Sunday, March 30, 2025

భారతం కౌశికుడు


కౌశికుడు

 కౌశికుడు కథ ప్రతి గృహస్థు తెలుసుకోవాలి. 


అందులో బాధ్యతల నుండి పారిపోయే మగవాడి గురించి ఎంత విపులంగావుందో అంతే విపులంగా ఇంటి ఇల్లాలిబాధ్యతల గురించి కూడా చెప్పబడింది. 


ఈ విషయాలే కాకుండా ఎటువంటిదైనా వృత్తి ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో కూడా అరణ్యపర్వంలో ధర్మరాజు తెలుసుకుంటాడు. 


కౌశికుడు ఒక గొప్ప ధర్మవేత్త. తపస్వి. వేదాలు ఉపనిషత్తులు అధ్యయనం చేసాడు. కాకపోతే తన వేదాధ్యాయనం కోసం తల్లి తండ్రుల అనుమతి లేకుండానే ఇల్లు వదిలి వచ్చేసాడు. కొడుకు మీద బెంగతో ఆ వృద్ధులు ఏడ్చి ఏడ్చి అంధులై పోతారు. వాళ్ళను ఆదుకొనే వారెవ్వరూ లేరు.


కాని వేదపఠనే ధ్యేయంగా భిక్షాటన మీద బతుకు సాగిస్తూ వున్నాడు.

ఒకనాడు  చెట్టు కింద కూర్చొని వేదాధ్యాయనం చేస్తూండగా పైన చెట్టు కొమ్మమీద కూర్చొని వున్న ఒక కొంగ ఆయన తల మీద రెట్టవేస్తుంది. 


దాంతో ఆయన కోపంతో మండిపడి ఆ కొంగ వంక కోపంతో చూస్తూ శపిస్తాడు. దాంతో ఆ కొంగ మరణించి కింద పడిపోతుంది. 


ఏదో క్షణిక ఆవేశంలో ఆ విధంగా కోప ప్రదర్శన చేసినా తరువాత తాను చేసిన ఆ పనికి పశ్చాత్తాప పడుతాడు కౌశికుడు.


తరువాత అలవాటుగా వెళ్ళే ఇళ్ళవైపు భిక్షాటన చేస్తూ వెళ్ళుతాడు.  


ఒక ఇంటిలో పనిలో నిమగ్నమైన ఇల్లాలు, అదే సమయానికి భర్త ఇంటికి వచ్చేటప్పటికి, ఆయనకు భోజనం వడ్డించి ఆ తరువాత భర్త ఎంగిలి పాత్రలోనే ప్రసాదంగా భావిస్తూ తాను కూడా భుజించి, భర్తకు సేవచేస్తూ, కాళ్ళు పిసుకుతూ నిద్రపోయేవరకు కౌశికుడి పిలుపును పట్టించుకోదు. 


ఇన్ని బాధ్యతలు పూర్తిచేసుకున్న ఆ ఇల్లాలు భిక్ష తీసుకొని వచ్చేటప్పటికి, అప్పటికే భోజన వేళ మించిపోతూండటంతో ఆకలితో వున్న కౌశికుడి కోపపు చూపులు చూసి, తన ఆలస్యానికి కారణాలు వివరించి, 


"స్వామీ మీ చూపులకు భస్మమైపోవటానికి నేనేమీ కొంగను కాను." అని అంటుంది. 


అది విన్న కౌశికుడికి  "ఎక్కడో అడవిలో జరిగిన సంఘటన ఈమెకు ఏ విధంగా తెలిసింది?" అని ఆశ్చర్యమేస్తుంది. ఆ మాటే ఆమెను అడుగుతాడు.


ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ పతివ్రత ఎవరెవరు ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలో వివరించి, తాను ఒక గృహిణిగా భార్యగా కోడలిగా ఏఏవిధంగా వుందో తెలిపి, 


“నా ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్న పతిసేవాఫలం వల్లనే నాకు అడవిలో జరిగిన విషయం తెలిసింది. కేవలం వేదాలు చదవగానే వాటిలోని యదార్ధరూపం తెలుస్తుందనుకోవటం పొరపాటు. 


ఎవరి ధర్మం వారు సక్రమంగా నిర్వర్తించటమే వేదసారం. ఇంకా వివరంగా తెలుసుకోవాలన్న కోరిక వుంటే మిథిలాపురంలో ధర్మవ్యాధుని అడిగి తెలుసుకోండి." అని కౌశికుడిని పంపించి వేస్తుంది.


