Sunday, December 29, 2019

యక్షులు ఎవరు

 దేవతా గణములుదేవతా
 గణాలు - యక్షులు :

యక్షులు అనగానే వాళ్ళు దెయ్యాలేమో అనే అభిప్రాయం చాలా మందికి ఉంది.  కానీ మన శివ పంచాక్షరీ స్తోత్రంలో శివుడిని స్తుతిస్తూ "యక్ష స్వరూపాయ" అని అంటాం కదా!

    శివుడు దేవుడు. కాబట్టి వాళ్ళెవరో కూడా గొప్పవాళ్ళే అయ్యుంటారు. ఈ యక్షుల ప్రస్తావన మన పురాణాలలో కూడా చాలా సార్లు వస్తుంది కనుక వారి గురించి మరిన్ని ఆసక్తికరమయిన విషయాలు చదువగలరు.

విషయానికి వస్తే, వీరు దేవతా గణాలలో ఒకరు. వీరి నివాసం అథో లోకాలలో ఒకటయిన తలాతలం (అతలంలో పిశాచ గణాలు, వితలంలో గుహ్యకులు, సుతలంలో రాక్షసులు, రసాతలంలో భూతాలూ, తలాతలంలో యక్షులు, మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగులు ఉంటారు.(అయితే ఇవన్నీ "తలాలు". (Dimensions)" అలానే, గోమాతలో సకల దేవతలు, దేవతా గణాలన్నీ ఉన్నాయి.అలా చూసుకుంటే వీరి నివాసం గోమాత యొక్క వామ భాగం. వరాహ పురాణంలో ఒక్కో దేవతా గణానికీ ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని చెప్పబడింది. దాని ప్రకారం వీరి నివాస పర్వతం శతశృంగం.
...........వీరు ఎక్కడుంటారో తెలిసింది, కనుక ఎలా ఉంటారు? అన్నది తెలియాలి. వీరిలో మగ వారిని యక్షుడు అని, ఆడవారిని యక్షిణి అని అంటారు. వీరు సౌందర్యమయిన శరీరాకృతిని కలిగి ఇక్కడ చిత్రములో చూపిన విధముగా ఉంటారు. యక్షులకి కుబేరుడు రాజు. వీరి పని గుప్త నిధులకి కాపలా. వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే మనం కోరుకున్నవి దక్కించుకోవచ్చు అని ఉత్థమారేశ్వర తంత్రంలో చెప్పబడింది. వీళ్ళల్లో యక్షిణులు అత్యంత శక్తి కలవారు. వారిని మనం ఆవాహనం కూడా చేసుకోవచ్చు. ఎన్నో యక్షిణీ సాధనలు ఉన్నాయి. మన మనుజులలోనే కొందరు గొప్పవారయిన సాధకులు అనేక యక్షిణీ సాధనల్లో, సాకార సాక్షాత్కారం పొందినవారే. అటువంటి సమయాల్లో వాళ్ళు మనిషి శరీరంలోకి చెవి ద్వారా ప్రవేశిస్తారుట. వీళ్ళు సాధారణంగా మంచి చేస్తూ శాంతంగా ఉంటారు . కానీ కొద్ది మంది రౌద్రంగా ఉండి చెడు చేస్తారుట.
యక్షులు మంచి కళాపోషకులు అని అంటారు. కాళిదాసు రచించిన మేఘదూతం (తెలుగులో మేఘసందేశం)లో యక్షుడు తన ప్రియురాలయిన యక్షిణిని వదిలి ఉండలేక ఆ విరహానికి చక్కని అక్షర రూపం ఇచ్చాడు. అలానే, మహాభారతంలో యక్ష ప్రశ్నల గురించి వినే ఉంటారు. అవి చదివితే అబ్బో వాళ్ళెంత తెలివయిన వాళ్ళో అనిపిస్తుంది. హరివంశ కావ్యాన్ని తెలుగులో రచించిన వారిలో ఒకరయిన

 నాచన సోమన గారిని , ఘన నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున యక్షిణి దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్ అని కొనియాడారు పరవస్తు చిన్నయసూరి గారు....      మనకి బాగా తెలిసిన యక్షిణి "తాటకి". సుకేతుడు అనే యక్షుడు పిల్లలకోసం తపస్సు చేసినపుడు నీకు వెయ్యి ఏనుగుల బలం ఉన్న కూతురు పుడుతుంది అని బ్రహ్మ వరం ఇవ్వగా తాటకి పుట్టింది. ఈమెను ఝఝరుడను యక్షుని కుమారుడయిన సుందుడు కి ఇచ్చి పెళ్లి చేయగా వారికి మారీచుడు పుడతాడు. ఒకసారి సుందుడు అగస్త్యున్ని కొట్టడానికి వెళ్తాడు అప్పుడు ఆయన ఆగ్రహంతో సుందుడిని భస్మం చేస్తాడు . అది భరించలేక తాటకి, మారీచుడు కలిసి అగస్త్యుని చంపడానికి వెళ్తే ఆయన వీరివురినీ రాక్షసులు అవ్వమని శపిస్తారు. అలా యక్షులు కాస్తా రాక్షసులుగా మారారు అని వాల్మీకి రామాయణంలో బాలకాండలో చెప్పబడింది.

