజ్ఞానాన్ని తొలగించేది.

రుద్రానికి సంబంధించి ఎన్నో కర్మకాండలను, యజుర్వేదము తన మంత్రభాగంలో వివరించడం జరిగింది. అవి రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతిరుద్రంగా విభజించడం జరిగింది.

ఇందులో కర్మ భాగము :

యజుర్వేద మంత్రభాగంలో పేర్కొన్న పదకొండు అనువాకాలకి “రుద్రం” అని పేరు. దీనిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకాన్ని “రుద్రాభిషేకము” అంటారు. ఈ పదకొండు అనువాకాల రుద్రాన్ని పదకొండుసార్లు పఠిస్తూ చేసే అభిషేకానికి “ఏకాదశ రుద్రాభిషేకము” లేదా “రుద్రి” అంటారు.

రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకాన్ని లఘురుద్రాభిషేకమని, ఇటువంటి పదకొండు లఘురుద్రాభిషేకాలను మహారుద్రమని, ఈ మహారుద్రాలు పదకొండయితే అతిరుద్రమని చెప్పబడింది.

ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే రుద్రాభిషేకమని, వీటిని హోమంలో వినియోగిస్తే రుద్రయాగమని సూచించడం జరిగింది.

ఈ అభిషేక తీర్థాన్ని లేదా యాగ భస్మాన్ని జీవుడు భక్తితో గ్రహించటం ద్వారా, జీవాత్మను ఆశ్రయించి వున్న సమస్త దోషాలు తొలగిపోయి, జీవుడు పరమాత్మలో ఐక్యం చెందుతాడని చెప్పబడింది.

ఇందులో జ్ఞాన విభాగము :

“నారుద్రో రుద్రమర్చయేత్” అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడని చెప్పబడింది.

ఇది అంత సులభంగా సాధ్యపడదు. ఎంతో సాధన కావాలి. సాధనతో సత్యాన్ని గ్రహించాలి. సత్యమే ఆత్మగా గ్రహించాలి. తనలోనే సచ్చిదానంద స్వరూపునిగా విరాజిల్లే పరమశివుణ్ణి సర్వకాల, సర్వావస్థలయందు అనుభూతి పొందాలి. చివరికి “చిదానందరూపః శివోహమ్! శివోహమ్!” అన్న స్థితికి చేరుకోవాలి. అదే బ్రహ్మైక్య స్థితి. ఆ స్థితినే ఆదిశంకరులు తమ “ఆత్మషట్కము”లో ఎంతో సుళువుగా అభివర్ణించారు.

భక్తులకోసం రుద్రాభిషేక ఆచరణ :

అందుకనే మహనీయులు “మహాన్యాసము” అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు అందించేరు. అప్పటినుంచి ఈ మహాన్యాసము రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి ఆచారణలోకి వచ్చింది. మహాన్యాసము అంటే భక్తుడు రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేసే అధికారం పొందుటకు, వాటికి ముందు మహిమాన్వితుడైన రుద్రుని తన ఆత్మ యందు విశిష్టముగా నిలుపుకొనుటయే రౌద్రీకరణము. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్రములో నమకము, చమకము ఎంతో ముఖ్యమైనవి. “నమః”తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, “చమే”తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనముగా చెప్పబడ్డాయి.

తదుపరి భాగాలలో నమకము, చమకము గురించి ప్రస్తావించుకుందాము.

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

Monday, February 10, 2020

హనుమంతుడు

జయహో భక్త హనుమాన్‌
సప్త చిరంజీవులలో ఒకడు, శ్రీరాముడికి ప్రియ భక్తుడు. అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటి మరీ లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు.
ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకు వచ్చి కదన రంగాన వివశుడై పడి ఉన్న లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వాన్ని అణచినవాడు అయిన వీర హనుమాన్‌ శక్తి యుక్తులను కీర్తించడం సాధ్యమా?
భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఆయన్ని ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. వాయుదేవుడి వరప్రసాదంగా జన్మించాడు కనుక వాయుపుత్రుడని, పవన సుతుడనీ అంటారు. సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి పేర్లతో కూడా ఆరాధిస్తారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన హనుమంతుడు తాను స్వయంగా అంతులేని పరాక్రమవంతుడయ్యి కూడా శ్రీరాముని సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
ఆయనకు శ్రీరాముడంటే ఎంతటి భక్తి ప్రపత్తులంటే తన మనసునే మందిరంగా చేసి మరీ వారిని ఆరాధించాడు. ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతే వచ్చే బాధలూ తొలగిపోతాయి. బుద్ధి బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. అందుకే హనుమజ్జయంతి పర్వ దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుని అర్చిస్తారు.
‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్ప వారి పరిపూర్ణలోచనం మారుతీం సమత రాక్షసాంతకం’  అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూంటుందో అక్కడ కళ్లనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడట హనుమంతుడు. దీనిని బట్టి శ్రీరామ నామ జపం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు.
సూర్యాంజనేయం సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం. అది మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి. హనుమంతునికి రాముని తర్వాత సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడదు. ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎర్రని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరితే ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే. దీని అర్థం ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించటం వాళ్ల మొదటి అనుబంధం.
సూర్య శిష్యరికం బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి విద్యను అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా అంగీకరించాడు.
సూర్యుని దగ్గర హనుమంతుడు విద్యను అభ్యసించేందుకు ఉదయాద్రిపై ఓ పాదం, అస్తాద్రిపై ఓ పాదం ఉంచి వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు. సూర్యుని శిష్యరికం వల్లే శ్రీరాముని మొదటి సమాగమంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతో, సింహికను శక్తితో, సురసను యుక్తితో జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.
సూర్యపుత్రునికి స్నేహితుడు సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే.వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావనా లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య.
అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది.హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడే. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాభాగ్యం హనుమకి దక్కింది. శ్రీరామునితో పరిచయమైన నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.  – కృష్ణ కార్తీక
హనుమధ్యాన శ్లోకాలు ►హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో కొలిచిన వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
►విద్యా ప్రాప్తికి పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్దోష వినాశన! సకల విద్యాం కురుమే దేవ రామదూత నమోస్తుతే!!
► ఉద్యోగ ప్రాప్తికి హనుమాన్‌ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
►కార్య సాధనకు అసాధ్య సాధక స్వామిన్‌ అసాధ్యం తమకిమ్‌ వద! రామదూత కృపాం సింధో మమకార్యమ్‌ సాధయప్రభో!!
►ఆరోగ్యానికి ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా! ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
►సంతాన ప్రాప్తికి పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్‌! సంతానం కురుమే దేవ రామదూత నమోస్తుతే!!
►వ్యాపారాభివృద్ధికి సర్వ కళ్యాణ దాతరమ్‌ సర్వాపత్‌ నివారకమ్‌! అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్‌!!
►వివాహ ప్రాప్తికి యోగి ధ్యే యాంఘ్రి పద్మాయ జగతాం పతయేనమః! వివాహం కురుమేదేవ రామదూత నమోస్తుతే!! ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు(.సేకరణ)
ఆంజనేయ. వరభీమ. రామదూత మంపాహే

