Friday, December 27, 2019

సంస్కృత శ్లోకం

subashitam
Sloka

दिवसेनैव तत् कुर्याद् येन रात्रौ सुखं वसेत् ।
यावज्जीवं च तत्कुर्याद् येन प्रेत्य सुखं वसेत् ॥

दिवसेन एव तत् कुर्यात् एन रात्रौ सुखं वसेत् ।
यावत् जीवं च तत् कुर्यात् येन प्रेत्य सुखं वसेत् ।‌।

Meaning :

Do your duties of the day perfectly so as you can sleep during night peacefuliy. Let your actions of lifetime bring good words after your lifetime.

भावार्थ-:

        दिनभर ऐसा काम करो जिससे रातमें चैन की नींद आ सके । वैसे ही जीवनभर ऐसे कर्म करो जिससे मृत्यु के पश्चात सुख मिले अर्थात सद्गति प्राप्त हो ।

Tuesday, October 22, 2019

మాళవ రాజధాని ధారానగరంలో అప్పుడే సూర్యాస్తమయం అయింది.అస్తమిస్తున్న అరుణారుణ చైత్ర సంధ్యా శోభలు ధారానగర ప్రాసాదగోపురాలపై ప్రతిష్ఠించిన స్వర్ణ కళాశాలతో దోబూచు లాడుకుంటున్నాయి.

అదే సమయంలో భోజరాజు రాజప్రాసాదం పైఅంతస్థులో  కొలువుదీరి కవితా గోష్ఠితో

వినోదిస్తున్నాడు. మహారాజు దృష్టి యెర్రని సంజవెలుగుల సొగసులతో లీనమైపోయింది.

ప్రక్కనే వున్న కవీశ్వరులవైపు సాభిప్రాయంగా చూశాడు. ఆయనభావం గ్రహించిన వారు

అందరూ ఒక్క్కొక్కరు ఒక్కొక్క పాదం చొప్పున సాంధ్య వర్ణన కవితలు చెప్పడం ప్రారంభించారు.

" పరిపతతి పయోనిధౌ పతంగః" సూర్యుడు సముద్రములో పడిపోతున్నాడు.

   అని కృష్ణ కవి చెప్పాడు.

అయితే భోజరాజు ముఖంలో అసంతృప్తి కనిపించింది. ఆయన కళింగ కవి వైపు చూశాడు. వెంటనే అతడు

        "ఉపవన తరుకోటరే  విహంగః "  ఉద్యానవనంలోని చెట్టు తొర్రలో పక్షి ప్రవేశిస్తున్నది. అని అర్థం. ఇంకా మహారాజుకు తృప్తి కలుగలేదు. పక్కనే కూచున్న మహేశ్వర కవి వైపు చూశాడు. ఆయన వెంటనే

"సరసిరుహా ముద రేషు మత్త భృంగః" సాయంకాలం కాగానే మదించిన తుమ్మెద తామర

పూవులో పడిపోతున్నదని. భావం. ఇంకా రాజుకు తృప్తి కలగలేదు. కొంచెం దూరం లో నున్న కాళిదాసు వైపు చూశాడు. కాళిదాసు కొంచెం సేపు ఆలోచించి,

"యువతి జనేషు శనైశ్మనై రనంగః" అని శ్లోకం పూర్తి చేశాడు. అంటే సాయంకాలం కాగానే

యువతీ జనంలో నెమ్మది నెమ్మదిగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు. అని తాత్పర్యం.

సభాసదులంతా ఒక్కసారిగా శిరః కంపం చేసి కరతాళ ధ్వనులు  చేసి ఔను ఔనని

ప్రశంసించారు.  వెంటనే కాళిదాసు ఆ శ్లోకం అంతా ఎంతో శ్రావ్యంగా పఠించాడు.

                  "పరిపతతి పయోనిధౌ పతంగః"

                   ఉపవన తరు కోటరే విహంగః

                   సరసిరుహా ముదరేషు మత్త భృంగః

                   యువతి జనేషు శనైశ్మనై రనంగః

శ్లోకం పూర్తి చేసేసరికి తిరిగీ సభాసదులు హర్షామోదాలతో కరతాళ ధ్వనులు చేశారు.

