Sunday, October 13, 2024

చార్ ధామ్ యాత్ర

8/9/24 నుండి 10/9/24




 కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |

విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ

జయజయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో

8/9/24

నగరసు నుంచి   హరిద్వార్ కు  ప్రయాణం. బదరీనాద్ నుండి హరిద్వార్ 322 కి మీ

బదరీనాద్ నుండి నగరసు 133 కి మీ 4 30 గం ప్రయాణం కానీ ట్రాఫిక్ జామ్ తో 6.30 గంట పట్టింది. ఈ రోజు 190 కి మీ ప్రయాణం 5.గం సుమారు గా

నగరసు లో 8 .30 బయలుదేరాం టిఫిన్ చేసి. టిఫిన్ పోహ

 ఈరోజు మొత్తం ప్రయాణంలో 9వ రోజు ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగింది అంతా దారి లో విధమైనటువంటి రద్దీ లేదు చాలా ప్రశాంతంగా మధ్యాహ్నం 12.30 గంటలకు రిషీకేష్ చేరాము ఎక్కడా  దిగలేదు  హరిద్వార్ కి ప్రాచీన రామ మందిరంలో ఆశ్రమం కి వెళ్ళాము మధ్యాహ్నం 1:30 కల్లా నేను ఏ ప్రదేశం లో అయితే బయలుదేరాము అదే ప్రదేశానికి రాముల వారి గుడి దగ్గరికి ప్రాంతాన్ని చేరుకున్నాము చాలా ప్రశాంతంగా హాయిగా ఆనందం గా  జరిగింది.స్వామి కి నమస్కరించి అక్కడే రూమ్ తీసుకొని భోజనం చేసాము.  ఇక ఆరోజు విశ్రాంతి. సాయంకాలం నాలుగు గంటలకి హరికి పౌరీ  వెళ్ళాము . ఆ పక్కనే బ్రహ్మాండమైనటువంటి   అలంకరణ,పూజా సామాగ్రి దొరికేటువంటి ప్రదేశం మొత్తం తిరిగేము అక్కడ కొన్ని అలంకరణ వస్తువులను తీసుకున్నాం రాజాకి కొత్త ఇంటికి అలంకరణ సామాగ్రి  అందమైనటువంటి వస్తువులను తీసుకొన్నాము.ఇక్కడ కొన్ని వస్తువులు మరెక్కడా దొరకవు. మంచి మన్నిక. ధర తక్కువ. ఆన్లైన్ లో కూడా కనిపించవు  కొన్ని వస్తువులు. షాపింగ్ అయింది.  హరికి పౌరి లో దర్శనానికి వెళ్ళాము సాయంకాలం హారతులు అయిన తర్వాతరూమ్ కి వచ్చాము. ఇలా హరిద్వార్ 9వ యాత్ర జరిగింది. మేము యాత్ర లో ఒకరోజు అదనంగా పెట్టుకున్నాము .మధ్యలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయని. అదృష్టం దేవుని అనుగ్రహముతో శుభకరం గా సుఖకరంగా యాత్ర జరిగింది. మరుసటి రోజు కూడా హరిద్వార్ లోనే మకాం. ఎక్కడికీ వెల్లలేదు .ఉదయాన్నే గంగా స్నానం. సాయంకాలం హారతి.  రాజా ఆరోజు మధ్యాహ్నం హరిద్వార్ నుంచి బయలుదేరి డెహ్రాడూన్ వెళ్ళాడు .తనకి మరుసటి రోజు హైదరాబాద్ కి విమానం.  మేము ఆరోజు అక్కడే ఉండి మరల హరిద్వార్ లో రంగా స్నానం చేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకుని రావటానికి గంగా జలాన్ని తీసుకున్నాను అక్కడి నుంచి ఆరోజు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు అంటే 10/9/24 తారీకు ఉదయాన్నే ఆరు గంటలకి ఢిల్లీ బయలుదేరి వచ్చాం. ఢిల్లీలో 11:30 కల్లా ఢిల్లీ చేరాము మరలా తిరిగి మా ట్రైన్ 4 గంటలకు ఢిల్లీలోని స్టేషన్లో విశ్రాంతి తీసుకున్నాము. నాలుగంటలకి GT Express లో బయలుదేరి చీరాల ప్రయాణం. మధ్యలో ట్రైన్ డైవర్షన్ జరిగింది. వర్షం . ప వర్షాల కారణంచేత ట్రైను డైవర్ట్ అయింది నిన్న సరే ట్రైన్ ఒక మూడు గంటలు ఆలస్యంగా తిరిగి 11వ తారీకు అర్ధరాత్రి అంటే 12వ తారీకు తెల్లవారుజామున  మూడు గంటలకు  ఇంటికి వచ్చాం.ఆ సమయానికి  మూడున్నర అయింది పాపాయి రిషిత్ మామయ్య గారు ఉన్నారు. కాళ్ళు కడిగిహారతి ఇచ్చి  ఇంట్లో కి తీసుకువెళ్ళారు. కొంచం సేపు మీటింగ్ . హాయిగా ఇంట్లోనే నిద్రపోయాము ఎలా బయలుదేరాము అలా ఇంటికి చేరాం.  ప్రశాంతంగా యాత్ర అంతా జరిగింది దేవునిదయ.

యాత్ర కు బయలుదేరింది

29/8/24బాపట్ల నుండి గుంటూరు. గుంటూరు నుండి జన్మభూమి లో హైదరాబాద్.

30/8/24.హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ విమాన ప్రయాణం(మొదటి సారి)9 .00 to 11.30.

31/8/24 హరిద్వార్ నుండి జానకీ చట్టీ

1/9/24 జానకీ చట్టి  నుండి ధరళీ 

2/8/24 ధరళీ నుండి గంగోత్రి.