దీని స్తుతి

🍁శ్రీ దీపలక్ష్మీస్తోత్రమ్ 🍁

దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే, దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్  స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం స్తోతుం భవన్తమభిలష్యతి జన్తురేషః
దీపః పాపహరో నౄణాం దీప ఆపన్నివారకః దీపో విధత్తే సుకృతిం దీపస్సమ్పత్ప్రదాయకః
దేవానాం తుష్టిదో దీపః పితౄణాం ప్రీతిదాయకః దీపజ్యోతిః పరమ్బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః
దీపో హరతు మే పాపం సన్ధ్యాదీప నమోఽస్తు తే
ఫలశ్రుతిః యా స్త్రీ పతివ్రతా లోకే గృహే దీపం తు పూరయేత్
దీపప్రదక్షిణం కుర్యాత్ సా భవేద్వై సుమఙ్గలా
ఇతి శ్రీదీపలక్ష్మీస్తోత్రం సమ్పూర్ణమ్

  🌻సమస్తలోకాః సుఖినోభవంతు,శుభోదయ🌻

Tuesday, February 4, 2020

ఖగోళ శాస్త్రం

కీశే మహోపాధ్యాయ శ్రీ పటాని సమంత్ గారు.
పాశ్చాత్య విజ్ఞాన మేధస్సుకు ప్రభావితం కాకుండా పూర్తిగా స్వయంకృషితో విజ్ఞాన తృష్ణతో ఖగోళ శాస్త్ర రంగానికి తమ కృషి ఫలాలు అందించిన పటాని సమంత్ పూర్తిపేరు మహామహోపాధ్యాయ చంద్రశేఖర్ సింగ్ హరిచందన్ మహాపాత్ర సమంత్. ఈయన పటాని సమంత్ చంద్రశేఖర్ గా కూడా ప్రసిద్ధి చెందారు.
బాల్యం :-
ఈయన 13 డిసెంబర్ 1835 లొ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ వైజాగపటం జిల్లాలో  ఖండాపర ప్రాంతంలో జన్మించారు. బాల్యం నుంచి విశ్వం, ఖగోళం, రాశులు మొదలైన అంసాల మిద ఆసక్తి పెంచుకొని సంస్కృతంలోని శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. ప్రాచీనుల శస్త్రీయ పరిజ్ఞానాన్ని ఔపాశన పట్టారు. ఈయన జీవిత కాలంలో పాశ్చాత్య దేశాలలో ఖగోళ విజ్ఞాన పరిధిపెరుగుతున్నా, ఈయనకు ఏ మాత్రం తెలియడానికి అవకాశమూలేదు. ఆ ప్రభావానికి దరి చేరనేలేదు. అందుబాటులో ఉన్న సంస్కృత  భాషలోని సంప్రదాయ సిద్ధాంత గ్రంథాలనే అధ్యయనం చేసి, ప్రయోగశీలిగా రూపొందారు.
ఖగోళ పరిశోధనలు :-
కంటితో చూడలేని ధనూరాశిని అయిదారు శతాబ్దాల క్రితమే మన పూర్వీకులు కనిపెట్టగలిగారు. ధనూరాశినే కాదు. మిగిలిన పదకొండు రాశులను వారు ఏ శాస్త్రీయ పరిజ్ఞానంతో గుర్తించగలిగిందీ ఈ రోజున మనం తెలుసుకోలేకపోతున్నాం. రవి (సూర్యుడు) సప్తశ్వరుఢుడని చెబుతూ సూర్యకాంతి వేరురంగుల కలయిక అని వేలాది సంవత్సరాల ఏ విధంగా గుర్తించగలిగారు.ప్రపంచ ప్రఖ్యాత ఖగోల శాస్త్రవేత్త "నెకల్షన్ మెర్లే" జీవిత కాలానికి కొన్ని వందల సంవత్సరాల పూర్వమే శ్రీనాధకవి తన "కాశీ ఖండం"లో కాంతివేగాన్ని ఎలా చెప్పగలిగాడు? దానికి ఆయన కనిపెట్టలే;దు. తన కాలం నాటికి తెలిసిన శాస్త్రీయ జ్ఞానాన్ని ఆయన తన పధ్యాలలో అవసరార్థం వాడుకున్నారు. ఈ కోవలోనే పటాని సమంత్ ఖగోళ శాస్త్రానికి సంబంధించి చేసిన పరిశీలనలు, గణింపులకు మూలాధారాలేమిటో అంతుపట్టడం లేదు. ఖగోళ విజ్ఞానంలో దృగ్గోచరమయ్యే ఘటనాల విలువలు గణించడానికి ప్రధానంగా రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి భూకేంద్రసిథ్దాంతం , రెండవది సూర్యకేంద్రసిథ్దాంతం ఈ సిద్ధాంతాల ఆధారంగానే రోదసి మీద పరిశోధనలు, పరిశీలనలు గణింపులూ చేయవచును. ఖగోళంలో సంభవించే అపురూప సంఘటనల ఆధారంగా ఆయా గణింపులను, గణీంచిన విలువలను పరీక్షించి సరిచేసుకోవచ్చును. ఫక్తు సంప్రదాయ పండితుడైన పటాని సమంత్ 1874 లో జరుగబోయే శుక్ర గ్రహ సంక్రమణం (శుక్ర గ్రహం ప్రయాణ మార్గం - ట్రాన్సిల్ ఆఫ్ వీనస్) గూర్చి చాలా కాలం ముందుగానే ప్రకటించారు.
