Monday, September 1, 2025

తెలుగు భాషాదినోత్సవ ప్రసంగం

                     బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి పంతులుగారు

                             తెలుగు భాషకు అనన్య సేవలు చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఆగస్టు 29 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువు వారి జన్మదిన తెలుగు భాషా దినోత్సవంగా జరుగుతుంది  తెలుగు భాష దినోత్సవం గాఒక మహనీయుని జన్మదినం జరిపేటువంటి మహత్తరమైన ఘట్టం గిడుగు రామ్మూర్తి పంతులు గారి విషయంలో మాత్రమే జరిగింది . మనిషి తను చెప్పదలుచుకున్న విషయాన్ని వ్యక్తీకరణ చేయడమే భాష.అంటే భాష ద్వారా వాచకంగా తెలియపరుస్తాడు. ప్రతి మనిషికి ఇది సహజంగా లభించే  వరం.మనిషి తాను మాట్లాడిన మాటలకు అక్షర రూపాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ తన భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరించడానికి భాష సరిపోతుంది.అదే మాతృభాష.

                           భాష కాలానుగుణంగా మార్పులు చెందుతూనే ఉంటుంది. ఆధునిక కాలంలో ఆధునికమైనటువంటి అవసరాలు తీర్చడానికి భాషా రంగంలో కూడా వివిధ రకాల మార్పులు సంభవిస్తూ ఉన్నాయి.  అతి ప్రాచీన కాలం నుండి తెలుగు భాష వివిధ రకాల మార్పులు జరుగుతూ ఆధునిక రూపాన్ని సంతరించుకుంది .ఎంత ఆధునికత సంతరించుకున్నా తెలుగు భాషకు జీవనాడి లాంటి తెలుగు పదాలను ఉపయోగించటం గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో ఆధునిక పోకడలు వ్యావహారికంలో వివిధ అన్య భాషా పదాలు కనిపిస్తూనే ఉంటాయి. 

                                                                    తెలుగు భాషకు ఒక నిర్దిష్టమైన భాషా సాంప్రదాయాన్ని చూపించటానికి ప్రయత్నించినవారు గిడుగు రామ్మూర్తి పంతులుగారు.వీరు జన్మించింది పర్వతాల పేట ఆగస్టు 29 1863 శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం. చిన్నవయసులోనేతండ్రి మరణంతో మేనమామ ఇంట విద్యాభ్యాసాన్ని విజయనగరంలో కొనసాగించారు. ఉద్యోగ ప్రయత్నాలలో మొదట కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా చేరి చేరినా ఉపాధ్యాయునిగా జీవించడం రామ్మూర్తి గారి ఆశయంగా మారింది. పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఆ తర్వాత అక్కడే కాలేజీ లెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఇంగ్లీష్ సంస్కృతం మొదలైన అంశాలను కూడా నూతన పద్ధతుల్లో బోధిస్తూ విద్యా రంగంలో కొత్త పద్ధతులు అవలంబించి అందరి మన్ననలకు పాత్రులయ్యారు.

                                              గిడువారిని పిడుగు అనే వ్యవహారికం ఉంది .ఆయన అత్యంత మానవతావాది.అలానే పట్టుదల కలవ్యక్తి.