గంగోత్రి నుండి  ఘర్సాలి

3/9/24 ఘర్సాలి నుండి సర్సీ

4/9/24 సర్సీ నుండి సోన్ ప్రయాగ.కేదార్ నాధ్

5/9/24 కేదార్ నుండి సర్సి

6/9/24 సర్సీ నుండి బదరీనాద్

7/9/24 బదరీనాద్ నుండి నగరసు

8/9/24 నగరసు నుండి హరిద్వార్

9/9/24 హరిద్వార్

10/9/24 హరిద్వార్ నుండి ఢిల్లీ 

ఢిల్లీ నుండి చీరాల

11/9/24 ప్రయాణం

12/9/24 చీరాల నుండి బాపట్ల

ఇదీ ప్రయాణ ప్రణాళిక

గుర్తు గా ఉండటం కోసమే అక్షర బద్దం చేసాను

   శుభం





శుభం





Saturday, October 12, 2024

బదరీనాద్ ఆలయం


 బదరీనాద్ ఆలయం 



7/9/24 వినాయక చవితి


ఏడో తారీఖు ఉదయాన్నే బద్రీనాథుని దర్శనానికి వెళ్ళాము. మేఘాలు దట్టంగా ఉన్నాయి. చలి ఉంది .  అలకనంద పాత బ్రిడ్జి మీద వెళ్ళేటప్పుడు దగ్గరగా ఉన్న దారిని మూసి కొత్త వంతెన మీదుగా కొంత దూరంగా ఉన్నటువంటి దారిలో నుంచి తిరిగి వెళ్లాము. ఆ ప్రాంతం మీద అవగాహనతో  బ్రహ్మకపాలం వైపు వెళ్లేటువంటి బ్రిడ్జి మీద లోపలికి వెళ్లి అక్కడ నుంచి మధ్యలో ఉన్నటువంటి తప్తకుండం చూసి ఆది కేదారేశ్వరుని దర్శించుకుని  అక్కడి నుంచి పైన ఉన్నటువంటి ఆదిశంకరుల దర్శనం తరువాత బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి మరలా తిరిగి లోపల భోగ్ జరుగుతూ ఉండటం చేత  (బోగ్ అంటే అక్కడ జరిగే ఎటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవము) ఆ ఉత్సవంలో లోపల ప్రత్యేకంగా స్వామివారికి సేవ సమయంలో స్వామివారికి ప్రత్యేకంగా చేసేటువంటి అలంకారంతోపాటుగా అభిషేకం లాంటి జరుగుతుంది బయటనుంచి లోపల జరుగుతున్నటువంటి అభిషేకాన్ని అక్కడ జరుగుతున్నటువంటి అలంకారాలను చూసాము .అభిషేకం అయింది.  అంతరాలయ దర్శనం మొదలు అయింది.బదరీనాద్ దర్శనంపెద్దగా రద్దీ లేదు. మంచి దర్శనం జరిగింది.లోపల ఉన్న స్వామి ని అంతరాలయ  దేవతలను దర్శించుకున్నాం.

 ఈ రోజు  వినాయక చవితి . వినాయక చవితి రోజున స్వామి వారిదర్శనం. ప్రాకారంలో వినాయకుని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని అక్కడి నుంచి మరలా తిరిగి గుడి కి వెళ్ళాము. దర్శనం చాలా చక్కగాజరిగింది. లోపలికి వెళ్లి లోపల ఉన్నటువంటి స్వామి వారికి నమస్కరించి కొద్దిసేపు ఒక పక్కగా ఉండి చూసాము. అక్కడ నుండి ప్రసాదంగా స్వామివారికి ప్రసాదం గా ముగ్గురికి కూడా అక్కడ ఉన్నటువంటి పూజారి తులసి మాలలు ఇచ్చారు చాలా ఆనందంగా  తులసిమాలలను తీసుకొని  స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని తిరిగి మా ప్రసాదంలో కలుపుకుని అన్నిటిని తీసుకుని అక్కడి నుంచి ఆనందంగా బయటికి వచ్చాము. 10:30 వరకు అదే ప్రాంతంలో తిరుగుతూ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని  చూసాము తర్వాత అక్కడి నుంచి మొదటిసారిగా వచ్చినటువంటి రాజాతో కలసి అటు వైపు ఉన్నటువంటి బ్రహ్మ కపాలం వెళ్ళాము . ఇంతకు ముందే మేము అక్కడ చేసే పితృ దేవతాప్రక్రియలు అన్ని చేసి ఉండటం చేత ఇప్పుడు కేవలం బ్రహ్మకపాలన్ని చూసి దాన్ని స్పర్శించి తర్పణం వదిలి నమస్కారం చేసుకొని ఆతీరంలో ఉన్న అలకనంద  నదిలో దిగి ఆ తీర్థాన్ని  పుణ్య జలాన్ని తీసుకున్నా.  మరల స్వామి దర్శనాన్ని చేసుకున్నాం పునర్దర్శనంకలగాలని స్వామి ని కోరుకుని ఆనందం అక్కడి నుంచి బయలుదేరి అలకనంద ఝరిని దాటి కొన్ని పూజా వస్తువులు. కొని రూమ్ కి చేరుకున్నాము. 11 ప్రాంతానికి ఈ రూమ్ కి వచ్చిన అక్కడి నుంచి ఈ దగ్గరలో ఉన్నటువంటి మానా గ్రామానికి వెళ్దామని అడగటం జరిగింది. అయితే అప్పుడు వర్షం పడుతుంది.   వర్షం ఆగి తగ్గే వరకు ఆగి 12 గంటల వరకు ఉండి అక్కడి నుంచి బయలుదేరి నుంచి తిరిగి హరిద్వార్ కు ప్రయాణం

యాత్ర శుభప్రదం గా జరిగింది

 మధ్యలో చాలా ప్రాంతాలలో ఎక్కువగా కొండపడిపోయి కనిపిస్తుంది వర్షం పడటం చేత అది మరలా పడుతుందేమైనటువంటి ఒక ఆతృత డ్రైవర్ కలగడం అతను కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని నడుపుతున్న ా డు.విచిత్రంగావచ్చే సందర్భంలో ఒక మూడు నాలుగు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.అదృ ష్టవశాత్తు ఎక్కడా ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడలేదు కాకపోతే కొంచెం ఆలస్యం జరిగింది . *నగరసు* సాయంత్రం ఆరు గంటలకు చేరాం. చలి లేదు.  అక్కడ రాత్రి బస. భోజనం కూడా.


 

Friday, October 11, 2024

బద్రీనాథ్

6/9/24 బద్రీనాథ్

బహూని సంపత్తి తీర్థాని, దివి భూమౌ, రసాతలేచ I

బదరీయ సదృశ్యం, తీర్థం నభూతో నభవిష్యతిII










 సర్సి నుండి ఈరోజు ప్రయాణం  బద్రీనాథ్. ఇక్కడి నుంచి బద్రీనాథ్ దూరం 223 కిలోమీటర్లు దాదాపుగా ఒక ఎనిమిది గంటలు పడుతుంది. 

