Sunday, August 18, 2019
Saturday, September 29, 2018
చతురోక్తులు
ముని మాణిక్యం వారి అన్యోన్య దాంపత్యాలు - చతురోక్తులు
ఓ మారు మునిమాణిక్యం నరసింహారావు గారు తల్లావజ్జుల శివశంకరస్వామిగారిని ఇలా కదిపారు.
"అన్నగారూ! నాకు మా ఆవిడతో ఒక నిమిషం పడదు. నిత్యం దెబ్బలాడుకుంటూంటాం. ఒక్క నేనేనా?
ఇతరులు కూడా అలాగేవుంటారా?"
తల్లావజ్జులవారు నవ్వుతూ "మనవాళ్ల అన్యోన్య దాంపత్యాల గురించి
చెబుతాను విను" అని ఇలా కొనసాగించారు.
ముందుగా చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గురించి చూద్దాం. ఆయన ఎప్పుడూ ఇంట్లో వుండరు. నానా రాజ సందర్శనం అంటూ ఎప్పుడూ దేశాలమ్మట తిరగడమే! ఇక ఇంట్లో వుండేదెప్పుడు? దెబ్బలాడుకొనేదెప్పుడు ? కాబట్టి వీరిది అన్యోన్య దాంపత్యం.
అలాగే గిడుగు రామమూర్తి. ఆయనకు బ్రహ్మచెవుడు. ఆవిడ తిట్టే తిట్లు ఆయనకు వినిపించవు. అందువల్ల ఇరువురి మధ్యా కజ్జాల్లేవు. కాబట్టి వీరిరువురిదీ అన్యోన్య దాంపత్యమే!
ఇక జమ్ములమడక మాధవరామశర్మ సంగతి. ఈయనదీ ఆదర్శ జీవితమే. ఏమంటారా? ఆయన సంస్క్రతంలో తప్ప మాట్లాడరు. మరి ఆమెకేమో సంస్కృతం రాదు. భాషాభేదం కారణంగా ఇద్దరిలోనూ పొరపొచ్చాలు లేవు.
ఇంకా విను. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారేమో, ఎప్పుడూ ఊహాలోకంలో వుంటాడు. భార్యతో దెబ్బలాడడానికి ఆయన ఎప్పుడైనా వాస్తవ జీవితంలోకి వస్తే కదా ?
ఇక నా గురించి అంటావా, తీరా దెబ్బలాడడానికి సిద్ధం అయ్యేటప్పటికి మా ఆవిడేమో చనిపోయింది మరి. కాబట్టి ఏతావాతా చెప్పేదేమంటే మనందరివీ అన్యోన్యదాంపత్యాలే!" ఏమంటావ్! అంటూ బోసినోటితో పకపకా నవ్వారు మన శివశంకరులు.
Friday, September 21, 2018
తెలుగు వెలుగులు
ఎవరు రాసారో తెలియదు. "అరసున్న" ,(బండి ర) "ఱ" గురించి వాట్సాప్ లో ఎవరో షేర్ చేశారు.*
*అరసున్న [ఁ],*
*బండి 'ఱ' లు ఎందుకు?*
*అరసున్న~బండి ‘ఱ‘ లు*
*నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.*
*ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి.*
*ద్రావిడ భాషా లక్షణాన్ని నిరూపించేవి.*
*అంతేకాదు*
*కావ్యభాషలోను,*
*లక్షణశాస్త్రంలోను*
*వీటి ప్రాముఖ్యం చాలావుంది.*
*వాడకపోతే పరవాలేదు*
*కానీ*
*వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా!*
*మన భాషాసంపదలో*
*ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా!*
