Thursday, March 27, 2025

రామాయణం

 శూర్పణఖ!


రావణుని తల్లిదండ్రులు కైకసీ విశ్రవసువులు. వారి కుమార్తె శూర్పణఖ అని అంటారు. కానీ ఆమె కైకసి కుమార్తె కాదు విశ్రవసువు మరో భార్య కూతురు (ఖరదూషణుల సోదరి) అని కూడా అంటారు. ఎలాగైనా ఆమె రావణునికి చెల్లెలు. ఆమె భర్త విద్యుజ్జిహ్వుడు.


రావణుడు కాలకేయులతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు విద్యుజ్జిహ్వుడు కూడా వెళ్తాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఈ విద్యుజ్జిహ్వుడు పొరపాటున బావమరిది రావణుని చేతిలో హతుడౌతాడు. దుఃఖిస్తున్న శూర్పణఖను ఊరడించి దండకారణ్యంలో ఉన్న సోదరుల వద్దకు వెళ్ళి ప్రశాంతంగా శేష జీవితాన్ని గడపమని చెప్తాడు రావణుడు. అన్న మాట పాటించి ఆమె తన కొడుకు జంబు కుమారునితో దండకారణ్యానికి వెళ్ళి పోతుంది. వనవాసం లో ఉన్న లక్ష్మణుడు పర్ణశాల కోసం పొదలు నరుకుతూంటే పొదలో ఉన్న జంబు కుమారుడికి లక్ష్మణుని కత్తి తగిలి చనిపోతాడు. అది తెలిసి ప్రతీకారము తీర్చుకోవడానికి వచ్చిన శూర్పణఖ రామలక్ష్మణుల సౌందర్యానికి చపలచిత్తురాలై వారి మోహంలో పడిపోతుంది. భౌతిక వాంఛా పరితృప్తి కోసం మొదట రాముణ్ణి, తరువాత లక్ష్మణుడిని వాంఛించి తిరస్కరించబడుతుంది. అప్పుడు సీతను చూస్తుంది. సీతను చంపేస్తే రామలక్ష్మణులు తనను చేరదీస్తారని తలచి సీతను చంపడానికి వస్తుంది. లక్ష్మణుడు ఆమెను అడ్డుకుని 'నీకిదే శిక్ష!' అని ముక్కు చెవులు కోసి పంపించేస్తాడు. ఇక ఆమె రావణాసురుడి దగ్గర కెళ్ళడం, సీత సౌందర్యం గూర్చి చెప్పి అతణ్ణి ఉసిగొల్పడం... అంతా తెలిసిందే! తరువాత మరి శూర్పణఖ కనిపించద


No comments:

Post a Comment