కేదార్నాథ్ 3583 మీటర్ల ఎత్తులో ఉంటే బద్రీనాథ్ 3,100 మీటర్ల ఎత్తులో ఎత్తులో ఉంది

 సర్సి .పొద్దున్నే 6 గంటలకు అలా లేచాను లేచినటువంటి వారము 07:00 కల్లా రెడీ కారుకి ఫోన్ చేసాము అతను 7:30 కల్లా వచ్చారు వర్షం కూడా లేదు కొంత హెలికాఫ్టర్ కూడా ఈరోజు బయలుదేరడానికి అనుకూలంగానే ఉంది అందరం కూడా రూమ్ ఖాళీ చేసి సబ్సిడీ నుంచి బయలుదేరి బద్రీనాథ్ కి వెళ్తూ ఉన్నాం బద్రీనాథ్కు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఒక హోటల్లో టిఫిన్ చేసి వెళ్దాం అనేటువంటి ఆలోచనలు బయలుదేరము

సర్సినుండి గుప్త కాశి గుప్త కాశీ నుంచి రుద్ర ప్రయాగ వరకు మంచి అద్భుతమైనటువంటి రోడ్డు ఉంది. గుప్తా కాశి మరియు ఆగస్త్యముని మధ్యలో నాలుగు లైన్లు దారి చాలా వేగంగా ప్రయాణం జరిగింది. అగస్త్యముని ఒక అద్భుతమైనటువంటి దేశం.ముని  పేరు మీద ఈ ప్రాంతం ఉంది. ఆయన తపస్సు చేసిన  ప్రాంతం. ఇక్కడ మనకు గంగా నది ఊరు మధ్యలో ప్రవహిస్తూ ఉంది ఒక గోడమీద చక్కనైనటువంటి అగస్త్యుడుయొక్క చిత్రం కూడా ఉంది. గుడి ఉంది.  రుద్రప్రయోగం వరకు ప్రయాణం ఇదంతా కొండ దిగటం ఈ ప్రయాణం చాలా ప్రశాంతంగా హాయిగా సాఫీగా జరిగింది అక్కడి నుంచి నంద ప్రయాగ దగ్గర రోడ్డు మూసివేశారు. అట్నుంచి ఈ ప్రయాణం జరగటం లేదు వేరే మార్గంలో మా  ప్రయాణం మొదలైంది.  గుప్తేశ్వర మీదుగా ప్రయాణం సాగింది చాలా ఎరుకైనటువంటి సన్నగా అయినటువంటి దారి మధ్యలో వర్షం కూడా పడింది అటు ఇటు రోడ్డుకి చీడ్ చెట్లు మాతో పాటుగా వస్తూనే ఉన్నాయి. చాలా ఇరుకైనటువంటి మార్గము రోడ్డు కూడా చాలా అస్సలు బాగోలేదు మధ్య మధ్యలో చాలా చోట్ల పడిపోయి ఉన్నాం. ఏదురు నుంచి మరొక కారు వస్తుంటే మనం వెనక్కి వెళ్లి వారికి దారి తీయాల్సినంత ఇరుకైనటువంటి ప్రాంతంరుద్రప్రయాగ దగ్గర నది ఒడ్డున టీ తాగాము. . ఇక్కడి నుండి కొండ ఎక్కాలి.


రుద్ర ప్రయాగం నుంచి నంద ప్రయాగం వైపు వెళ్లకుండా గోపేశ్వర్ మీదుగా మమ్మల్ని పిప్పిల్ కోట్ కు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికి తీసుకొని వెళ్లారు విరామం లేకుండా టిఫిన్ కోసం కూడా మధ్యలో ఎక్కడ ఆపలేదు. పిప్పిల్ కోట్ సురక్షిత ప్రాంతం ఇక్కడి నుండి  దారి బాగుంది అన్నాడు మా శర్మ డ్రైవర్.   అందమైనటువంటి పర్వతాలు.జాలువారె జలపాతాలు భాగీరదిలో కలుస్తున్నాయి.  ఇక్కడ కొండల మీద వ్యవసాయం కనిపించింది కొండలకు పచ్చల హారం గావరుసగా గట్ల కట్టి కమతాలలో వ్యవసాయం చేస్తున్నారు. వరి బాగా పండుతుంది పచ్చడైనటువంటి పొలం బంగారపు రంగులో  కంకులతోమెరిసిపోతూ ఉంది జలపాతాలకి లెక్కే లేదు నీటికి కొదవలేని కారణంగా కొండల మీద వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చాలా ఎక్కువైనటువంటి వ్యవసాయములు ఈ ప్రాంతంలో బాగా కనిపించాయి ఊర్లో మధ్యలో నుంచి వెళుతున్నటువంటి ప్రదేశం ఎత్తేనటువంటి కొండ ఎక్కటం మద్య మధ్యలో వర్షం పడుతుంది వర్షం మరలా ఎండ ఇలా ఈ వాతావరణంలో అక్కడ ప్రయాణం చేయడం జరిగింది మధ్యలో మేఘాలలో నుంచి కూడా.