వెంటనే భోజరాజు తన మెడలోని ముత్యాలహారం తీసి కాళిదాసకవి కంఠం లో అలంక రించారు. సభాసదులందరూ భోజరాజు ఔదార్యాన్ని అనేక విధాలుగా ప్రశంసించారు.

------------------శుభసాయంత్రం-------------------------ఎ

కాళిదాసు

శ్లోకం పూర్తి చేసేసరికి తిరిగీ సభాసదులు హర్షామోదాలతో క్రేతాన్కరతాళ ధ్వనులు చేశారు.

వెంటనే భోజరాజు తన మెడలోని ముత్యాలహారం తీసి కాళిదాసకవి కంఠం లో అలంక రించారు. సభాసదులందరూ భోజరాజు ఔదార్యాన్ని అనేక విధాలుగా ప్రశంసించారు.

Monday, August 19, 2019

కాళిదాసు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

                     వాక్సుద్ధి !
                  ➖➖➖✍

ఒక సారి భోజరాజుకు ఒక  వింత కోరిక కలిగింది. ‘నేను మరణించిన తర్వాత కాళిదాసు తన గురించి ఏమి చెప్తాడు?’
అని.    కాళిదాసును పిలిపించి తన కోరిక చెప్పాడు.

కాళిదాసు ‘మీ కోరిక పిచ్చిగానూ, అమంగళ కరము గానూ వుంది నేను  తీర్చలేను క్షమించండి’ అన్నాడు.

‘రాజాజ్ఞను ధిక్కరించిన వారికి దేశ బహిష్కారమే శిక్ష!’ అన్నాడు రాజు కాళిదాసు 
భయపడి చెప్తాడేమో నని.

కానీ కాళిదాసు ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే'అని చెప్పి ధారానగరం విడిచి వెళ్ళిపోయాడు.

యిలా జరుగుతుందని వూహించని రాజు దిగులు పడిపోయాడు. కాళిదాసు లేకుంటే ఆయనకు ఒక్క రోజు కూడా గడవదు.

కొన్నాళ్ళు గడిచాక, కాళిదాసు ఏకశిలా నగరం లో ఉన్నాడని భోజరాజుకు  వేగులు  చెప్పారు.

వెంటనే భోజరాజు గడ్డాలూ మీసాలూ పెట్టుకొని యోగి వేషంలో కాళిదాసును వెతకడానికి ఏకశిలా నగరానికి వెళ్ళాడు.

అక్కడ కాళిదాసు ఆయనకు ఎదురుపడ్డాడు. భోజరాజు ఆయనను చూసి ‘మహా కవీ! అభివాదాలు’ అన్నాడు. ‘నేను ధారా నగరం నుండి వస్తున్నాను’ అన్నాడు.

‘అలాగా అయితే భోజరాజు గారు యెలా వున్నారు?’ అని ఆత్రంగా  అడిగాడు
కాళిదాసు.

అప్పుడు యోగి వేషంలో వున్న భోజరాజు విచారంగా ‘యింకెక్కడి భోజరాజు? కాళిదాసు గారు వెళ్లిపోగానే ఆయన ఆదిగులుతో మరణించారు’ అన్నాడు.

కాళిదాసు అదిరి పడ్డాడు. ఆయనకు భోజరాజుతో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి అప్రయత్నంగా ఆయన నోటివెంట ఓ శ్లోకం వచ్చింది.

 *"అద్యధారా నిరాధారా నిరాలంబా సరస్వతీ * 
*పండితా ఖండితా సర్వే భోజరాజే దివంగతే!*

అర్థము:-“ఈరోజు ధారానగరం నిరాధారమై పోయింది.  వాగ్దేవికి ఆలంబన పోయింది. భోజరాజు దివంగతుడు కావటంతో పండితు లందరికీ చావు దెబ్బ తగిలింది.”