ఈయన పరిశీలనలకు జ్ఞాన ప్రపంచానికి కోపర్నికస్ తీసుకు వచ్చిన ఖగోళ శాస్త్ర విప్లవం గూర్చి పరిచయమే లేదు. అయినప్పటికీ 1874, డిసెంబరు 9 వ తేదీన శుక్ర గ్రహం సంక్రమణం ఈయన నిర్ధారించిన తేదీనే జరిగింది. ఎదిగీ ఎదగని ఆనాటి భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అధ్బుత పరిశోధనగా మిగిలి పోయింది. ఈ సంఘటన వ్య్వధి, సమయం ఆధారంగా భూమి - సూర్యుడి నడుమ దూరాన్ని గణన చేయతం ఎంతో ఆసక్తికరం. ఆనాడు దేశం లోని అనేకమందిని దిగ్భ్రాంతి పరిచిన ఆ సంఘటన బ్రిటిష్ పాలకులకు కూడా ఆసక్తిని కల్పించింది. ప్రభుత్వ అధ్వర్యంలో అబ్జర్వేటరీ సెంటర్లు ప్ర్రారంభమై పనిచేయడం ప్రారంభించేలా సమంత్ కృషి చేయగలిగాడు. అంతే కాదు, దేశంలో విద్యావంతులైన కొంతమంది జిజ్ఞానువులు, సంస్థానాధీశులు ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి పెంచుకొని, ఈ దిశగా కృషి ప్రారంభించారు.
పటాని సమంత్ పరిశీలించి గణింపులు చేసి, నిర్ధారించిన ఖగోళ సంఘటన తిరిగి 2004 జూన్ 8 న జరిగింది. 1874 తర్వాత తిరిగి శుక్రగ్రహం సంక్రమణం జరిగింది. ఈయన 1874 నాటి శుక్రగ్రహ సంక్రమణమునకు సంబంధించిన పరిశీలనలు, గణీంపులు పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన కృషికి ఏమాత్రం తీసిపోవు. విశ్వాంతరాళంలోని ఘటనా ఘటనలను తాము స్వయంగా తయారుచేసుకున్న పరికరాల సాయంతో, నైపుణ్యంతొ పరిశీలించారు. ఖగోళ రహస్యాలను ఛేదించడానికి అనేకానేక అంశాలను శోధించి తన జీవిత కాలాన్ని వ్యయపరచిన సమంత్ భవిషత్తరాల కోసం ఎన్నెన్నో అమూల్యమైన పరిశీలనలు, గణింపులు, నిర్దారణలు చేశారు. ఖగోళ శాస్త్ర అంశాలను అవిరామంగా శోధించి, పరిశోధించి, తమ కృషి యావత్తును సిద్ధాంతదర్పణ సంస్కృత గ్రంథంలో పొందుపరచారు. ఈ గ్రంథాన్ని ఒరియా లిపిలో తాళపత్రాల మీద రాయగా 1899 లో కలకత్తా యూనివర్సిటీ వారు ప్రచురించారు. ఈ గ్రంథం మొత్తం 2500 శ్లోకాలలో నిండి ఉంది.
సిద్ధాంత దర్పణం :-
సిద్ధాంత దర్పణలో ఖగోళ శాస్త్ర సంబంధమైన అనేక అద్భుత అంశాలు ఉన్నాయి. సూర్య, శుక్ర గ్రహాల బింబాల నిష్పత్తి 1:32 అని లెక్కించడం, పరమాద్భుతమేకాదు, విస్మయం కూడా ఇది 31 నిమిషాల 31 సెకన్లు అని లెక్కించడం మరింత గొప్ప విషయం. ఈయన రాసిన సిద్ధాంత దర్పన లోని అనేక ముఖ్యాంశాలను ఆంగ్లంలోనికి అరుణ్ కుమార్ ఉపాధ్యాయ అనువదించారు. అయినప్పటికీ పటాని సుమంత్ కృషి చరిత్ర గర్భంలోనే మిగిలిపోయింది. విశ్వాంతరాళంలో సంభవింపబోయే శుక్ర గ్రహ సంక్రమణం గురించి ఈయనకు ఎలా తెలిసిందో ఎవరూ ఊహించలేకపోయారు. స్వయంగా అధ్యయనం చేసి, గణించి, గుర్తించి పరిశీలనలు చేసి ఉండి ఉంటారని అందరూ భావిస్తారు.
అస్తమయం :-
ఖగోళశాస్త్ర విజ్ఞానంలో అనితర సాధ్యమైన కృషి చేసిన పటాని సుమంత్ 1904 లో మరణించాడు. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలలో మంత్ర రూపంలోనూ, శ్లోకాల రూపంలోనూ అనేకానేక వైజ్ఞానిక రహస్యాలు నిక్షిప్తమై ఉండేవి. ధృవుడు అనే కల్పిత పాత్రను సృష్టించి అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై "ఆకాశంలో అత్యున్నత స్థానాన్ని పొందిన నీ చుట్టూ సప్తఋషులు 26000 సంవత్సరాల అంతరాలలో ప్రకక్షిణలు చేస్తూ ఉంటారు" అని వరమిచ్చినట్లుగా భాగవత రచనలో ఉంది. విష్ణువచ్చల యనంలో ఒక వలయం పూర్తి కావడానికి 26000 సంవత్సరాలు పడుతుందని భాగవత రచయితకు హ్గిపార్చస్ (ఈ విషయాన్ని క్రీ.పూ 143 లో కనుగొన్నాడు) కంటే ఎంతో ముందుగా తెలియడం చాచా ఆశ్చర్యకరమే. ఇదే తరహాలో పటాని సమంత్ డాక్టరేట్లు, డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టాలు లేకుండానే అద్వితీయ కృషిచేసి ఖగోళ శాస్త్ర పరిశోధనలు వెలువరించారు. ఈయన ఖగోళ శాస్త్రపరమైన కృషి చిరస్మరణీయం. ఈయన చేసిన అపూర్వ పరిశోధనా కృషిని గుర్తించిన మన కేంద్ర ప్రభుత్వం (తపాలా శాఖ) 2001, జూన్ 11 వ తేదీన చంద్రశెఖర సుమంత్ పేరుమీదుగా ఒక పోస్టేజి స్టాంపును విడుదల చేసింది.