ఆ మాటలకు సంతోషించిన కౌశికుడు ఇంకా కొన్ని ధర్మపన్నాలు తెలుసుకోవటానికి, అడవులు గ్రామాలు పట్టణాలూ దాటుకుంటూ చాలా దూరంలో వున్న మిథిలా నగరానికి చేరుకొని ధర్మవ్యాధుడి గురించి విచారించి, అతన్ని కలవటానికి వెళ్ళి, అక్కడ అతను దుకాణంలో కూర్చొని మాంసం అమ్మటం కనిపించి సందేహంగా పక్కనే నిలుచుంటాడు. 


ఆయనను చూసిన ధర్మవ్యాధుడు దగ్గరకు వెళ్ళి, "మహానుభావా స్వాగతం. మీరు ఎవరినైతే చూడాలని ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారో ఆ ధర్మవ్యాధుడను నేనే." అంటూ తనను తాను పరిచయం చేసుకుంటాడు.


ఆ మాటలకు కౌశికుడికి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది.


ధర్మవ్యాధుడు ఆయనను సగౌరవంగా ఇంటికి తీసుకొని వెళ్ళి సకల మర్యాదలు చేసి ఉచితాసనం మీద కూర్చోబెట్టుతాడు.             


"నీకు ఈ మాంసం అమ్మి జీవించే ఘోరమైన వృత్తి ఏమిటి?"అని అడిగిన కౌశికుడికి సమాధానంగా, 


"ఇది నా కులవృత్తి. మా తాతముత్తాతల నుండి వస్తున్నది. ఈ వృత్తి చేయకపోతే నేను ధర్మం చెడ్డవాడిని అవుతాను. 


నాలుగు వర్ణాలవారూ, వారివారి కులవృత్తులు చేయటమే అసలైన ధర్మం. 


అయినా నేను జీవహింస చేయను. ఎవరో చంపి తెచ్చిన జీవాలను అమ్మటం మాత్రమే నేను చేస్తాను. 


నేను కూడా సదాచారపరుడినే. 

మాంసాహారం భుజించను. నా కర్తవ్యాలను ఎటువంటి లోటూ లేకుండా చేసుకుంటూ పోతూంటాను." అంటూ శిష్టాచారం ఏ విధంగా ఆచరించాలో, దాని యొక్క యదార్ధ రీతిని వివరిస్తాడు. 


చివరకు కౌశికుడిని ఇంటి లోపలి భాగంలో, వృద్ధులైన తల్లితండ్రులు వున్నతావుకు తీసుకొని వెళ్ళుతాడు.


"మహానుభావా, వీరే నాకు దైవాలు, వీరే నా వేదాలు. నా ప్రాణాలు వీరి సేవకే అంకితం. స్వయంగా నేనే వారికి కావలసినవన్ని అమర్చి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటాను." అంటూ తన దినచర్య వివరించి, 


"ఆ మహా పతివ్రత పంపబట్టి మీతో ఇంతసేపు మాట్లాడాను. కాని తల్లితండ్రులను విస్మరించి ఈ విధంగా వేదపఠనం అంటూ అడవులలో తిరగే మీ వంటి వారితో సంభాషించటం నాకు ఏ మాత్రమూ సమ్మతము కాదు. ఈ విధంగా తిరగటం మీకు ధర్మం కాదు." అంటూ మాతాపితృల సేవగురించి బోధ చేస్తాడు. 


అతని మాటలతో కౌశికుడు సంపూర్ణ ఙ్ఞానానందంతో గృహోన్ముఖుడై తల్లితండ్రుల సేవ చేసి వారిని ఆనంద పరుస్తాడు.


 ఆ పతివ్రత చెప్పిన విషయాలు, ధర్మవ్యాధుడు చెప్పిన విషయాలు ఒక సముద్రం వంటివి. ఎంత చెప్పినా తరగనివి.

Thursday, March 27, 2025

రామాయణం

 శూర్పణఖ!


రావణుని తల్లిదండ్రులు కైకసీ విశ్రవసువులు. వారి కుమార్తె శూర్పణఖ అని అంటారు. కానీ ఆమె కైకసి కుమార్తె కాదు విశ్రవసువు మరో భార్య కూతురు (ఖరదూషణుల సోదరి) అని కూడా అంటారు. ఎలాగైనా ఆమె రావణునికి చెల్లెలు. ఆమె భర్త విద్యుజ్జిహ్వుడు.