*అరసున్న, ఱ ల వల్ల*
*అర్థభేదం ఏర్పడుతొంది.*
*పదసంపదకి ఇవి తోడ్పడతాయి.*
*ఎలాగో చూడండి:*
*ఉదా*:-
*అరుఁగు*
*= వీది అరుగు*
*అరుగు*
*= వెళ్ళు, పోవు*
*అఱుగు*
*= జీర్ణించు*
*ఏఁడు*
*= సంవత్సరం*
*ఏడు*
*= బాధ~7 సంఖ్య*
*కరి*
*= ఏనుగు*
*కఱి*
*= నల్లని*
*కాఁపు*
*= కులము*
*కాపు*
*= కావలి*
*కాఁచు*
*= వెచ్చచేయు*
*కాచు*
*= రక్షించు*
*కారు*
*= ఋతువుకాలము*
*కాఱు*
*= కారుట (స్రవించు)*
(కారు=వాహనం ఆంగ్ల పదము)
*చీఁకు*
*= చప్పరించు*
*చీకు*
*= నిస్సారము, గ్రుడ్డి*
*తఱుఁగు*
*= తగ్గుట*
*తఱుగు*
*= తరగటం(ఖండించటం)*
*తరి*
*= తరుచు*
*తఱి*
*= తఱచు*
*తీరు*
*= పద్ధతి*
*తీఱు*
*= నశించు*
*దాఁక*
*= వరకు*
*దాక*
*= కుండ, పాత్ర*
*నాఁడు*
*= కాలము*
*నాడు*
*= దేశము, ప్రాంతము*
*నెరి*
*= వక్రత*
*నెఱి*
*= అందమైన*
*నీరు*
*= పానీయం*
*నీఱు*
*= బూడిద*
*పేఁట*
*= నగరములో భాగము*
*పేట*
*= హారంలో వరుస*
*పోఁగు*
*= దారము పోఁగు*
*పోగు*
*= కుప్ప*
*బోటి*
*= స్త్రీ*
*బోఁటి*
*= వంటి [నీబోఁటి]*
*వాఁడి*
*= వాఁడిగాగల*
*వాడి*
*= ఉపయోగించి*
*వేరు*
*= చెట్టు వేరు*
*వేఋ*
*= మరొకవిధము*
*మన తల్లిదండ్రులు*
*మన మాతృభాష*
*ఎంతో విలువైనవి*
*గుర్తుంచుకుందాం*
*గౌరవించుకుందాం*
*ఇవి మన సంపద*
*తెలుసుకుని సంతోషపడదాం
కన్యా శుల్కం విశేషాలు
*నాకు నచ్చిన📖*
*కన్యాశుల్కం'* లోని కొన్ని మాటలు అర్ధం కావడం లేదంటున్నారు యువపాఠకులు. *అలాంటి వారికోసమే ఈ పోస్ట్.* వాళ్ళ భావన నిజమే.ఉదాహరణకు పూజారి రామప్పంతులుతో " *వై.స.బు.పె* అని ఎందుకన్నాడు బాబూ !" అంటాడు. *'వైదికీకి సర్వదా బుద్ధి పెడసరమే '* అని దీని అర్ధం.బంగోరె చెప్పినట్టు ఇలా *" కన్యాశుల్కం నాటకాన్నిశబ్దార్ధ విచారణ చేసి రాయాలంటే వేయి పుటల గ్రంధం తయారవుతుంది"* అయినా కొన్ని విషయాలు వివరిస్తాను.ఈ విధంగానైనా కన్యాశుల్కం *కూలంకషంగా* చదవాలనే ఆసక్తి కలుగుతుందని ఓ చిరు ఆశ.
*1)* *" నీ ఇంట కోడిని కాల్చా ! "* అంటాడు అగ్నిహోత్రావధాన్లు.ఇంటి యజమాని చనిపోయినపుడు శవానికి కోడిని దిష్టి తీసి కాల్చడం ఒక ఆచారం.అంటే *'ఆ ఇంటి యజమాని చచ్చుగాక '* అని ఈ తిట్టుకి అర్థమన్నమాట.
గురజాడ తెలుగుతోబాటు సంస్కృతాంగ్ల భాషా సాహిత్యాలను కూడా ఆపోసన పట్టాడు.సందర్భాన్నిబట్టి వాటిని పాత్రోచితంగా వాడుకున్నాడు.