వారి మానవతా దృష్టికి ఉదాహరణ సవరులకు వారు చేసిన సేవ. పర్లాకిమిడి ప్రాంతంలో నివసించే సవరులను చూసి వారి అమాయకత్వాన్ని గమనించి ప్రజలు వారి శ్రమ శక్తిని దోచుకునే విధానం తెలుసుకొని వారిని నాగరికత ప్రపంచంలో అడుగుపెట్టించాలని అందుకు విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నించినటువంటి మహోన్నతులు వీరు.సవర వారి భాష నేర్చుకోవటం ప్రారంభించి తాను నేర్చుకుని వారిని విద్యావంతులను చేయటానికి అవసరమైన ఒక ఐదుగురు ఉపాధ్యాయులను కూడా తయారుచేసి వారికి తన సొంత ఖర్చుతో పాఠశాలలు నిర్వహించి వారి అభ్యుదయానికి పాటుపడిన గొప్ప మానవతావాది గిడుగువారు. ప్రభుత్వం గిడుగు వారి కృషిని చూసిన తరువాత ఆ పాఠశాలలకు గ్రాంట్ ఇవ్వటం సవరల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు రాయించటం సవరుల అభివృద్ధికి కృషి చేయడం వీరి యొక్క కృషి కి నిదర్శనం. బ్రిటిష్ ప్రభుత్వం వారికి  రావు సాహెబ్  బిరుదు  ఇచ్చి గౌరవించింది. సవరలకు భాషకు లిపిగా ఇంటర్నేషనల్ ఫొనిటిక్ అసోసియేషన్ వారి ధ్వని లిపిని ఉపయోగించారు. సవరలకు భాషకు ప్రత్యేకమైన సాహిత్యాన్ని వాచకాలను నిఘంటువును రచించిన మహోన్నత వ్యక్తి వారి సాంప్రదాయ పాటలను కూడా సేకరించి అన్నింటిని గ్రంథస్తం చేసినటువంటి మహనీయుడు. నిఘంటు నిర్మాణంలో కూడా వాడుకలో ఉన్న పదాలను మాత్రమే తీసుకొని వాటికి సరైన తెలుగు పదాలను చూపిస్తూ ఒక ప్రత్యేకతను చూపించారు భాష నిత్య నూతనంగా ఉండాలి అంటే అది ప్రజల  నాలుకలలో నివసించాలి .ఆ భాషే జీవద్భాష అయితుంది ప్రజలు బతకటానికి నిత్యజీవితంలో ఉపయోగపడేటువంటి పదజాలమే పనికి వస్తుందని స్పష్టం చేస్తూ  భాషకు నిఘంటువు ని రూపొందించి ‘’సవరభాష ప్రయోగ దీపిక’’ అని భాష ప్రయోగ పద్ధతులను కూడా వివరించారు .ఇదిసవరభాషకు గిడుగు రామ్మూర్తి పంతులుగారు చేసిన మహోన్నతమైనసేవ.నేటికీ సవరభాషా సాహిత్యం లో సవర భాష పాఠ్యాంశాలలోవారి ముద్ర కనిపిస్తుంది. అందుకే ఆయన ను సవర వాగను శాసనులుగా చెప్తారు. ఇది సవరులను ఉన్నతలను చేయటానికి వారు సల్పినటువంటి కృషి ఇది వారి మానవతా వాదానికి ప్రతీక

వ్యావహారిక భాషోద్యమం:  భాష విషయంలో పిడుగు వారికి స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రపంచంలో వివిధమైన భాషావేత్తలతో పరిచయాలు ఆయా భాషల్లో జరుగుతున్న మౌలిక మార్పులను గమనించి తెలుగు భాషలో కూడా మార్పులు అవసరమని  భావించిన వ్యక్తి గిడుగు వారు.  భాష సమకాలీన జన వ్యావహారికంగాఉండే భాషలో ఉంటేనే మనుగడలో ఉంటుంది అని తదనుగుణంగా మార్పులు చేయాలని గ్రాంథిక భాషా వాదులతో భాషా యుద్ధం చేసిన యోధుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు తన సిద్ధాంతానికి ఉపపత్తులు చూపుతూ “తెలుగు” పత్రిక ద్వారా వ్యవహారిక భాషకు పట్టం కట్టారు. జీవద్భాషలో మార్పు చెందటం సహజమని భాషావేత్తలందరూ అంగీకరించిన విషయం అయినప్పటికిని తెలుగులో పాఠ్యాంశాలలో పరీక్ష పద్ధతుల్లో రచనా వ్యాసాంగంలో చాలాచోట్ల భాష కొంత కృతకంగా ఉండేది. అయితే గ్రంథ వ్యాఖ్యానాలు పత్రిక వ్యవహారాలు కొంత వ్యవహారిక  ఉండేవి . వ్యవహారిక భాషలో కొన్ని గ్రంథాలు కూడా వచ్చాయి అయినప్పటికీ గ్రాంధిక భాష పై చేయిగా పండిత భాషగా  ఉండేది.  తమిళనాడు ప్రాంతంలో కూడా భాషా విషయంలోచిన్న ఉద్యమాలు లాంటివి మొదలయ్యాయి. పుస్తకాలలో సంస్కృత పదాలు కాక మాతృభాషా పదాలు ఉండాలని  క్రమంగా భాషా ఉద్యమాలు మెదలు అయ్యాయి. కృతక భాషను మెల్లమెల్లగా దూరం చేస్తూ ఇతర భాషల ప్రమేయాలు లేకుండా మాతృభాషా పదాలతో దేశీ పదాలతో భాషను కాపాడుకోవడానికి ప్రయత్నాలు  మొదలయ్యాయి. తెలుగు లో కూడా వివరమైన చర్చలు జరిగేవి. 19 శతాబ్దం నాటికి విద్య అందరికీ అందుబాటులోకి రావడం విద్యాలయాలు స్థాపించబడి  డిగ్రీ స్థాయిలో దేశభాషల్లో కూడా విద్యాభ్యాసానికి అవకాశాలు కలిగాయి.