మనకి బాగా తెలిసిన మరికొంతమంది యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు. వీరిద్దరినీ మద్ది చెట్టులై పడమని ఒక ముని శపిస్తాడు. ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి కృష్ణుడు రోలుని (యశోదా దేవి కృష్ణుడిని రాతికి కట్టినపుడు) పెట్టి లాగడం వలన వాళ్ళకి శాపవిమోచనం జరుగుతుంది.

యక్షులు దేవతా గణాలే అయినా కొంతమంది స్వార్థ పరులకి ఉపయోగపడటం వలన, వీరు రాత్రి పూట ఎక్కువగా విహరించటం వలన వీరిని భూతాల్లా భావిస్తున్నారు. కనీసం ఒక యక్షిణిని అయినా వశం చేసుకుంటే, కామ్యకాలయినా నెరవేరతాయి.

Friday, December 27, 2019

సంస్కృత శ్లోకం

subashitam
Sloka

दिवसेनैव तत् कुर्याद् येन रात्रौ सुखं वसेत् ।
यावज्जीवं च तत्कुर्याद् येन प्रेत्य सुखं वसेत् ॥

दिवसेन एव तत् कुर्यात् एन रात्रौ सुखं वसेत् ।
यावत् जीवं च तत् कुर्यात् येन प्रेत्य सुखं वसेत् ।‌।

Meaning :

Do your duties of the day perfectly so as you can sleep during night peacefuliy. Let your actions of lifetime bring good words after your lifetime.

भावार्थ-:

        दिनभर ऐसा काम करो जिससे रातमें चैन की नींद आ सके । वैसे ही जीवनभर ऐसे कर्म करो जिससे मृत्यु के पश्चात सुख मिले अर्थात सद्गति प्राप्त हो ।

Tuesday, October 22, 2019

మాళవ రాజధాని ధారానగరంలో అప్పుడే సూర్యాస్తమయం అయింది.అస్తమిస్తున్న అరుణారుణ చైత్ర సంధ్యా శోభలు ధారానగర ప్రాసాదగోపురాలపై ప్రతిష్ఠించిన స్వర్ణ కళాశాలతో దోబూచు లాడుకుంటున్నాయి.

అదే సమయంలో భోజరాజు రాజప్రాసాదం పైఅంతస్థులో  కొలువుదీరి కవితా గోష్ఠితో

వినోదిస్తున్నాడు. మహారాజు దృష్టి యెర్రని సంజవెలుగుల సొగసులతో లీనమైపోయింది.

ప్రక్కనే వున్న కవీశ్వరులవైపు సాభిప్రాయంగా చూశాడు. ఆయనభావం గ్రహించిన వారు

అందరూ ఒక్క్కొక్కరు ఒక్కొక్క పాదం చొప్పున సాంధ్య వర్ణన కవితలు చెప్పడం ప్రారంభించారు.

" పరిపతతి పయోనిధౌ పతంగః" సూర్యుడు సముద్రములో పడిపోతున్నాడు.

   అని కృష్ణ కవి చెప్పాడు.

అయితే భోజరాజు ముఖంలో అసంతృప్తి కనిపించింది. ఆయన కళింగ కవి వైపు చూశాడు. వెంటనే అతడు

        "ఉపవన తరుకోటరే  విహంగః "  ఉద్యానవనంలోని చెట్టు తొర్రలో పక్షి ప్రవేశిస్తున్నది. అని అర్థం. ఇంకా మహారాజుకు తృప్తి కలుగలేదు. పక్కనే కూచున్న మహేశ్వర కవి వైపు చూశాడు. ఆయన వెంటనే

"సరసిరుహా ముద రేషు మత్త భృంగః" సాయంకాలం కాగానే మదించిన తుమ్మెద తామర

పూవులో పడిపోతున్నదని. భావం. ఇంకా రాజుకు తృప్తి కలగలేదు. కొంచెం దూరం లో నున్న కాళిదాసు వైపు చూశాడు. కాళిదాసు కొంచెం సేపు ఆలోచించి,



"యువతి జనేషు శనైశ్మనై రనంగః" అని శ్లోకం పూర్తి చేశాడు. అంటే సాయంకాలం కాగానే

యువతీ జనంలో నెమ్మది నెమ్మదిగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు. అని తాత్పర్యం.