 మేఘాలు దాటి ముందుకు వెళ్లడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం కాకపోతే ఇరుకైనటువంటి దారి.దారి తప్పామేమో అని గూగుల్ మ్యాప్ పెట్టారు. ఫుల్ సిగ్నల్. ఇక్కడ ఊరు బయట వ్యాయామం చేసుకునేందుకు పార్కు లో ఏర్పాట్లు కనిపంచాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చక్కటి ఏర్పాటు బాగుంది. చాలా గ్రామాల్లో ఇలా కనిపించింది. ఫోన్ సిగ్నల్ బాగుంది. అందరూ ఫోన్లు మాట్లాడుతూ నడుస్తున్నారు. బదరీనాద్ వరకూ మ్యాప్ చక్కగా పనిచేసింది.  టిఫిన్ చేసిన తర్వాత అక్కడిచి రెండున్నరకి  పిప్ల్కోట్  జోషిమఠ్ కు ప్రయాణం. దారి చాలా బాగుంది. విశాలమైన రోడ్డు అయినప్పటికీని మధ్య మధ్యలో రోడ్డు  అలకనంద నదిలోకి పడిపోవడం జరిగింది ఆప్రాంతం  ఇరుకుగా ఉంది చాలా ఎక్కువ చోట్ల ఇక్కడ రోడ్డు పడిపోయింది ఇక్కడి నుంచి ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోంది .గుప్త కాశీ నుండి రుద్ర ప్రయాగ వరకు మనము కొండ కిందకు దిగటం. అక్కడి నుండి బాగా ఎత్తు కు ప్రయాణం. జోషిమఠ్ నుంచి బదరీనాద్ వరకూ అధ్భుతంగా ఉంది ప్రయాణం. విశాలమైన దారి .పడినచోట ఇరుకు. కొండ అంచుల కిందనుంచి మలుపులు తిరుగుతూ ఉంది .పక్కనే అలనంద ప్రవాహం అగాధమంత లోతుగా. జాలువారె జలపాతం కొండమీద నుండి పడే నీటి కింద నుంచి వెళ్ళాలి. బలే ఉంటుంది ప్రయాణం భయం ఉండదు. ఉత్సాహం పెంచుతుంది. డ్రైవర్ మాత్రం మహా జాగ్రత్తగా గమనిస్తూ నడుపుతున్న ా డు. బద్రీనాథ్ ముందు పూర్తిగా పడిపోయిన ప్రాంతంలో నిదానంగా వెళ్ళాల్సివచ్చింది. అక్కడ రెండు రోజులు మరమ్మతులు జరిగాయన్నారు. .  ఆమలుపు తిరుగగనే అద్భుతమైనటువంటి   బద్రీనాథ్  పుణ్య క్షేత్రం  ఊరి మధ్యలో కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడి నుంచి జాగ్రత్తగా ఇంతకుముందు మేమున్నటువంటి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లాం. అంటే గుడికి దగ్గరగా రూమ్సుకున్నాము .బాగా చల్లగా ఉంది దిగే సమయానికి అందరికన్నా ముందు గా నే నాలుగు గంటలకు వచ్చాము ఇంకా ప్రయాణికులు యొక్క రద్దీ మొదలు లేదు నాలుగు గంటలకు దగ్గరలో ఉన్నటువంటి రూము నుంచి నేను ఒక్కడినే బద్రీనాథ్ ఆలయానికి బయలుదేరా. ఇంతకుముందు చూసిన ప్రాంతం మరలా గుర్తుంటుందా లేదా అనేటువంటి ఒక ఆలోచనతో అదే ప్రాంతంలో చూస్తూ  ఏవిధమైనటువంటి మార్పులు లేవు ఎవరిని అడక్కుండానే వెళ్లి అలకనంద తీరంచేరా. ఎదురు గా దివ్య ధామం. అధ్భుతంగా ఉంటుంది దృశ్యం. నేను నది కి ఎడమవైపు .మధ్యలో నది ఎదురు గా కుడి వైపు నారాయణ పర్వతం పె చూపుకు ఎదురు గా ఆలయం. మరెక్కడా ఈవిధమైన ఆలయబాహ్య కుడ్యం  కనిపించదు రంగు రంగు లతో మధ్యలో మరీ ఎత్తుగా ఉండని గోపురం .ఒక పెద్ద గంట ద మొట్లు ఎక్కుతూ గంట కిందుగా ఆలయంలోకి ప్రవేశం. గంట అంది అందని ఎత్తు. ఎగిరి కొట్టాలి. అందిందా ఠంగ్ అంటూ మోగిపోతుంది ఒక్కసారే.   కొత్తగా జరిగినటువంటి మార్పు రెండవదివంతెన కూడా వచ్చింది. జనాలు ఎక్కువగా లేని కారణం గా నేను మొదటి వంతెన బద్రీనాథ్ ఆలయానికి చేరుకున్నాను అలకనందనలు దాటి అక్కడ నుంచి ముందుగా తప్తకుండా  నికి వెళ్లి అక్కడ ఆ కాళ్లు కడుక్కుని పైకి బద్రీనాథ్ ఆలయం వెళ్ళా. రద్దీ లేదు స్వామివారి దర్శనానికి వెళ్లాను లోపల ఒక భోగ్  (విశేషమైనసేవ) విశేషమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది . ఆలయం బయట నుంచి ఒక మంచె మీద నుంచి స్వామివారిని దర్శించేటువంటి వరుస ఉంది స్వామివారి దర్శనం చేసుకున్నాను అద్భుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కనైనటువంటి నారాయణ యొక్క దర్శనం జరిగింది 

అక్కడి నుంచి కిందకు వచ్చి పక్కనే ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుని వెనక జరుగుతూ ఉన్నటువంటి సత్సంగంలో కూర్చుని జరుగుతున్నటువంటి బద్రీనాథ్ యొక్క వైశ్యాన్ని తెలుపుతూ ఉన్నటువంటి హిందీలో జరుగుతున్న ప్రసంగం అప్పుడే మరల స్వామి వారి యొక్క అంతరాలయ దర్శనం జరుగుతోంది.స్వామివారి దర్శనం చేసుకున్నాను బదరీనాథుని ప్రక్కనే నారద విగ్రహము, నర నారాయణుల విగ్రహాలు, కుబేరుని విగ్రహము, ఉద్దవ, గరుడ విగ్రహములు, సుదర్శనుల వారి విగ్రహములుదర్శనంచేసుకుని


 4 గంటల ప్రాంతంలో గుడికి వెళ్లి 4:30 దాకా గుడిలో కూర్చున్నాను మరలా ఆలయంలో అంతరాలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఆరు గంటలకు హారతి కార్యక్రమం మొదలవుతుంది అనేటువంటి విషయం తెలిసింది ఏమో వెంటనే తీసుకొని వస్తా నేను ఇద్దరం కలిసి ఉషా నేను ఇద్దరం కలిసి రూమ్ కి వచ్చాము రూమ్ నుంచి దేవాలయానికి బయలుదేరి వచ్చాము చాలా ఉత్సాహంగా బద్రీనాథ్ ఆలయానికి వచ్చే సమయానికి అప్పుడే భక్తులు రద్దీ కొంచెం పెరుగుతుంది అయినా మేము రెండో వంతెనమీద నుంచి గుడిలోకి వస్తూ  మధ్యలో ఉన్నటువంటి కేదారనాథ్ ఆలయాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి శంకరాచార్య ఆలయాన్ని చూసి గుడిలోకి ప్రవేశించాము మేము వెళ్లే సమయానికి హారతికి పెద్ద వరుస ఉంది మేం కూడా వరుసలోని హారతికి లోపలికి వెళ్ళాము అంతరాలయం కాకుండా బయట ఉన్నటువంటి ఆలయానికి బయట వైపు ఉన్నటువంటి ఒక చిన్న ఎత్తైనటువంటి మంచి మీదుగా స్వామిని చూసి కిందకు వెళ్లాలి హారతి జరుగుతోంది మేము వెళ్లే సమయానికి అదృష్టవశాత్తు హారతి దేవుడికి ఇచ్చేటువంటి సందర్భంలో ఆపారు అంటే హారతి చివరికి వచ్చింది హారతి అయిన దాకా ఒక ఐదు నిమిషాలు హారతి అంతా చూసి అక్కడ నుంచి మరల తిరిగి ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాము ఆ లక్ష్మీదేవి ఆలయానికి లోపల నుంచి హారతి తీసుకుని అమ్మవారికి ఇవ్వటం కోసం తీసుకున్న వచ్చారు అక్కడ హారతి తీసుకొని అక్కడి నుంచి వెన ఆలయమంతా భక్తులతో బాగా కోలాహలంగా ఉంది ఆలయం వెనుక భాగంలో చాలామంది భజన చేస్తున్నారు భక్తి తన్మయత్వంతో అద్భుతమైనటువంటి సాంప్రదాయాలు చాలా భజన జరుగుతోంది కొంచెం సేపు అక్కడే కూర్చుని భజన అయిన తర్వాత అక్కడే విష్ణు సహస్రనామ పారాయణ చేసింది విష్ణు సహస్రనామ పారాయణ తర్వాత అక్కడి నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి ఆంజనేయమూర్తిని ఆంజనేయ మూర్తి పక్కనే ఉన్నటువంటి వినాయక స్వామిని ఆ పక్కనే ఉన్నటువంటి బద్రీనాథ్ ఆలయ క్షేత్రపాలకుడు అయినటువంటి ఘంటా కరుణి ఆలయాన్ని చూసి అక్కడ నుంచి తిరిగి బద్రీనాథ్ ఆలయం ముందుకు వచ్చాము.