రావణుడు కాలకేయులతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు విద్యుజ్జిహ్వుడు కూడా వెళ్తాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఈ విద్యుజ్జిహ్వుడు పొరపాటున బావమరిది రావణుని చేతిలో హతుడౌతాడు. దుఃఖిస్తున్న శూర్పణఖను ఊరడించి దండకారణ్యంలో ఉన్న సోదరుల వద్దకు వెళ్ళి ప్రశాంతంగా శేష జీవితాన్ని గడపమని చెప్తాడు రావణుడు. అన్న మాట పాటించి ఆమె తన కొడుకు జంబు కుమారునితో దండకారణ్యానికి వెళ్ళి పోతుంది. వనవాసం లో ఉన్న లక్ష్మణుడు పర్ణశాల కోసం పొదలు నరుకుతూంటే పొదలో ఉన్న జంబు కుమారుడికి లక్ష్మణుని కత్తి తగిలి చనిపోతాడు. అది తెలిసి ప్రతీకారము తీర్చుకోవడానికి వచ్చిన శూర్పణఖ రామలక్ష్మణుల సౌందర్యానికి చపలచిత్తురాలై వారి మోహంలో పడిపోతుంది. భౌతిక వాంఛా పరితృప్తి కోసం మొదట రాముణ్ణి, తరువాత లక్ష్మణుడిని వాంఛించి తిరస్కరించబడుతుంది. అప్పుడు సీతను చూస్తుంది. సీతను చంపేస్తే రామలక్ష్మణులు తనను చేరదీస్తారని తలచి సీతను చంపడానికి వస్తుంది. లక్ష్మణుడు ఆమెను అడ్డుకుని 'నీకిదే శిక్ష!' అని ముక్కు చెవులు కోసి పంపించేస్తాడు. ఇక ఆమె రావణాసురుడి దగ్గర కెళ్ళడం, సీత సౌందర్యం గూర్చి చెప్పి అతణ్ణి ఉసిగొల్పడం... అంతా తెలిసిందే! తరువాత మరి శూర్పణఖ కనిపించద


Monday, March 24, 2025

తెలుగు

 *ఇది వ్రాసిన వారు అజ్ఞాతంలో వుండిపోవడం అత్యంత బాధాకరం!


           *సుందర తెలుగు..*

      *చచ్చినట్టు’ బతికించే భాష!*


తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి! 

*(అంటే మనవాడు ఉలిపికట్టా ?)* 


అందరూ పొగ  *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.*


ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు *‘తింటాడు’!* దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు. సంస్కృతం అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ, తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే ! ఇందుకు ఉదాహరణలున్నాయి. 


ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా *‘సచ్చినోడా’* అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు. 


చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? 


ఆశ *చావడం* లేదంటాడు. చెట్లకే ప్రాణం ఉందని చెప్పుకుని చావనివాళ్లు, ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్లు ఆశకు ప్రాణం ఉంటుందని ఎలా ఒప్పుకుని ‘చస్తా’రు? 


తెలుగువాడు కంటి చూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది. 

ఇలాంటి అతీత శక్తులు యావత్‌ ప్రపంచంలో తెలుగువాడికి మాత్రమే ఉన్నాయి. 

ఎంత గొప్ప ! ఎంత చిత్రం !


 మత్తు పానీయాలైన సారా, బ్రాందీ, విస్కీలను *‘సేవిస్తున్నా’* నంటాడు. అదే సమయంలో మంచినీళ్లు తాగుతున్నానంటాడు తప్ప సేవిస్తున్నాననడు. 

ఇదేం చిత్రమో! 


ఇంకా చిత్రమేంటంటే మందు *‘కొడుతున్నా’* నంటాడు. కొట్టడానికి మందేమన్నా మనిషా? పశువా? 


బాతాఖానీ *కొట్టకు* అంటాడు. దీని పరిస్థితీ ఇదే. 

అనారోగ్యకరమైన నిషా పానీయాన్ని ఆరోగ్యప్రదాయిని అయిన *మందు* పేరుతో పిలుస్తాడు! అంతా ‘మందే’ (మనదే) అనుకునేవాడు తప్ప ఇంకెవ్వడైనా ఈ పని చేయగలడా? 


తెలుగువాడు ఎందులోనైనా ఆటను చూడగలడు. *మాట్లాడతానంటాడు.* *పోట్లాడతానంటాడు.*

*మనస్ఫూర్తిగా* కోరుకుంటున్నానంటాడు. మనసు పూర్తిగా కాకుండా అందులో ఏభై శాతమో, డెబ్భైఅయిదు శాతమో ఉంచి కోరుకుంటాడా ఏంటి? 