*2.)* నాటకం ప్రారంభం లోనే గిరీశం స్వగతంగా ' *పూర్ రిచర్డ్ చెప్పినట్టు* 'అంటాడు.పూర్ రిచర్డ్ అనేది 19వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కల్పిత పాత్ర. నాటి ప్రసిద్ధ రచయిత బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆ పాత్రపేరుతో ప్రతియేటా 'ఆల్మనాక్' ( పంచాంగం ) ప్రచురించేవాడు.గురజాడ ఆగ్రంధాన్ని చదివారు.
*3)* కరటకశాస్త్రి మధురవాణి నుద్దేశించి *' ఏకా నారీ సుందరీ వాదరీవా* అంటాడు.దీని పూర్తిపాఠం ఇది " ఏకోదేవః కేశవో శివాః / ఏకోవాసః పత్తనంతా వనంవా / ఏకోమిత్రం భూపతిర్వా యతిర్వా /ఏకానారీ సుందరీ వాదరీవా/( శివుడో కేశవుడో ఒకడే దేవుడు.పట్టణమో వనమో ఒకటే నివసించదగిన చోటు.రాజో సన్యాసో ఒకరే ఆశ్రయించదగినవారు.అందగత్తె అయిన భార్యతో కాపురం చేయటమో మునిలా గుహలో ముక్కుమూసుకుని ఉండటమో ఏదొకటి చెయ్యాలి.మధ్యే మార్గం మంచిది కాదని భావం.
*4)* లుబ్ధావధాన్లు దెయ్యాన్ని వదిలించుకోడానికి " *శాపరమంత్రాలు* ఉపదేశం అవుదామంటే బెడిసిగొడతాయేమో అని భయం " అంటాడు.'శాపర' అనేది 'శబర ' అనేదాని రూపం.అంటే భూతప్రేత పిశాచాది క్షుద్రవిద్యలకు సంబంధించినది.వీటిని సరిగా ప్రయోగించకపోతే ప్రయోగించినవారికే కీడు కలుగుతుందని భయం ఉండేది.
*5)* గిరీశం వెంకటేశాన్ని ' సిగర్స్ కోసం *కాపర్స్* ఏమైనా సంపాదించావా లేదా? ' అంటాడు.కాపర్ అంటే రాగి.అర్ధరూపాయి,పావలా,బేడ వగైరా నాణాలు వెండితోనూ అణాలూ పైసలూ రాగితోనూ చేసేవారు.
*6)* 'నన్ను *సప్తవెధవ* ను చేశావు ' అంటాడు రామప్పంతులు మధురవాణితో.వధువు ఎంచుకున్న పురుషుడు వరుడు.స్త్రీ అలా ఏడుసార్లు వరులను మార్చుకోవచ్చు. *ఏడోసారి కూడా స్త్రీ ఆ మగాణ్ణి ఎంచుకోకపోతే అతణ్ణి సప్తవెధవ* అంటారు.
*7)* ' నీకీ *చిల్లంగికళ్ళు* ఏదేవుడిచ్చాడు? ' అంటుంది మధురవాణి శిష్యుణ్ణి.చేతబడుల్లాంటివి చేసేవాళ్ళు ఆ మంత్రాలూ పఠిస్తూ కంటి రెప్పలు ఆడించి అవతలివారిని వశీకరణ చేసుకునే పధ్ధతి అట.
*8)* పోలిశెట్టి పూజారితో ' *పాసం పెట్టి* సంపేస్తావా యేటి ? ' అంటాడు పేకాటసీనులో.కవిత్వంలో ఆయాస్థానాల్లో నిషిద్ధమైన అక్షరాన్ని పెట్టి శత్రువులకు కీడు చెయ్యొచ్చనే మూఢనమ్మకం ఉండేది.ఉదాహరణకి అ ,క ,చ ,ట ,త ,ప ,య ,స అనే అక్షరాలు పద్యపాదంలో 2,3,6,9,10,14 స్థానాల్లో పడకూడదట.వేములవాడ భీమకవి " హయమది సీత " అని ఆరో స్థానంలో 'త 'పెట్టి శపించడంవల్ల రాజకళింగగంగు రాజ్యభ్రష్టుడైపోయాడని కథ.