 బద్రీనాథ్ ఆలయం ముందు భక్తులది బాగా పెరిగింది అని చాలామంది చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఆలయం అంతా ఆలయం ముందు భాగం అంతా రెడీగా ఉంది. ఆలయం ముందు భాగంలో అప్పుడే లైట్లు వేయటం చేత ఆలయం అద్భుతంగా వెలిగిపోతోంది ఆలయాన్ని చూస్తూ అక్కడే కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఎదురుగా అలకనంద అనేది యొక్క సభలో వినిపిస్తూనే ఉన్నాయి తిరిగి అక్కడి నుంచి రూమ్ వైపుగా బయలుదేరి వెళ్ళాము రూముకి వెళ్తున్న సందర్భంలో అలకనంద నదిని దాటిన తరువాత అక్కడే గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో రుద్రాక్ష స్టోర్ కనిపించింది అక్కడ రుద్రాక్షలు రుద్రాక్ష మాలలు తీసుకుని అక్కడి నుంచి తిరిగి రూమ్ కి బయలుదేరాము ఆ రోజుకి భోజనం చేసేటువంటి ఆసక్తి లేకపోవడంతో అక్కడే బద్రీనాథ్లో లభించే అటువంటి అద్భుతమైనటువంటి రుజువుండేటువంటి పాలు ఉన్నాయి వాటిని తాగి అక్కడ నుంచి మేము చేరుకున్నాము మధ్యలో మధ్యలో పూజకు అవసరమైనటువంటి ఒక దావులను కూడా తీసుకున్నాను అక్కడి నుంచి తిరిగి రూమ్ కి వెళ్ళాము బాగా ఎక్కువైనటువంటి చలి పెరిగింది రాత్రి 8 గంటలకు ఉదృతంగా ఉంది దాదాపు పది సీడ్స్ లో మనకు మరలా తిరిగి స్వామివారి దర్శనానికి వెళ్దామని ఉద్దేశంతోనే రూమ్ కి వెళ్ళాను కానీ మరణం నుంచి బయటికి రాలేదు 8:30 ఆరోజు రాత్రి అక్కడే పడుకోవడం జరిగింది .

బధ్రీనాధ్ చామోళీ జిల్లాలో నగరపంచాయితీ. మరియు చార్ ధామ్ నాలుగింటిలో ద్వారక, పూరీ మరియు రామేశ్వరంలతో పాటునాలుగవది.

ఆదిశంకరులు భారతదేశములో  నాలుగు దిశలయందును నాలుగు పీఠములు స్థాపించారు. వాటి లో ఉత్తరాన బదరీనాద్   ఒకటి. జోషిమఠ్ లో శంకరాచార్య భఠం ఉంది. ఆరు నెలలు బదరీనాద్ లో మఠం ఉంటుంది. గుడి కి ఎదురు గా మఠం

బదరీ క్షేత్రానికి నాలుగు పేర్లు. అవి 1. కృతయుగములో  "ముక్తిపదము" , త్రే తాయుగమునందు "యోగసిద్ది" అని, 3. ద్వాపర యుగమున "త్రి విశాల్" అని, కలియుగమున "బదరికాశ్రమము" అని

బదరీనాధ్ నారాయణనీలకంఠ తదితర మహాపర్వతములకు ముఖద్వారము వంటిది. బదరీనాధ్ ఆలయము నగరము మధ్యభాగములో ముఖ్యఆకర్షణగా ఉంటుంది,బదరీనాథ్ క్షేత్రములో తప్త కుండము ఒడ్డున శివుడు ఆదికేదార్ శివలింగ రూపములో గుడి ఉంది. కొంత ముందుకు వెళితే ఆదిశంకరుల గుడి.

బ్రహ్మకపాల ఘాట్ బదరీనాధ్ ఆలయమునకు ఉత్తరముగా సుమారు 300 మీటర్ల దూరములో అలకనంద నదిఒడ్డుననున్నది. ఇచ్చటికి తేలికగా నడుచుకొని వెళ్లవచ్చును. బ్రహ్మకపాల్ ఘాట్ హిందువులకు అతి పవిత్రమైనస్థలము. ఇచట కల నారద, నరసింహ, వారాహ్, గరుఢ మరియు మార్కండేయ పేరులతో అయిదు గండశిలలకు ప్రపంచవ్యాప్తముగా ప్రాధాయతఉన్నది. ఇచటగల నల్లటిరాయి బ్రహ్మదేమునితలగా భావించబడుచున్నది.

సరస్వతీ నది ఇక్కడి కి సమీపంలో మానా గ్రామంలో కనిపిస్తుంది. కేవలం 300మీటర్ల ప్రవహించి అలకనంద లో కలుస్తుంది. ఇక్కడ మాత్రమే సరస్వతీ నది చూడగలం. చాలా ఒరవడి గా దుముకుతుంది.