Tuesday, January 28, 2020

కాశి పట్టణము

*కాశిలో ..చేయవలసినవి..చూడవలసినవి..!💐

ఓం నమః శివాయ..!!🙏

కాశీ లో ప్రవేశించగానే ముందుగా..
కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని
కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి.

బస చేరుకున్న తరువాత ముందుగా..
గంగా దర్శనం..గంగా స్నానం.
కాలభైరవుని దర్శనం
కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం

కాశీ విశ్వేశ్వరుని దర్శనం
(ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)
కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది

అన్నపూర్ణ దర్శనం
భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).

కాశీ విశాలాక్షి దర్శనం
వారాహి మాత గుడి
ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు.
లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా
వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది
ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.

మణికర్ణికా ఘట్టంలో స్నానం.
(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి)
గంగా హారతి -
దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)
కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం
చింతామణి గణపతి దర్శనం
అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ
లోలార్కఈశ్వరుని దర్శనం
దుర్గా మందిరము
గవ్వలమ్మ గుడి
తులసీ మానస మందిరము
సంకట మోచన హనుమాన్ మందిరం.
తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం.
తిలాభాండేశ్వర దర్శనం

వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం -
ఇది కొంత దూరంగా ఉంటుంది.
ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.

గంగా నదీ ఘట్టాల దర్శనం -
అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు.

ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి.
ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు.
గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.
లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.

బిందు మాధవుని గుడి -
ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది.

ఓంకాళేశ్వర దర్శనం -
మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి.
రిక్షా అయితే మంచిది.
ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు మకారేశ్వరుడు చిన్నగా ఉంటాయి
కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు.

కృత్తివాసేశ్వర లింగం -
ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది.
స్వయంభూ లింగం.
కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత
ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే
మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల..
స్థలాలు..💐
విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో
అవిముక్తక..
ఆనందకానన..
మహాస్మశాన..
సురధాన..
బ్రహ్మవర్ధ..
సుదర్శన..
రమ్య..
కాశి..అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు.

స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది.
ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు
ముల్లోకాలు నాకు నివాసమే.
అందులో కాశీ క్షేత్రం నా మందిరం

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు.
ఈ హారతి దృశ్యాలను ప్రతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు.
వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

అయోధ్య,
మథుర,
గయ,
కాశి,
అవంతిక,
కంచి,
ద్వారక
నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి,
కాంచి,
మాయ,
ఆయోధ్య,
ఆవంతిక,
మథుర మరియు
ద్వారవతి" లు
సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.

ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.

కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.

కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.
కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.

🙏ఓం నమః శివాయ🙏

కాశి పట్టణము

*కాశిలో ..చేయవలసినవి..చూడవలసినవి..!💐

ఓం నమః శివాయ..!!🙏

కాశీ లో ప్రవేశించగానే ముందుగా..
కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని
కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి.

బస చేరుకున్న తరువాత ముందుగా..
గంగా దర్శనం..గంగా స్నానం.
కాలభైరవుని దర్శనం
కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం

కాశీ విశ్వేశ్వరుని దర్శనం
(ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)
కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది

అన్నపూర్ణ దర్శనం
భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).

కాశీ విశాలాక్షి దర్శనం
వారాహి మాత గుడి
ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు.
లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా
వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది
ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.

మణికర్ణికా ఘట్టంలో స్నానం.
(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి)
గంగా హారతి -
దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)
కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం
చింతామణి గణపతి దర్శనం
అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ
లోలార్కఈశ్వరుని దర్శనం
దుర్గా మందిరము
గవ్వలమ్మ గుడి
తులసీ మానస మందిరము
సంకట మోచన హనుమాన్ మందిరం.
తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం.
తిలాభాండేశ్వర దర్శనం

వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం -
ఇది కొంత దూరంగా ఉంటుంది.
ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.

గంగా నదీ ఘట్టాల దర్శనం -
అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు.

ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి.
ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు.
గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.
లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.

బిందు మాధవుని గుడి -
ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది.

ఓంకాళేశ్వర దర్శనం -
మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి.
రిక్షా అయితే మంచిది.
ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు మకారేశ్వరుడు చిన్నగా ఉంటాయి
కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు.

కృత్తివాసేశ్వర లింగం -
ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది.
స్వయంభూ లింగం.
కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత
ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే
మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల..
స్థలాలు..💐
విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో
అవిముక్తక..
ఆనందకానన..
మహాస్మశాన..
సురధాన..
బ్రహ్మవర్ధ..
సుదర్శన..
రమ్య..
కాశి..అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు.

స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది.
ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు
ముల్లోకాలు నాకు నివాసమే.
అందులో కాశీ క్షేత్రం నా మందిరం

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు.
ఈ హారతి దృశ్యాలను ప్రతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు.
వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

అయోధ్య,
మథుర,
గయ,
కాశి,
అవంతిక,
కంచి,
ద్వారక
నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి,
కాంచి,
మాయ,
ఆయోధ్య,
ఆవంతిక,
మథుర మరియు
ద్వారవతి" లు
సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.

ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.

కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.

కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.
కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.