కానీ ఆయన వాక్శుద్ధి ప్రభావంతో ఆ యోగి అకస్మాత్తుగా కూలి చనిపోయాడు.

నిదానంగా చూసి ఆయోగిని రాజుగా గుర్తించి “ఎంత పని చేశారు మహారాజా!”  అని  రోదించాడు కాళిదాసు.

వెంటనే కర్తవ్యం స్ఫురించి భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తన శ్లోకాన్ని మార్చి చదివాడు.

*అద్యధారా సదా ధారా, సదాలంబా సరస్వతీ*
*పండితా మండితా సర్వే, భోజరాజే భువంగతే.*

 అర్థము:-“ఈరోజు ధారానగరానికీ,సరస్వతీ దేవికీ చక్కని ఆలంబన దొరికింది.
భోజరాజు భూలోకంలో అవతరించగానే పండితులందరూ చక్కగా సత్కరించబడ్డారు.”

శ్లోకం వినగానే భోజరాజు సజీవుడై లేచి కూర్చున్నాడు. రాజూ, కవిరాజూ గాడంగా కౌగలించు కున్నారు. ధారా నగరానికి తిరిగి వెళ్లి పోయారు. కాళిదాసు వాక్శుద్ధి అలాంటిది మరి!._✍

                       🌷🙏🌷

Saturday, September 29, 2018

చతురోక్తులు

ముని మాణిక్యం వారి అన్యోన్య దాంపత్యాలు - చతురోక్తులు

ఓ మారు మునిమాణిక్యం నరసింహారావు గారు  తల్లావజ్జుల శివశంకరస్వామిగారిని ఇలా కదిపారు.

   "అన్నగారూ! నాకు మా ఆవిడతో ఒక నిమిషం పడదు. నిత్యం దెబ్బలాడుకుంటూంటాం. ఒక్క నేనేనా?
ఇతరులు కూడా అలాగేవుంటారా?"

   తల్లావజ్జులవారు నవ్వుతూ "మనవాళ్ల అన్యోన్య దాంపత్యాల గురించి
చెబుతాను విను"  అని ఇలా కొనసాగించారు.

   ముందుగా చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గురించి చూద్దాం. ఆయన ఎప్పుడూ ఇంట్లో వుండరు. నానా రాజ సందర్శనం అంటూ ఎప్పుడూ దేశాలమ్మట తిరగడమే! ఇక ఇంట్లో వుండేదెప్పుడు? దెబ్బలాడుకొనేదెప్పుడు ? కాబట్టి వీరిది అన్యోన్య దాంపత్యం.

   అలాగే గిడుగు రామమూర్తి. ఆయనకు బ్రహ్మచెవుడు. ఆవిడ తిట్టే తిట్లు ఆయనకు వినిపించవు. అందువల్ల ఇరువురి మధ్యా కజ్జాల్లేవు. కాబట్టి వీరిరువురిదీ అన్యోన్య దాంపత్యమే!

  ఇక జమ్ములమడక మాధవరామశర్మ సంగతి. ఈయనదీ ఆదర్శ జీవితమే. ఏమంటారా? ఆయన సంస్క్రతంలో తప్ప మాట్లాడరు. మరి ఆమెకేమో సంస్కృతం రాదు. భాషాభేదం కారణంగా ఇద్దరిలోనూ పొరపొచ్చాలు లేవు.

   ఇంకా విను. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారేమో, ఎప్పుడూ ఊహాలోకంలో వుంటాడు. భార్యతో దెబ్బలాడడానికి ఆయన ఎప్పుడైనా వాస్తవ జీవితంలోకి వస్తే కదా ?

    ఇక నా గురించి అంటావా, తీరా దెబ్బలాడడానికి సిద్ధం అయ్యేటప్పటికి మా ఆవిడేమో చనిపోయింది మరి. కాబట్టి ఏతావాతా చెప్పేదేమంటే మనందరివీ అన్యోన్యదాంపత్యాలే!" ఏమంటావ్! అంటూ బోసినోటితో పకపకా నవ్వారు మన శివశంకరులు.