మానా గ్రామము, వసుధారా జలపాతం, నరనారాయణుల ఆలయము, సూర్యకుండం, గణేశ్ గుహ, వ్యాసగుహ భీమాపూల్


బద్రీనాథ్ ఒక అద్భుతమైనటువంటి గుడి అలకనంద నదికి పక్కనే ఉంటుంది చిన్న కొండమీద మనకు బయట అద్భుతమైనటువంటి ఆలయ ముఖ ద్వారం కనిపిస్తూ ఉంటుంది ఒక పెద్ద గంట కింద నుంచి రెండు విభాగాలుగా మనకు ఆలయం కనిపిస్తూ ఉంటుంది నారాయణ పర్వతం మీద ఈ యొక్క ఆలయం కనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఆలయం నలగనందనలు అడిగి ఎడమవైపున ఉన్నటువంటి లోయ మొత్తము దుకాణాలు ధర్మశాలలు లాడ్జీలతో మన ప్రయాణం చేయడానికి అనుకూగా అని ప్రయాణం చేసినటువంటి వారు వచ్చి ఈ విశ్రమించేటటువంటి ప్రాంతం దారి నుంచి ఎలక నిండా నదిని దాటి కుడివైపునటువంటి చిన్న కొండమీదకి వెళితే నారాయణ పర్వతం మీదకు వెళ్తే మనకు అక్కడ ముందు వైపు కూడా బద్రీనాథ్లో అద్భుతమైనటువంటి బద్రీనాథ్ యొక్క ఆలయ దర్శన కనిపిస్తూ ఉంటుంది దానికి ముందు వైపుగా తప్పకుండా అంటే వేడి నీళ్లతో కూడినటువంటి గుండాలు ఉంటాయి వాటిలో స్నానం చేయవచ్చు అక్కడినుంచి ఎక్కడి నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి కేదారేశ్వర నీ గుడి మీదుగా బద్రీనాథ్ ఆలయంలోనికి వెళ్లవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఆలయంలో మనకు విష్ణుమూర్తి విగ్రహం పెనమపత్ర నారాయణని ఇద్దరు కూర్చుని ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి బద్రీనాథ్ కి కుడివైపున మనకు కుబేర మూర్తి విగ్రహం ఉంటుంది గణేష్ విగ్రహం ఉన్న ఐదు విగ్రహాలు లోపల ఈ సముదాయం మొత్తానికి పంచాయతీని పూజారి చెప్పారు స్వామివారి విగ్రహానికి వెనుకవైపుగా అంటే లక్ష్మీదేవి కుడివైపు భుజానికి విగ్రహాలు కూడా కనిపిస్తున్నది మహాభారత యుద్ధంలో తరువాత ఉద్దోడిని పిలిచి తాతని బెదిరి వెళ్ళమని స్వామి చెప్పినటువంటి కథ మనకు గుర్తుంటుంది నేల మీద పాలకులు కూడా ఉంటాయి పక్కనే నారద మహర్షి విగ్రహాలు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ఈ ఆలయాన్ని ఆలయ సందర్శన చాలా బాగుంటుంది ఆలయం పక్కనే మనకు లక్ష్మీదేవి యొక్క ఒక మందిరం చిన్న మందిరం ఉంది దాని పక్కన భోగమండపని స్వామివారికి దీనినే బోగు మండపని అంటారు ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు తయారు చేసేసారు నర నారాయణరావు తపస్సు చేసే ప్రాంతంలో లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి మొదటి రూపంలో ఆయనకు నిడని కల్పించడమే గాక దారుణ స్వయంగా వంట చేసే ఆయనకు భోజనం పెట్టేది ఆదోని ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి తయారు చేసిన వంటకాన్ని ప్రకటించబడుతూ ఉంటాయి ఆన్లైన్లో అక్కడ మధ్యాహ్నం సమయంలో ఒక ప్రసాదం కూడా ఇస్తారు ఇంతకుముందు వచ్చిన సందర్భంలో మేము ఇక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈ రోజు సాయంకాలం అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకున్నాము. ఆలయం పక్క నుంచి ఏ పక్కన ఆంజనేయస్వామి విగ్రహం ఆలయం వెనుక భాగంలో ఆ పక్కనే ఉన్నటువంటి వినాయకుని దర్శించి కంఠాకరుడు అనేటువంటి మన ఆలయ సేవకులుగా చెప్పినటువంటి ఘంటా కరుణలు కూడా చూసాము గంటా ఆలయం చూసిన తర్వాత అక్కడ నుంచి మనం తిరిగి బయటికి వస్తాం

Wednesday, October 9, 2024

కేదారనాథ ఆలయం












 కేదారేశ్వరుని దర్శనం


కేదారేశ్వరునిఆలయం కనిపించే ముందు వెనుక మంచుతో నిండి న పర్వ తశిఖరాల వరుస దర్శనం. ఆతర్వాత ఆలయదర్శ నం. మెట్లు ఎక్కుతూ ఆలయందగ్గరకు చేరుకోవాలి.ఆలయ ప్రాంగణంముందు ఒక పెద్ద గంట దానినిదాటి ముందుకు వెళితే కొద్ది దూరంలో ఆలయం. పెద్ద నంది విగ్రహం..

మంచు పర్వ తాలు ప్ర కృతి సౌందర్యం నిండిఉన్నా కేదార్నాధ్ ఆలయం చూపు పక్క కు తిప్పనివ్వదు .అంత  అద్భుతమైనటువంటి ఆలయం. ఆలయ ద్వారం మనోహరంగా అలంకరించి ఉంది.ద్వారా నికి ఇరువైపులా ద్వారపాలకులు. వినాయకుడు విగ్రహం ఆలయంలోకి ప్రవేశించగానే ఒక  మండపం అందులో ఒక చిన్న నంది విగ్రహం దాటి లోపలికి వెడితే చిన్న మండువా దాటగనే సరిగ్గా  గర్భగృహంలోకి వెళ్తాం గర్భగృహం చిన్నది ఆధునికంగా  బంగారంతో తాపడం చేశారు చాలా అద్భుతంగా మెరుస్తూ ఉంది. గోడల లోపల  దేవతామూర్తులు విగ్రహాలు నాలుగు గోడలో ఉన్నాయి వాటిలో  శ్రీకృష్ణుని గ్రహం ధర్మరాజు, భీముడు,నరుడు విగ్రహాలు ద్రౌపది విగ్రహం ఉన్నాయి.  నారాయణ మూర్తి విగ్రహం ఉంది. కేదార్నాథ్ ఆలయంలో లోపల ఉన్నటువంటి ఈ విగ్రహాలు ఇప్పుడు కొత్తగా బంగారు తాపడంతో  మెరిసిపోతున్నాయి .ఉదయం పూట  అభిషేకసమయం గనుక  కేదారేశ్వరుని దర్శించవచ్చు  .మూర్తి  రూపం  నంది మూపురం లాగా   విశాలంగా  ఉంటుంది పైకి మొనతేలిన  భాగాలు   కనిపిస్థాయి. అభిషేకం చేస్తన్నప్పుడు చందనాది ద్రవ్యాలు సామిపై రాస్తూ అభిషేకం చేయిస్తున్నారు.నాలుగు వైపులా భక్తులతో అభిషేకం జరుగుతుంంది. దాదాపు 16 మంది అభిషేకం చేసుకోవచ్చు. నాలుగు వైపులనుండి. 