🙏ఓం నమః శివాయ🙏

మహాభారతం లో ద్రౌపది

#ద్రౌపది :-

మహాభారతంలో ఒక ప్రత్యేకమైన పాత్ర.
ఈవిడ గురించి సద్విమర్శలు ఎన్ని ఉంటాయో దుర్విమర్శలు కూడా కొన్ని ఉంటాయి.
అది ఆవిడ పాత్ర వైశిష్ట్యం.
మహాభారతం గురించి తెలిపే రచయితల రచనా కౌశలానికి పదునుపెట్టే ఒక ప్రత్యేక పాత్ర ఈమె సొంతం.
ఆమె గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

#నారదపురాణం ప్రకారం :-

యముని భార్య శ్యామల

వాయువు భార్య భారతి

ఇంద్రుని భార్య శచీదేవి

అశ్విని దేవతల భార్య ఉష

వారివారి కర్తవ్య నిర్వహణ లోపం వలన భూమి మీద జన్మించండని బ్రహ్మ శపించాడట. వీరు వారి అంశలన్నీ ఒకచోట నిక్షిప్తం చేసి ద్రౌపదిగా యజ్ఞకుండం లోనుండి ప్రభవించినది గా చెపుతారు.
అందుకే

శ్యామల లోని -  ధర్మత, కారుణ్యం,క్రమశిక్షణ

భారతి లోని -  తెగింపు

శచీదేవి లోని -  వైభవం ఆక్రోశం

ఉష లోని -  అందం,లాలిత్యం,కోమలత్వం

ఉన్నాయని చెపుతారు.

 మరొక వివరణ ప్రకారం :-
〰️〰️〰️〰️〰️〰️〰️

1️⃣.ఇంద్రాణి అయిన శచీదేవి కర్మఫల వశాన

2️⃣.ఇంద్రసేన అను మౌద్గల్యుని భార్యగా జన్మించి అనంతరం

3️⃣.కాశీరాజు పుత్రికగా జనించి

...పంచకృత్త్వ స్త్వయోక్తోహం పతిం దేహీతి వై పునః |
...తత్తథా భవితా భద్రే!వచస్తద్భద్ర మశ్నుతే ||

ఐదుసార్లు పతినిమ్మని కోరావు కనుక మరుజన్మలో ఐదుగురు భర్తలను పొందగలవు అని శివుని చే వరం పొంది 🛐

4️⃣.ద్రౌపది గా తరువాత జన్మ లో ద్రుపదునికి అయోజనిగా యజ్ఞకుండం ♨️ నుండి జన్మిస్తుంది.

పాండవుల పూర్వ చరిత్ర :-
〰️〰️〰️〰️〰️〰️〰️

పూర్వం ఇంద్రుడు పురోహితుడైన విశ్వరూపుని అతని కుమారుడైన వృతాసురుని చంపడం వలన
అతనిలోని

ధర్మ గుణం యమునిలోనూ

బలగుణం వాయువు లోనూ

రూప లావణ్యాలు అశ్వనిదేవతలలోనూ
చేరతాయి

ఈ నాలుగు అంశాలతో ఐదవరూపం తో మనుష్యజన్మ ఎత్తమని శివుడు ఇంద్రుని శపిస్తాడు.

పాండవులలో పంచభూత ప్రాధాన్యత :-
➖➖➖➖➖➖➖➖➖

ఇంద్రుని యొక్క పాంభౌతిక తత్వాలు

☸️

ధర్మః పృథ్వ్యనిలో భీమః
జలం పార్థో నలం స్ప్మృతః |
నకులః రూపతశ్చాగ్నేః
సమదేవో నభస్ప్మ్తృతః ||

☸️

౼ మార్కండేయ పురాణం

పృథ్విభాగం - ధర్మరాజు 🎲

వాయుతత్వం - భీముడు 🏋️

జలాంశం - అర్జునుడు 🎯

అగ్నితత్వం - నకులుడు 🏇

ఆకాశభాగం - సహదేవుడు 🤺
గాను

జన్మించారని చెపుతారు.

మరొకవివరణ ప్రకారం :-
〰️〰️〰️〰️〰️〰️

1️⃣.దేవలోక అధిపతి అయిన ఇంద్రుడు శాప వశాన

2️⃣.మౌద్గల్యుని గా జన్మించి ఇంద్రసేన ను వివాహమాడి అనంతరం

3️⃣.కాశీరాజ పుత్రికకు వరప్రభావంచే

4️⃣.పంచపాండవుల రూపం లో జనించి ద్రౌపది రూపం లో ఉన్న శచీదేవి ని వివాహమాడతాడు.

పంచభర్తృత్వం పై వ్యాసమహర్షి వివరణ:-
✳️✳️✳️✳️✳️✳️✳️✳️

తనకూతురైన ద్రౌపదిని పంచపాండవుల కు ఇచ్చి ఎలా వివాహం చేయాలి ఇది ధర్మసమ్మతమేనా⁉️ అని ఆలోచిస్తున్న ద్రుపదునికి పాండవులు ఇంద్రుని అంశలే అను రహస్యం ను వ్యాస మహర్షి దివ్య దృష్టి ద్వారా ద్రుపదునికి తెలియచేస్తాడు.

⚛️

ఇదం చాన్యత్ప్రీతి పూర్వం నరేన్ద్ర దదామితే దివ్య మత్యద్భుతం చ |
దివ్యం చక్షుః కుంతీసుతాంస్త్వం పుణ్యైర్దివ్యైః పూర్వరూపై రుపేతాన్ ||

⚛️

అంతేకాక ఐదుగురు భర్తలు ఉన్ననూ కన్యాత్వ భంగం కలుగకుండా పతిశుశ్రూష సిధ్ధిని సౌభాగ్యం ను శివునిచే వరంగా పొందింది అని తెలియచేస్తాడు.

.....పంచభిః ప్రాప్య కౌమారం మహాభాగా భవిష్యసి ||

ఇటువంటి ద్రౌపది చేతనే పరమాత్మ  పెద్దల పట్ల అతిథుల పట్ల ఏవిధంగా మెలగాలో పాతివ్రత్య  ధర్మాలను తెలియచేశాడు.

అరణ్యవాసం చేస్తున్న కాలంలో ఒకనాడు సత్యభామ శ్రీకృష్ణుని తోకలసి వారిని చూడడానికి వచ్చినపుడు ద్రౌపది తో ఈవిధంగా తన సందేహం వెలిబుచ్చుతుంది.
అతిపరాక్రమవంతులైన నీ భర్తలు నీ ఎడల సమానమైన ప్రేమ గౌరవాన్ని ఎలా చూపగలుగుతున్నారు? వారిమధ్య ఆ సయోధ్య ఉండడానికి నీవు ఏ ఏ ఉపాయాలు చేస్తావో తనకు తెలుపమని అడుగుతుంది.