సభాసదులంతా ఒక్కసారిగా శిరః కంపం చేసి కరతాళ ధ్వనులు  చేసి ఔను ఔనని

ప్రశంసించారు.  వెంటనే కాళిదాసు ఆ శ్లోకం అంతా ఎంతో శ్రావ్యంగా పఠించాడు.



                  "పరిపతతి పయోనిధౌ పతంగః"

                   ఉపవన తరు కోటరే విహంగః

                   సరసిరుహా ముదరేషు మత్త భృంగః

                   యువతి జనేషు శనైశ్మనై రనంగః

శ్లోకం పూర్తి చేసేసరికి తిరిగీ సభాసదులు హర్షామోదాలతో కరతాళ ధ్వనులు చేశారు.

వెంటనే భోజరాజు తన మెడలోని ముత్యాలహారం తీసి కాళిదాసకవి కంఠం లో అలంక రించారు. సభాసదులందరూ భోజరాజు ఔదార్యాన్ని అనేక విధాలుగా ప్రశంసించారు.



------------------శుభసాయంత్రం-------------------------ఎ

కాళిదాసు

మాళవ రాజధాని ధారానగరంలో అప్పుడే సూర్యాస్తమయం అయింది.అస్తమిస్తున్న అరుణారుణ చైత్ర సంధ్యా శోభలు ధారానగర ప్రాసాదగోపురాలపై ప్రతిష్ఠించిన స్వర్ణ కళాశాలతో దోబూచు లాడుకుంటున్నాయి.

అదే సమయంలో భోజరాజు రాజప్రాసాదం పైఅంతస్థులో  కొలువుదీరి కవితా గోష్ఠితో

వినోదిస్తున్నాడు. మహారాజు దృష్టి యెర్రని సంజవెలుగుల సొగసులతో లీనమైపోయింది.

ప్రక్కనే వున్న కవీశ్వరులవైపు సాభిప్రాయంగా చూశాడు. ఆయనభావం గ్రహించిన వారు

అందరూ ఒక్క్కొక్కరు ఒక్కొక్క పాదం చొప్పున సాంధ్య వర్ణన కవితలు చెప్పడం ప్రారంభించారు.

" పరిపతతి పయోనిధౌ పతంగః" సూర్యుడు సముద్రములో పడిపోతున్నాడు.

   అని కృష్ణ కవి చెప్పాడు.

అయితే భోజరాజు ముఖంలో అసంతృప్తి కనిపించింది. ఆయన కళింగ కవి వైపు చూశాడు. వెంటనే అతడు

        "ఉపవన తరుకోటరే  విహంగః "  ఉద్యానవనంలోని చెట్టు తొర్రలో పక్షి ప్రవేశిస్తున్నది. అని అర్థం. ఇంకా మహారాజుకు తృప్తి కలుగలేదు. పక్కనే కూచున్న మహేశ్వర కవి వైపు చూశాడు. ఆయన వెంటనే

"సరసిరుహా ముద రేషు మత్త భృంగః" సాయంకాలం కాగానే మదించిన తుమ్మెద తామర

పూవులో పడిపోతున్నదని. భావం. ఇంకా రాజుకు తృప్తి కలగలేదు. కొంచెం దూరం లో నున్న కాళిదాసు వైపు చూశాడు. కాళిదాసు కొంచెం సేపు ఆలోచించి,



"యువతి జనేషు శనైశ్మనై రనంగః" అని శ్లోకం పూర్తి చేశాడు. అంటే సాయంకాలం కాగానే

యువతీ జనంలో నెమ్మది నెమ్మదిగా మన్మథుడు ప్రవేశిస్తున్నాడు. అని తాత్పర్యం.

సభాసదులంతా ఒక్కసారిగా శిరః కంపం చేసి కరతాళ ధ్వనులు  చేసి ఔను ఔనని

ప్రశంసించారు.  వెంటనే కాళిదాసు ఆ శ్లోకం అంతా ఎంతో శ్రావ్యంగా పఠించాడు.



                  "పరిపతతి పయోనిధౌ పతంగః"

                   ఉపవన తరు కోటరే విహంగః

                   సరసిరుహా ముదరేషు మత్త భృంగః

                   యువతి జనేషు శనైశ్మనై రనంగః

శ్లోకం పూర్తి చేసేసరికి తిరిగీ సభాసదులు హర్షామోదాలతో క్రేతాన్కరతాళ ధ్వనులు చేశారు.