*9)* మీనాక్షి తండ్రితో 'ఎందుకీ *తంబళ అనుమానం?* 'అంటుంది.లుబ్దావధాన్లు ' *గుండు గొమ్ముల అనుమానం* 'తీరిపోయింది.'అంటాడు.ఇవి ఒక జాతీయానికి సంబంధించినవి. తంబళ అంటే శివార్చన చేసే పూజారి.అతను గుడికెళ్లే దారిలో ఒక ఆంబోతు మా గన్నుగా పడుకుని ఉంది వృత్తంలాగా ఉన్న దాని కొమ్ములో తనతల(గుండు)పడుతుందో పట్టదో చూడాలనిపించి తల దూర్చాడు.ఆంబోతుకి నిద్రవదిలి ఆ తంబళిని ఎగరేస్తూ ఊరంతా కలతిరిగితే పదిమందీ రక్షించారు. ఆ దెబ్బతో తంబళికి గుండు కొమ్ముల అనుమానం తీరింది.
*10)* *'ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూంటేనే కానీ పొలిటీషియన్ కానేరడు'* అంటాడు గిరీశం.మద్రాస్ కాంగ్రెస్ మహాసభలలో కాంగ్రెస్ నాయకులు అంతకుముందు చెప్పిన అభిప్రాయాలు మార్చారని,ఆ సభలకు వెళ్లొచ్చిన గురజాడ దాన్ని జ్ఞాపకం చెయ్యడానికి ఈ మాటలు వాడారు.
*11)* 'లుబ్ధావధాన్లు *శతాంధః కూపం ప్రవిశంతి "* అంటాడు.ఓ గుడ్డివాణ్ణి అనుసరించి వందమంది నూతిలో పడ్డారని అర్ధం.
*12.)* గిరీశం సౌజన్యారావు పంతులుతో *"మిషనరీ ఒరిజినల్ సిన్ అంటాడండి "* అని లెక్చర్ ఇస్తాడు. ఆడం ఈవ్ లు భగవంతుడి మాట జవదాటడం వల్ల ,ఆ పాపం తరువాత తరాలకు పుట్టుకతోనే సంక్రమిస్తుందనే క్రైస్తవుల విశ్వాసమే ఒరిజినల్ సిన్.
*13)* *"ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను" అంటాడు అగ్నిహోత్రావధాన్లు "* శ్రాద్ధకర్మలు మొత్తం పదో పన్నెండో ఉన్నాయి.వాటిలో ఒకటిఘటాశ్రాద్ధం.పతితుడైనవాడు ప్రాయశ్చిత్తానికి ఒప్పుకోకపోతే అతని జ్ఞాతులు అతను బ్రతికుండగానే ప్రేత కార్యం జరిపి ,ఒక కుండను నీటితో నింపి ,దాసితో దాన్ని తన్నించి నీటిని ఒలకపోయడం అనే అపరకర్మ.
ఇలా నాకు తెలిసినవీ తెలియాల్సినవీ కూడా ఉన్నాయి. *నాకు తెలిసి కన్యాశుల్కం నాటకంపై జరిగినంత చర్చ ఏనాటకంపైనా జరగలేదు*
*పైన చెప్పినవి నా సొంతం కాదు.* బంగోరె,ఆర్వీయార్,ఆవంత్స సోమసుందర్,రాంభట్ల రచనలనుండి సేకరించినవి. కొన్ని పదాలు పండితులకు కూడా కొరుకుడుపళ్ళేదు.ఉదా: 'నా సంబంధం చేసుకుంటే *"ఇరవై రాపాషాణాలిస్తాను"* అంటాడు కరటకశాస్త్రి. *" ఈ రాపాషాణాలు "* అంటే అర్ధం తెలియదు" అన్నారు ఆవంత్స సోమసుందర్.
ఈ రోజు *గురజాడ జయంతి*