ఉదయం అభిషేకం తరువాత అలంకారం చేస్తారు. చూడటానికి రెండు కళ్ళుచాలవు. అంత అధ్భుతంగా ఉంది అలంకారం. అభిషేకం తరువాత అంతరాలయ దర్శనం ఉండదు. గర్బగృహం బైట వాకిలి నుండి స్వామి దర్శనం ఉంటుంది. ఎక్కడనుండి చూసి నా ఆదర్శనభాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతమే.


యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ॥ 



 ఉదయాన్నే  గంటలకు లేచాం.5.30  అభిషేకం కు వెళదాం అని.రూమ్ లో నీళ్లు రావటం లేదు .చలి బాగా ఉంది టెంపరేచర్ 8% .కిందకు వెళ్లి నీరు తెచ్చుకోవాలి. చల్లటి నీళ్లు తప్పని పరిస్థితి కిందకి వెళ్లి బకెట్ తో నీళ్లు తెచ్చుకుని  స్నానం చేసి అభిషేకానికి బయలుదేరాం 5.30am

 అప్పటికి నితిన్ గారు రెండుసార్లు ఫోన్ చేశారు 6 లోపు రమ్మని ఐదు ముప్పావు కల్లా బయలుదేరి స్వామివారి అభిషేకానికి అవసరమైనటువంటి అభిషేక సామగ్రి తీసుకొని ఒక రుద్రాక్ష మాలను కూడా తీసుకొని నితిన్ గారిని కలిసాము అతను స్వామి వారి యొక్క దర్శనానికి లోపలికి తీసుకుని వెళ్లి లోపల ఉన్నటువంటి ఒక పండిట్ కి మమ్మల్ని అప్పగించారు.  స్వామివారి ముందు సంకల్పసహితం గా గోత్రనామాలతో లఘు పూర్వకంగా శ్రీ రుద్ర అభిషేకాన్ని చేశారు .మేము తీసుకొని వెళ్ళినటువంటి నెయ్యిని మరియు గంధాన్ని స్వామివారి మీద అభిషేకం చేసి తరువాత  గంగాజలంతో అభిషేకం   చేసారు. నేను వారి తో గొంతు కలిపాను. ప్రశంసాపూర్వకంగా పఠనం విని నైవేద్యం పెట్టి మాకు ప్రసాదాన్ని ఇచ్చి స్వామివారి యొక్క శేష వస్త్రాన్ని కూడా బహుకరించారు.రుద్రాక్ష మాల రాజామొడలో వేసారు. స్వామిదర్శనం,అభిషేకం అధ్భుతం. భక్తుల రద్దీ పెరిగింది. మేము ప్రదక్షిణ చేస్తూ ఒకపక్క మూల  నుంచొనిశ్రీ రుద్రాన్ని పఠీస్తూ అక్కడే  స్వామివారి దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నాను .నా పక్కనే ఉషారాజ కూడా ఉన్నారు దాదాపుగా ఒక 45 నిమిషాల సేపు మేము గుడి లో ఉన్నాము.ఉష రాజా ఇద్దరు స్వామివారి మరల ప్రదక్షిణానికి వెళ్లారు నేను మాత్రము శ్రీ రుద్ర పారాయణ నమక చమకం పురుషసూక్తం  శ్రీ సూక్తం పఠించి తర్వాత మరొకసారి తృప్తిగా స్వామికి ప్రదక్షిణ చేసాను.

అనాయాసేన మరణం - వినాదైన్యేన జీవనం

దేహాంతే తవ సాయుజ్యం  - దేహిమే  పరమేశ్వరా!
అని ప్రార్దించి గుడిబయటికి వచ్చాను. బయట ఉన్నటువంటి ఉషారాజ ఎదురుచూస్తున్నారు. ఆలయం పక్కనే ఉన్నఒక శివాలయానికి వెళ్లి ఆ శివాలయంలో మరలా  స్వామివారికి అభిషేకాన్ని చేసాము తృప్తిగా.   కేదారనాథ గుడికి వెనకవైపున ఉన్నటువంటి మంచుపర్వతాలు వెలుగులో మనోహరంగా కనిపించాయి.చూస్తుండగనే కొద్ది మబ్బులు  తొలగి మంచు పర్వతశిఖరాలు కనిపించాయి  కొంచెంసేపు ఫోటో తీసుకుంటూ ఉంటున్నాము తర్వాత మరల ఒక పావుగంటలో మబ్బులు మరలా వచ్చాయి .చలి కూడా కొంచెం పెరిగింది మేము అక్కడి నుంచి బయలుదేరి వెనక ఉన్నటువంటి కేదారేశ్వర గుడికి వెనుక ఉన్నటువంటి అమర జలాలను ఒక బాటిల్ లో తీసుకొని అక్కడి నుంచి మేము రూముకు చేరుకున్నాము.ఉష రాజా రూమ్ కి వెళ్ళారు. నేను సంధ్యావందనంచేసుకుని  మరల గుడి లో కి వెళ్ళాను. స్వామి ప్రసాదంగా బ్రహ్మ కమలం ఇచ్చారు.  రూమ్ కి వెళ్లాను. మరలా తిరిగి రావటానికి సంసిద్ధంగా మార్పులు చేసుకుని బయలుదేరి బయటికి వచ్చాము. సమయం 8.30. ముగ్గురము గుడి ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని చూస్తూ ఉన్నాము ఇంతలో పైన ఉన్నటువంటి భైరవనాద్ దర్శించాలని అనిపించింది. పోయిన సారి కూడా చూడలేదు. ఆయన క్షేత్ర పాలకుడు. నేను రాజా  2 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి భైరవనాధ్ ఆలయానికి కి వెళ్ళాము ఒక మూడు నాలుగు సార్లు ఆగుతూ. కొంత నిదానంగా ఒక పావుగంట పట్టింది. అందమైనటువంటి  కేదార్ నాథ్  పూర్తిగా అక్కడి నుండి కనిపిస్తుంది. ఆ ప్రాంతం మొత్తాన్ని మనం పైనుంచి చూడవచ్చు. అక్కడిదాకా వెళ్లి పైన ఉన్నటువంటి భైరవనాధుని దర్శించుకుని అతని యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకటాక్షాల కోసం పునర్దర్శనంకలగాలని కోరుకుని కకేదారినాదిని వెనక్కి వచ్చాము.9.00am