వెంటనే భోజరాజు తన మెడలోని ముత్యాలహారం తీసి కాళిదాసకవి కంఠం లో అలంక రించారు. సభాసదులందరూ భోజరాజు ఔదార్యాన్ని అనేక విధాలుగా ప్రశంసించారు.



Monday, August 19, 2019

కాళిదాసు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

                     వాక్సుద్ధి !
                  ➖➖➖✍

ఒక సారి భోజరాజుకు ఒక  వింత కోరిక కలిగింది. ‘నేను మరణించిన తర్వాత కాళిదాసు తన గురించి ఏమి చెప్తాడు?’
అని.    కాళిదాసును పిలిపించి తన కోరిక చెప్పాడు.

కాళిదాసు ‘మీ కోరిక పిచ్చిగానూ, అమంగళ కరము గానూ వుంది నేను  తీర్చలేను క్షమించండి’ అన్నాడు.

‘రాజాజ్ఞను ధిక్కరించిన వారికి దేశ బహిష్కారమే శిక్ష!’ అన్నాడు రాజు కాళిదాసు 
భయపడి చెప్తాడేమో నని.

కానీ కాళిదాసు ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే'అని చెప్పి ధారానగరం విడిచి వెళ్ళిపోయాడు.

యిలా జరుగుతుందని వూహించని రాజు దిగులు పడిపోయాడు. కాళిదాసు లేకుంటే ఆయనకు ఒక్క రోజు కూడా గడవదు.

కొన్నాళ్ళు గడిచాక, కాళిదాసు ఏకశిలా నగరం లో ఉన్నాడని భోజరాజుకు  వేగులు  చెప్పారు.

వెంటనే భోజరాజు గడ్డాలూ మీసాలూ పెట్టుకొని యోగి వేషంలో కాళిదాసును వెతకడానికి ఏకశిలా నగరానికి వెళ్ళాడు.

అక్కడ కాళిదాసు ఆయనకు ఎదురుపడ్డాడు. భోజరాజు ఆయనను చూసి ‘మహా కవీ! అభివాదాలు’ అన్నాడు. ‘నేను ధారా నగరం నుండి వస్తున్నాను’ అన్నాడు.

‘అలాగా అయితే భోజరాజు గారు యెలా వున్నారు?’ అని ఆత్రంగా  అడిగాడు
కాళిదాసు.

అప్పుడు యోగి వేషంలో వున్న భోజరాజు విచారంగా ‘యింకెక్కడి భోజరాజు? కాళిదాసు గారు వెళ్లిపోగానే ఆయన ఆదిగులుతో మరణించారు’ అన్నాడు.

కాళిదాసు అదిరి పడ్డాడు. ఆయనకు భోజరాజుతో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి అప్రయత్నంగా ఆయన నోటివెంట ఓ శ్లోకం వచ్చింది.

 *"అద్యధారా నిరాధారా నిరాలంబా సరస్వతీ * 
*పండితా ఖండితా సర్వే భోజరాజే దివంగతే!*

అర్థము:-“ఈరోజు ధారానగరం నిరాధారమై పోయింది.  వాగ్దేవికి ఆలంబన పోయింది. భోజరాజు దివంగతుడు కావటంతో పండితు లందరికీ చావు దెబ్బ తగిలింది.”

కానీ ఆయన వాక్శుద్ధి ప్రభావంతో ఆ యోగి అకస్మాత్తుగా కూలి చనిపోయాడు.

నిదానంగా చూసి ఆయోగిని రాజుగా గుర్తించి “ఎంత పని చేశారు మహారాజా!”  అని  రోదించాడు కాళిదాసు.

వెంటనే కర్తవ్యం స్ఫురించి భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తన శ్లోకాన్ని మార్చి చదివాడు.

*అద్యధారా సదా ధారా, సదాలంబా సరస్వతీ*
*పండితా మండితా సర్వే, భోజరాజే భువంగతే.*

 అర్థము:-“ఈరోజు ధారానగరానికీ,సరస్వతీ దేవికీ చక్కని ఆలంబన దొరికింది.
భోజరాజు భూలోకంలో అవతరించగానే పండితులందరూ చక్కగా సత్కరించబడ్డారు.”

శ్లోకం వినగానే భోజరాజు సజీవుడై లేచి కూర్చున్నాడు. రాజూ, కవిరాజూ గాడంగా కౌగలించు కున్నారు. ధారా నగరానికి తిరిగి వెళ్లి పోయారు. కాళిదాసు వాక్శుద్ధి అలాంటిది మరి!._✍

                       🌷🙏🌷