పాఠ్యాంశాలవిషయంలో విద్యార్థులకు కావ్యాలలో ఉన్న భాషకు వ్యవహారికంలో ఉన్న భాషకు చాలా తారతమ్యత ఉండేది. కందుకూరు లాంటివారు వ్యవహారిక భాషలోనే భావ ప్రకటనకు అవకాశం ఉందని విషయాన్ని గ్రహించి ప్రహసనాలు వ్రాశారు. గురజాడకన్యాశుల్కం కూడా వ్యవహారిక  లోనే ఉంది .అయినా వాడుకులో ఉన్న భాషకు గ్రంథాల్లో ఉన్న భాషకు తేడా స్పష్టంగా తెలుగులో కనిపించేది. తెలుగు వచ్చిన రచనల్లో కూడా అప్పటి కవులు ప్రాచీనరూపాలలో కృతక పదాలతో సంస్కృత సమాస భూయిష్టంగా పదాడంబరం గా  రచనలుచేసేవారు.  విద్యార్థుల పరీక్షా విధానం కూడా వాడుకు భాషలో కాక కావ్య భాషలోనే ఉండాలని నియమాలు కొన్ని ఉండేవీ.ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో వ్యవహారిక భాషలో విద్యార్థులకు బోధించాలని విద్యార్థులు వ్యవహారిక భాషలో పరీక్షలు రాయటానికి   తెలుగు భాషను జీవభాషగా నిలపటానికి  కృషి చేసిన వారు గిడుగు వారు. గ్రాంథిక భాషద్వారా ఏర్పడినటువంటి గందరగోళానికి తెరదించుతూ ప్రాచీన గ్రంథాలను కొలమానంగా చూపుతూ ప్రాచీన కాలం నుంచి కావ్యాలుశిష్ట వ్యవహారికంలోనే ఉన్నాయని చెప్పి వ్యవహారిక భాష భాషకు జీవనాడని వివరిస్తూ నిరంతరం మారేటువంటి భాష కాలానుగుణంగా మార్పులు చెందుతాయని అలా మార్పులు చెందితేనే సమాజంలో విద్యావంతులకు మాతృభాషలో చదవటానికి అవకాశాలు కలుగుతాయని తద్వారా విజ్ఞానాన్ని ప్రజలు పెంపొందించడానికి అవకాశం కలుగుతుందని గుర్తించి వ్యవహారిక భాషను ఒక ఉద్యమంగా చేపట్టారు. అప్పటి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా   అక్షరాస్యత తక్కువగా ఉన్న సామాన్యులలో మక్కువ కలిగించడానికి వారికి భాష మీద పట్టు పెంచడానికి విద్యార్ధులు తమ భాషను వ్యక్తీకరించడానికి సులభమైన భాష పుస్తకాలలో ఉండాలని  వ్రాయటానికి అనుమతించాలని  పొరాడి సాధించినగొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులుగారు .  ఉద్దండ పండితులను తన వాదంతో  ఒప్పించి వ్యవహారిక భాషను పట్టం కట్టిన మహనీయుడుగిడుగు పిడుగు.   బహుముఖ ప్రజ్ఞాశాలిగా గిడుగు భాషావేత్తగా వ్యవహారిక ఉద్యమ కారునిగా కనిపించే గిడుగు రామ్మూర్తి గారు ప్రముఖ శాసన పరిశోధకులు కూడా .