ఇంకోమాట! 

*హృదయపూర్వకంగా* అభినందిస్తున్నానంటాడు. కాసేపు హృదయాన్ని పక్కనబెడితే, అభినందించే అవకాశం ఉందా? ఉంటుందా? తెలుగువాడి ‘న్యాయమే’ వేరు. 


బడాయి గానీ మాట మాట్లాడితే *‘మనస్సాక్షిగా’* అంటాడు. మనసుకు ఏమన్నా రూపం ఉందా? మాట ఉందా? వచ్చి సాక్ష్యం చెప్పడానికి! 


అగ్నిసాక్షిగా పెళ్లాడాను అని కూడా అంటాడు. అగ్ని ఏదో చిటపటలాడుతుంది కానీ ఎవరైనా సంసారంలో చిచ్చుపెడితే అదొచ్చి అడ్డుపడుతుందా ఏంటి ? 


కళ్లలో *నిప్పులు* పోసుకుంటున్నాడంటాడు! పోసుకోమనండి చూద్దాం! 


పెళ్లికాని ఆడపిల్లను *గుండెల మీద కుంపటి* అంటాడు. ఇది ఎంత తప్పు! గుండెల మీద కుంపటి పెట్టుకున్న మొనగాళ్లు యావత్‌ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? 


మాటేగా ఏదైనా అంటాడు. గుండె మీద బరువు తగ్గించుకున్నానంటాడు. గుండెల మీద బట్టల బరువు తప్ప ఇంకేం బరువు ఉంటుంది! 


నవ్వితే నవరత్నాలు *రాలతాయం* టాడు. రత్నాలా పాడా? మరీ గట్టిగా నవ్వితే పళ్లు రాలిపోతాయేమో! *చిటికెలో* పని అయిపోతుందంటాడు. 

అతిశయం కాకపోతే చిటికె వేస్తే శబ్దం అవుతుంది కానీ పని ఎలా అవుతుంది !


 *ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్‌* అని గురజాడ చెప్పినా మనవాళ్లు వినరు. 


అప్పు తీసుకునేటప్పుడు ‘నీ డబ్బు వడ్డీతో సహా *పువ్వుల్లో పెట్టి ఇస్తా’* నంటారు. వడ్డీ ఇస్తే ఇవ్వచ్చుగానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది అప్పిచ్చిన పిచ్చివాడి *చెవిలో పువ్వు పెట్టడం* కాదూ! 


ఎవరో *చిన్నచూపు* చూస్తున్నారని తెలుగువాడు ఆక్షేపిస్తాడు. దూరపు చూపు, దగ్గరి చూపు ఉంటాయి తప్ప చిన్న చూపు, పెద్ద చూపు అని ఎక్కడైనా ఉంటాయా? 


వంట చేయడాన్ని *చేయి కాల్చుకోవడం* అంటాడు. ఇదే నిజమైతే ఆడవాళ్ల చేతులన్నీ ఏమైపోయేవి !

 

సంగీతమంటే *చెవి కోసుకుంటానని* ఒక్కొక్కరు వంకర్లు తిరిగిపోతుంటారు. అయితే అతడు ఎంతసేపు పాటలు వింటున్నా కోసుకున్న చెవి కిందపడదే అని నిరాశ పడ్డవాళ్లూ ఉన్నారు. 


తప్పు చేసినవాడు *అడ్డంగా* దొరికిపోయాడు అంటారు. దొరికినవాడెవడైనా అడ్డంగా దొరుకుతాడా? *నిలువుగా* దొరుకుతాడు తప్ప ?


అన్నట్టు గిట్టనివాణ్ని *అడ్డమైనవాడు* అని తిడతారు. అదేంటి? దాని భావమేంటి? పండితార్థం ఏమైనా పిండితార్థం ఒకటుంది. 

*పశువా* అని తిట్టినట్టు. మనుషులు *నిలువుగా* ఉంటారు. పశువులు *అడ్డంగా* ఉంటాయి. అదీ సంగతి! 


ఎవడి మీదైనా కోపం వస్తే, *ఏ మొహం పెట్టుకుని* వచ్చావంటాడు తెలుగువాడు. ఎవడికైనా ఒకటే ముఖం ఉంటుంది కానీ బ్రహ్మలాగా నాలుగు ముఖాలు, రావణబ్రహ్మలాగా పది ముఖాలు ఉండవు కదా! 