అపుడు
భర్తలపట్లే కాక అతిథి అభ్యాగతుల పట్ల పెద్దవారి పట్ల ఎలా మెలగాలో తెల్పుతుంది.

☯️

స్నాన భోజన శయనాది సంప్రయోగ
మర్థి బతుకులకు మున్నెందు నాచరింప
బతులు వచ్చిన నాసన పాద్య విధుల
భక్తితో నేన కావింతు బనుప నొరుల

☯️

➡️ వారికి స్నాన భోజనాలను 🍱 నేనే స్వయంగా దగ్గరుండి చూసుకొంటాను.

➡️ గురు బ్రహ్మణ దైవ అతిథులకు స్వయంగా నేనే పూజలు నిర్వహిస్తాను.

➡️ అత్తగారికి 👵 సేవ చేస్తూ సంతోషం  కలిగిస్తాను.

➡️ అసాధ్వులతో పరిహాసాలు స్నేహం  కలహం కాని చేయను.

➡️ ధర్మరాజు సహపంక్తి లో నిత్యం భొంజనం చేసే వేలాది అతిథులకు వస్త్రభూషణాది బహుమానాలను నేనే విచారించి అందచేస్తాను.

➡️ నమ్మకులైన పరిచారకులను స్వయంగా విచారించి నియమిస్తాను.

➡️ భాండాగారం 🏦 లో ఉండే ధన దినసరి ఆదాయ వ్యయాలు💰💲  అన్నీ క్షుణ్ణంగా నాకు తెలుసు.

ఈవిధంగా నా భర్తలకు ప్రియం చేకూర్చుతాను.

అంతేకాక భర్తమనసు ను ఆకర్షించడానికి ఉపాయాలు కూడా చెపుతుంది.

✡️

పతిగడవంగ దైవతము భామలకెందునులేదు
ప్రీతుడై సతీ గరుడించెనేని గల భాషిణీ
భాసుర భూషణాంబురా న్విత ధనధాన్య గౌరవము
విశ్రుత సంతతియున్ యశంబు సద్గతియును గల్గు
నొండు మెయిగల్గునే యిన్ని తెరంగు లారయన్

✡️

▶️ నిత్యము భర్త మనసెరిగి మంచి భావన తో ప్రియమైన పనులు చేస్తుండు.

▶️ ఇంటికి రాగానే ఎదురెళ్ళి ఆప్యాయంగా పలకరించి అవసరమైన పనులు పనివాళ్ళకు అప్పచెప్పకుండా నీవే దగ్గరుండి చేయి.

▶️ అతడు నీతో ఇష్టంగా చెప్పిన సంగతులు ఎవరికీ చెప్పవద్దు.

▶️ భర్తకు ముఖ్యులైన వారి పట్ల భక్తితో సపరిచర్యలు చేయి.

▶️ ఆయనకు ఇష్టం లేనివారు నీకు ఎంత కావలసిన వారు అయినా దగ్గరకు రానీయకు.

▶️ కులవతులు సతులు నిర్మలవంతులైన మగువలతోనే స్నేహం చేయాలి.

▶️ దురభిమానాన్ని వదలి పెట్టాలి.

ఈవిధంగా చేస్తే ఏ భర్త అయినా ఆ భార్యను తప్ప పరకాంత వైపు కన్నెత్తైనా చూడడు.

అని పతిసేవ అతిథి అభ్యాగతుల సేవను గురించి ద్రౌపది ద్వారా మనకు వివరిస్తాడు.

✅....ఈవిధంగా పంచభౌతిక అంశాత్మక ఇంద్రుడు పాండవులరూపం తో  ద్రౌపదిరూపంలోని శచీదేవిని వివాహం చేసుకొంటాడు....✅ 🆗

ఇది అర్థం చేసుకోలేని కొందరు వితండవాదం 🤷🤦 మరియు దుర్విమర్శలు చేస్తుంటారు.

అంతేకాక

దుష్టశిక్షణ చేయవలసిన పాండవులు శాంతికాములై ఉన్నారు.
వారు దుష్టశిక్షణ చేయాలంటే విపరీతమైన సంఘటన ద్వారా కొపోద్రిక్తులు 😤😠 కావాలి.
పాండవులు కోపోద్రిక్తులగుటకు తద్వార దుష్టశిక్షణ జరిగి భూభారం తగ్గిచడంలో ఆ జగన్నాటక సుత్రధారి ఆడించిన ఒక నాటకమే ద్రౌపది వస్త్రాపహరణం.
 తద్వార పాండవులు శపథాలు చేసి భూభారం తగ్గించారు. అదేవిధంగా తన భక్తురాలైన ద్రౌపదిని శ్రీకృష్ణరూపంలో శీలభంగం కాకుండా కాపాడగలిగాడు.

ఏదిఏమైనా

ఏకోణం నుండి చూసినా మచ్చలేని 💯 పాత్ర  ద్రౌపది.
ఆమెలో మచ్చకనపడే వారిలో అర్థ రాహిత్యం తప్ప మరోటికాదు.

ఆమె అభిజాత్యానికి ఆలవాలం
సౌందర్య సౌశీల్యాల పుట్టిల్లు
వివేక విజ్ఞాన విద్యా సంపదల సమాహారం.
రాజకీయాలు కరతలామలకం
పాతివ్రత్యానికి పట్టుకొమ్మ
నిఖిల సద్గుణాలకు సారూప్యం.
ద్రౌపది పాత్రను వేదవ్యాసుడు అత్యధ్బుతంగా తెలియచేశాడు.
దానికి మన కవిత్రయం (ముఖ్యంగా తిక్కన) మరింత మెరుగులు దిద్దారు.

అంత సాధ్వీమణి కనుకే



.....అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా।
.....పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌।।



అంటే, అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ ఈ అయిదుగురు పుణ్యమూర్తులనూ ప్రతిరోజూ స్మరించినంతనే పాపాలు నాశనమవుతాయని పంచ మహాపతివ్రతలలో ఒకరిగా ద్రౌపది ని చెప్తారు.  భావం.