     వారి జన్మ ప్రదేశానికి దగ్గరలో ఉన్న శ్రీముఖలింగ దేవాలయ గోడల మీద ఉన్న శాసనలిపిని ఎంతో కృషితో తెలుసుకొని ఆ శాసనాలను గ్రంథస్థం చేసినటువంటి వ్యక్తి . రామ్మూర్తి గారి కృషితో ముఖలింగ దేవాలయం మీద ఉన్న శాసనాలు నేటికీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 10 శాసనాలను వారు గ్రంథస్థం చేశారు .శాసనాలు చదవటం కోసం ప్రాచీన శాసన భాషను నేర్చుకుని వాటిని అధ్యయనం చేసి సాధికారికంగా వ్యాస రూపంలో ప్రకటించనవారు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. తెలుగువారికి ఉన్న పట్టుదల,పంతం గిడుగు రామ్మూర్తి గారిలో కనిపిస్తుంది .ఒక భాషా ఉద్యమకారుడుగా ఒక సంఘసంస్కర్తగా మానవతావాదిగా మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపించిన వ్యక్తి. వీరి జీవితంలో మరో అద్భుతమైన ఘటన కూడా మనం గుర్తు చేసుకోవాలి 1931  సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన జరుగుతున్నప్పుడు గిడుగువారు ఉన్నటువంటి పర్లాకిమిడి ప్రాంతాన్ని ఒరిస్సాలో చేర్చడానికి ప్రయత్నం జరిగింది పర్లాకిమిడి.స్నేహితుడు, యజమాని అయిన రాజావారితో విభేదించి ఉద్యమం చేసి దాదాపుగాతెలుగు మాట్లాడే 400 గ్రామాలను ఆంధ్ర ప్రాంతంలో చేర్పించడానికి కారకులు. అంతేకాదు పర్లాకిమిడి ని వదిలేసి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఆంధ్ర లోనే స్థిరపడినటువంటి అభిమాన ధనులు గిడుగు రామ్మూర్తి పంతులుగారు ఇంతటి మహోన్నతలు కనుకనే గిడుగు వారి జయంతి మాతృభాషా దినోత్సవం గా అందరూ తెలుగువారు జరుపుకునే గొప్ప పండుగ అయింది తన జీవితాన్ని తెలుగు వారికి అంకితం చేసి తెలుగు భాషకు తెలుగు ప్రజలకు అనన్యమైన సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని ఈరోజు తెలుగు వారందరూ గుర్తు చేసుకోవాలి భాషలో. మార్పులు సహజమైన నేటి విపరీతమైన  పోకడలు మాత్రం సరికావు. సాధ్యమైనంత వరకు తెలుగు భాషా పదాలను ఉపయోగిస్తూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని అందరం గుర్తుంచుకోవాలి.అదేవారికి నివాళి.

                                                                              మిన్నె కంటి నాగరాజు

               తెలుగు ఉపాధ్యాయులు

9849810683


'రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట" అని మాన్యులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రస్తుతించారు.


తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు, కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు" అని పులిదిండి మహేశ్వర్ గారు మన భాషకు ఛత్రం పట్టిన వారిని కీర్తించారు. 


వ్యావహారిక భాషావాదం ప్రాచీన సాహిత్యానికి వ్యతిరేకంగా ఏర్పడలేదు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే వాడుక భాషకి ప్రాచుర్యం కల్పించాలి. 


1 comment:

  1. బహుముఖీన ప్రజ్ఞావంతులు మిన్నెకంటి వారు అని ఈ ప్రసంగవ్యాసం ద్వారా మరోసారి ఋజువు చేశారు. చక్కని వ్యాసం అందించారు. ధన్యవాదములు సార్ 🙏🙏🙏

    ReplyDelete