ఫలానావాడు *తలలు మార్చేరకం* అనేది కూడా తెలుగువాడి వాడుక. ఇదెలా సాధ్యం? వినాయక వృత్తాంతంలోలాగా తలలు మార్చేశక్తి సామాన్య మానవులకు ఉంటుందా ?


తెలుగువాడు *బండ* చాకిరీ చేస్తానంటాడు. బండ.. దానికి ఒక మొహం! ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది కానీ అది చేసే చాకిరీ ఏముంటుంది? 


ఏముంది *ఎడమ చేత్తో* చేస్తానంటాడు. ఎడమ చేత్తో చేసే పనులేంటో అందరికీ తెలుసు. దానితో అన్ని పనులూ అతివేగంగా చేస్తానంటే ఎలా కుదురుతుంది? 


అన్నం *ఉడకలేదా* అంటాడు. ఇదేంటి? ఉడికితే కానీ అన్నం కాదు కదా! 


జోకులు *పేల్లేదు* అంటాడు. జోకు ఏమైనా బాంబా? పేలడానికి! 


వీపు *విమానం మోత* మోగుతుందని అంటాడు. విమానం మోత మోగితే ఆ వీపు అసలు ఉంటుందా? మనిషి అసలు ఉంటాడా? 


లేస్తే *మనిషిని* కానంటాడొకడు. మరి లేచినవాళ్లందరూ ఏంటి? అలాంటప్పుడు కూర్చుని ఉంటేనే మేలు కదా! 


శక్తిని కూడా భక్తికి ముడి పెట్టడం తెలుగువాడికి రివాజు. 


ఉన్న పూజలు చాలక *బడితెపూజ* ఒకటి.


  జంతువుల్లో కూడా దేవుళ్లను చూసుకుని భారతీయులు ఆరాధిస్తారు. ఇందుకు తెలుగువాడు కూడా మినహాయింపు కాదు. ఎటొచ్చీ మనుషుల్లో జంతువుల్ని చూడటం అతగాడి ప్రత్యేకత. 


గిట్టనివాళ్లను *పంది, కుక్క, గాడిద* అని తిట్టే తెలుగువాడు, ఇష్టమైనవాణ్ని *పులి, సింహం, గుర్రం* అని అభిమానంగా చూస్తాడు. పిలుస్తాడు.


ఏదైనా కళ్లారా చూస్తే తప్ప నమ్మకూడదు. తెలుగు భాష ఇందుకు ఇంపు అయిన మినహాయింపు. 

*గుండె జారిపోయింది* అంటారు. ఇప్పటివరకు ఎవరికైనా జారిపోయిందా? లేదే !!!


*నీ నోరు పడిపోను* అని తిట్టిపోస్తారు. ఎవరి నోరు అయినా ఎప్పుడైనా పడిపోవడం చూశామా? 


పాడమని అడిగితే గాయకులు *గొంతుపోయింది* అంటారు. గొంతు ఎక్కడికి పోతుంది? పోతే ఎవరు తీసుకురాగలరు? 

నోరు *పారేసుకోవడం* అంటారు. అది ఎలా సాధ్యం? 


మా ఆయనకు *నోట్లో నాలుకలేదని* ఓ ఇల్లాలు వాపోతుంటుంది. నోట్లో నాలుక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? 


వాసన *చూడు* అంటారు. వాసనను పీలుస్తారు కానీ ఎలా చూస్తాం? 


రుచి *చూడటం* కూడా అంతే. ఎవరు చూడగలరు? 


 పత్రికలు చదివి చదివి, వాటిలోని పడికట్టు మాటలను కంఠస్థం చేసేశాడు తెలుగువాడు. 


ఫలానావాడు బాధకు *గురయ్యాడు* అంటాడు. మధ్యలో గురి ఎందుకు? బాధపడ్డాడు అనొచ్చుగా. 


దిగ్భ్రాంతి *వ్యక్తం* చేశాడంటారు. దిగ్భ్రాంతి చెందాడు అనడు. దిగ్భ్రాంతిని ఎలా వ్యక్తం చేస్తాడంటే చెప్పడు. 


తప్పు చేస్తే *పాపం !* అంటాడు సరే. ఎదుటివాడు కష్టాల్లో ఉంటే *అయ్యో ‘పాపం’!* అంటాడు. తెలుగు భాష ఏమన్నా పుణ్యానికి వచ్చిందా ఏంటి?