.
.

నేను ఇంతకు ముందు ద్రౌపది పంచభర్తృత్వం అని ఒక సంకలనం రాశాను. కానీ అందులో ఎందుకో 🤔 కొంత అసంతృప్తి ఉంది. 😒
ఆ తర్వాత  యార్లగడ్డ లక్షీ ప్రసాద్ గారి చే రచించబడిన #ద్రౌపది పుస్తకం 📗  కొన్ని సందేహాలను తీర్చింది.
కానీ ఆ పుస్తకం ఎలానో పోగొట్టుకున్నాను.😥  ఆతర్వాత కొన్నాళ్లు కు ఈ పుస్తకం 📙 దొరికి మరికొన్ని సందేహాలను తీర్చింది.

ద్రౌపది by డా. కోడూరు ప్రభాకర రెడ్డి గారు.

భోజనం

ఈ కాలం బఫె భోజనాలగురించి వ్యంగ్యగా వ్రాశారు.డా.పొన్నాడ కృష్ణసుబ్బారావు   గారు. 
శ్రీ సుబ్బారావుగారికి  కృతజ్ఞతలతో .

"యజమానికి సంతోషం లేదు
అతిధికి ఆనందం లేదు"

రుచులవి జాతివి మారెను/
పచనపు కళ మారిపోయి పడమటి వంటల్ /.
కిచెనుల దూరెను మెల్లగ/
శుచియగు మన భావములను శూన్యము చేయన్

గుత్తి వంకాయ కూరా లేదు ,
గుమ్మడికాయ పులుసూ లేదు !
అరటికాయ వేపుడు లేదు ,
అదిరే కొబ్బరి చట్నీ లేదు !
కొత్తావకాయ ఊసే లేదు ,
కొత్తిమీర చారూలేదు !
కందా బచ్చలి మరిచారయ్యా !
గుమ్మడి వడియం విడిచారయ్యా !

పలావు వుందని వడ్డించారు !
ఉల్లీరైతా ఉందన్నారు !
రుచిపచి తెలీని 'కూరే' సారు !
మిక్సుడు పికిల్ కూరేసారు !
బూరీ గారీ నోదిలేసారు !
బూందీ లడ్డూ మార్చేశారు !

గులాబు జామూన్ ఉందన్నారు
లైనులో జనాలు ముందున్నారు !

అయిసు క్రీముకేసడిగేసాకా ,
అయిపోయుంటుందన్నారొకరు !
ప్లేటుని చేతిలో పట్టుకుని ,
ఓ చేతిని జేబులొ పెట్టుకుని ,
బఫే లైనులో నుంచుంటే ,
బఫూన్ లా భలేగా వుంది !

కుర్చీ బల్లా తీసేశారు !
కుదురుగ నిలుచుని తినమన్నారు !
తల్లీ పిల్లా తల్లడిల్లినా ,
ముసలీ ముతకా ముక్కి చూసినా !
బఫే తీరులో బలముందన్నారు !
గొర్రె మూక విని తలవంచారు !

పెద్దా చిన్నా పరుగులె పరుగులు !
ముద్ద కోసమొక యుద్దపు తలపులు !

*సాపాటు--గ్రహపాటు*

ఔనండీ సుబ్రహ్మణ్యం గారు
అది బఫే మీల్స్ కాదు
బఫెల్లో మీల్స్

దానికి తోడు
హనుమంతుడు
సంజీవ పర్వతం మోస్తున్నట్టు
చేతిలో బరువైన ప్లేటు

ఏ ఐటమ్ కి అది కొద్దిగా
పెట్టించు కుందామంటే
కొండ వీటి చాంతాడు
లాంటి లైను,

ఎంగిలి ప్లేటుతో
ఈదుకుంటూ ప్రయాణం
ఎడమ చేతి బరువు.

లంక మేత గోదారీత లా
మంచినీళ్ళు ఎక్కడో.

మధ్యలో ఆద మరిస్తే
ఏ పిల్లాడో/పిల్లో/పెద్దో
మనకి ఎవరు డాష్ ఇస్తారో

కొంచెం వేగంగా నడిస్తే
ఈ చలవరాతి ప్లోరింగ్ పై
పడిన నీటి చుక్కలకి
నడుం జారుతుందో

వండే వాడెవడో
వడ్డించేవాడెవడో

చక్కగా తిందామంటే
నలుగురికి పరిచయమైన
వారికి కత్తి సామే

ఎవరో ఒకరి పనికి
మాలిన ముచ్చట్లు

ఎక్కడేమున్నాయో
తెలవక అర్ధాకలితో
భోజనం ముగింపు

చెత్త కాయితాలేరుకునే
వాడిలా ఎక్కడ ఏమి
ఉన్నాయో

చూసుకుంటూ
తిరుక్కుంటూ
అభోజనం.

నిజమే నిలబడి
భోజనం నిజంగా
నాగరికుల దౌర్భాగ్యం

అందుకే వెళ్ళక పోతే
ఎవరితో కలవమనుకుంటారు
కనుక ఇంట్లోనే తిని వెళ్ళాలి
అందరితో కలిసి భోజనం చేయాలి
కాదు కాదు చేసినట్లు నటించాలి

పేరుకు విందు దానికి ఓ టైము
కరెక్ట్ టైముకు వెలితే ఎవరూ ఉండరూ,

అలా అని ఆలశ్యంగా
వెళితే పదార్ధాలు నిండుకుండు
నిలబడి పెట్టే భోజనం

యజమానికి సంతోషం లేదు
అతిధికి ఆనందం లేదు

నిజంగా కూర్చుని తినే పంక్తి భోజనం దొరకటం ఈ రోజుల్లో
చాల అదృష్టం.
భోజన కాలే హరి నామ స్మరణ
గోవిందా గోవింద.🚶🚶🚶

Wednesday, January 8, 2020

కొన్ని విషయాలు

అష్టదిగ్గజాలు అనేది ఒక పురాణగాధ మాత్రమేనా? అవి ఊహాజనితాలా? లేక నిజంగా ఏమైనా సంకేతార్ధం వున్నదా?సనాతన ధర్మం # 2

భూమి పొరల్లో పైనున్నది భూపటలం (Crust). ఈ భూపటలం అగ్ని శిలలు (Igneous rocks), అవక్షేప శిలలు (Sedimentary rocks), రూపాంతర శిలలతో (Metamorphic rocks) కూడి ఉంటుంది, సముద్రాల కింద 5 నుండి 12 కిలోమీటర్లలోతువరకు – అదే భూఖండాల కిందనైతే 35 నుండి 60 కిలోమీటర్ల లోతువరకూ ఉంటుంది. భూపటలం క్రింద ఉండేది భూప్రావారం (Mantle); దాని క్రిందిది భూకేంద్రము లేదా కేంద్ర మండలం (Core).
భూపటలం ఇంకా భూప్రావార పైపొరలను కలిపి శిలావరణం (Lithosphere) అంటారు. ఈ శిలావరణం క్రిందనుండే దానినిAsthenosphere అంటారు. Asthenosphere మీద తేలుతున్నట్టుగా భావించదగ్గ శిలావరణాన్ని, Tectonic Plates గా విభాగించారు.
దీన్ని కొంచెం వివరంగా అర్ధం చేసుకోవడం కోసం ఇంగ్లీష్ లో ఎర్త్ క్రస్ట్ వివరాలున్న బొమ్మను చూడవలసినదిగా మనవి.

Depending on how they are defined, there are usually seven or eight "major" plates: African, Antarctic, Eurasian, North American, South American, Pacific, and Indo-Australian. The latter is sometimes subdivided into the Indian and Australian plates.
There are dozens of smaller plates, the seven largest of which are the Arabian, Caribbean, Juan de Fuca, Cocos, Nazca, Philippine Sea and Scotia.
The current motion of the tectonic plates is today determined by remote sensing satellite data sets, calibrated with ground station measurements.

ఏ విధంగా వీటిని విభాజిస్తామో అన్నదాని బట్టి, నేటి శాస్త్రజ్ఞులు వీటిని 7 లేక 8 టెక్టోనిక్ ప్లేట్ ల గా విభజించారు. వీటి పై మరి కొన్ని చిన్న ప్లేట్ లను కూడా గుర్తించారు కానీ గమనించదగ్గ విషయమేమిటంటే, ఈ 7/8 అతి ముఖ్యమైన టెక్టోనిక్ ప్లేట్లు.
సనాతన శాస్త్రం, ఈ అష్టదిగ్గజాలు కదిలినపుడు భూకంపాలవంటివి వస్తుంటాయి అని చెబుతోంది. నేటి అభిప్రాయం కూడా అదే.

‘అష్ట దిగ్గజాలు’ ఆంటే, భూమిని ఎనిమిది దిక్కులా మోస్తున్న ఏనుగులు. నిజంగా ఏనుగులు మోస్తుంటాయా అని అడక్కండేఁ? భూమి మీద సంచరించే అతి పెద్ద జీవి ఏనుగు – అందుకని భౌగోళిక శక్తులను దానితో పోల్చాయి మన సనాతన శాస్త్రాలు.
ఆష్ట దిగ్గజాలు ఏవి? వాటి పేర్లేంటి? ఏవేవి ఏ దిక్కులో ఉంటాయి? దీనికి సమాధానం విష్ణుధర్మోత్తర పురాణం 50వ అధ్యాయంలో దొరుకుతుంది.
కుముదైరావణౌ పద్మం పుష్పదంతోఽథ వామనః – సుప్రతీకాఽoజనౌ నీల ఏతేఽష్టౌ దేవయోనయః ||
1. ఈశాన్యం (Northeast) – కుముదం
2. తూర్పు (East) – ఐరావతం
3. ఆగ్నేయం (Southeast) – పద్మం
4. దక్షిణం (South) – పుష్పదంతం
5. నైఋతి (Southwest) – వామనం
6. పశ్చిమం (West) – సుప్రతీకం
7. వాయవ్యం (Northwest) – అజనం
8. ఉత్తరం (West) – నీలం

ఈ Tectonic Platesలో ముఖ్యమైన పెద్దవి ఏన్ని? అవి ఏవి? ఈ విషయంలో ఏకాభిప్రాయం కనబడటంలేదు. కొందరేమో ఏడు అంటారు – కొందరు ఎనిమిది.
1. ఆఫ్రికా ఫలకం – African Plate
2. దక్షిణధ్రువ ఫలకం – Antarctic Plate
3. ఆస్ట్ఱేలియా ఫలకం – Australian Plate
4. ఐరోపా-ఏషియా ఫలకం – Eurasia Plate
5. భారత ఉపఖండ ఫలకం – Indian Plate
6. ఉత్తర అమెరికా ఫలకం – North American Plate
7. పసిఫిక్ ఫలకం – Pacific Plate
8. దక్షిణ అమెరికా ఫలకం – South American Plate
ఒకానొక విషయంలో సనాతన – ఆధునిక శాస్త్రాల మధ్య నాకు కనిపించిన సారూప్యాన్ని పదిమంది ముందుంచడమే ఈ ప్రయత్నం. సనాతన దర్మానికి ఇటువంటి నిరూపణల అవసరం లేదు.
మనం మన సనాతన ధర్మంలో చెప్పిన విషయాలను నేటి శాస్త్ర ఆవిష్కరణలతో సరిపోల్చుకుంటున్నాము. చూడండి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ లేకుండా మన ఋషులు ఇతిమిద్ధంగా వీటిని ఎంత నిక్కచ్చిగా కనుక్కున్నారో.
సంకేతార్ధంగా వారు చెప్పిన ఎన్నో విషయాల మీద మనం మరింత పరిశోధించ వలసిన అవసరం ఎంతైనా వుంది.

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Friday, January 3, 2020

🕉️శివపూజతో ఎన్నో సమస్యలకు పరిహారాలు🕉️

🌷1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు.

🌷2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

🌷3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

🌷4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

🌷5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

🌷6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

🕉️🙏శ్రీ మాత్రే నమః🙏🕉️
సేకరణ భానుమతి అక్కిశెట్టి వాల్ నుండి