 కిందనే మాకోసం ఉష ఎదురు చూస్తుంది.  ఉదయం పూట బాగా ఎక్కువైనటువంటి భక్తుల రద్దీ ఉంది .కేదారేశ్వరుని గుడి వెనుక  ప్రాంతంలో ఉన్న శంకరాచార్య సమాధి ప్రాంతానికి వెళ్ళాము.పూర్వం ఒక మందిరంలో ఉండేది .ఇప్పుడు బహిరంగ ప్రాంతంలో చూట్టూ శ్రీ చక్ర ఆకృతి మధ్య లో కూర్చుని ఉన్న శంకచార్య విగ్రహం అధ్భుతంగా ఉంది. ఇటీవల ప్రతి ష్ఠాపన.అధ్భుతమైన కళతో ఉంది. అక్కడ పండిట్ ఉన్నారు. విశేషాలు వివరించి పూజ చేసారు. దర్శనం చేసుకుని తిరిగి గుడి వైపు వచ్చాము.ఒకసాధువు తెలుగు లో పలఖరించారు. గోదావరి తీరవాసి. గుడి దగ్గర వెనుకవైపు భీమ శిల (వరద సమయంలో గూడివెనుకువైపుకు కొట్టుకువఛ్చి గుడి కి రక్షణ గా ఉన్న పెద్దశిల)చూసి రూమ్ కిచేరాము.టిఫిన్ చేసి అక్కడి నుంచి తిరిగి కిందికి వెళ్ళటానికి బయలుదేరుతూ తగినటువంటి ప్రసాదాలు తీసుకుని అక్కడి నుంచి పదిన్నర ప్రాంతంలో రూముని ఖాళీ చేసి కిందకి బయలుదేరాము  చలి కొంచెం అనిపిస్తూనే ఉంది మరొకసారి దర్శనం చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేసాము కానీ ఎక్కువైనటువంటి భక్తుల రద్దీ ఉండడంతో బయటనుండి నమస్కరించి బయలు దేరాము. పునర్దర్శనంకలగాలని ఆకాంక్షతో.  చుట్టుపక్కల మేఘాలు కొమ్ముకొని ఉన్నాయి వర్షం పడుతుంది రెండు కిలోమీటర్ల నడక. గుర్రాలాగే ప్రదేశం వరకు నడుచుకుంటూ 11:30 కి ఆ ప్రాంతానికి చేరాము .అక్కడ గుర్రాన్ని మాట్లాడుకోవడం కోసం టీ తాగుతూ కూర్చున్నాము.తప్పనిసరి గా ప్రస్తావించవలసిన సంఘటన జరిగింది.  కింద నుంచి అప్పుడే పైకి వచ్చినటువంటి ఒక తెలుగువారు కలిసారు వారు రెండవ తారీకు వచ్చారు సర్ సి నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి రావటం కోసం ప్రయత్నించిన వారికి రెండు మూడు నా తారీకులలో హెలికాఫ్టర్ క్యాన్సల్ అవ్వడంతో వారు ఈరోజు5/9/24 ఉదయాన్నే గుర్రం మీద  పైకి వచ్చారు. వారు పైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటన్నప్పుడు మీరు మరలా ఎప్పుడు వెళ్తారు అని అడిగితే వారు తిరిగి ఈరోజే వెళ్లాలి అన్నారు. అలా అయితే త్వరగా వెళ్ళండి 12:00 వరకు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు అంతరాలయంలో స్వామివారి దర్శించుకోవచ్చు అంటే వారు వెనుక వచ్చేవారికి ఆ మాట చెప్పి త్వర త్వరగా వారిని అక్కడి నుంచి బయలుదేరి గుడి  వెళ్ళిపోయారు.  12 గంటలకి  కిందకి రావడానికి గుర్రాన్ని మాట్లాడుకున్నాము ఒక్కొక్కరికి 2300 ముగ్గురు గుర్రాన్ని మాట్లాడుకుని అక్కడి నుంచి గౌరీకుండ్ బయలుదేరాము.గుర్రాలు గౌరీకుండ్ వరకే.

మరలా తిరిగి 12.00 గంటలకి బయలుదేరి 1 .30 కల్లా భీమబలి అంటే కేదార్నాథ్ గుడి నుంచి తొమ్మిదిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి భీమబలికి చేరుకున్నాం. మధ్యలో వచ్చేటప్పుడు వర్షం పడింది రోడ్డు కూడా బాగా మధ్యమధ్యలోపడిపోయింది. పడిపోయినటువంటి ప్రాంతం మరీ ఎక్కువగా ఉంది.కిందకి దిగేటప్పుడు గుర్రం పై జాగ్రత్తగా ఉండాలి. ముందు కు దిగడం వల్ల ఎక్కువ ఒత్తిడి. గుర్రం మీద బలం పడకుండా వెనక్కి వెళ్ళి జాగ్రత్త కూర్చోవాలి. బాగావాలుగా ఉన్నచోట్ల దిగి నడిచాము.కేదార్ నుండి నాలుగు కి.మి తరువాత పూర్తిగా రోడ్డు దిగి పోయింది.  జంగిల్ చట్టీ  దగ్గర. రాళ్ళు పేర్చి తాత్కాలికంగా నిర్మాణం జరిగింది. జాగ్రత్తగా నడవాలి. వచ్చేటప్పుడు మధ్యలో ఒక మనిషి పడిపోతూ ఉంటే బయటికి లాగడం కూడా చూసాం. ఆ దేవుడిదేవుడు దయ.ఆమె కు దెబ్బలేంతగలలేదు కానీ  పునర్జన్మే.ఆమె కూడా చాలా సురక్షితంగా దాంట్లో నుంచి బయటపడింది.చిన్న దెబ్బకూడాలేదు. చాలా జాగ్రత్తగా ఆ ప్రాంతమంతా నడుచుకుంటూ వచ్చాము. తర్వాత దిగేటువంటి ప్రదేశం కొంత ఉంటే అది కూడా నడిచిన దాదాపుగా  రెండు కిలోమీటర్లు నడిచిన అక్కడి నుంచి మరల గుర్రాల మీదకి వచ్చాము. వర్షం పడింది వర్షంలో తడిసి భీమ బలి చేరేటువంటి సమయానికి 1:30 అయింది. ఒక అరగంట సేపు ఒక్కడే కూర్చుని టీ తాగాము గుర్రాల వాళ్ళు కూడా టిఫిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి మరల బయలుదేరి కిందకి వచ్చాము .వర్షంపడుతూనే ఉంది.గౌరీకుండ్ చేరేటువంటి సమయానికి టైం మూడు గంటలు అయింది . అందరినీ దించే ప్రాంతం కన్నా మమ్మల్ని మరొక  కిలోమీటర్ దూరం ఎక్కువ తీసుకుని వచ్చిదించారు. అక్కడినుంచి తిరిగి సోన్ ప్రయాగ వెల్ల డానికి అవసరమైనటువంటి కార్ దగ్గరికి వెళ్ళాము.

ఉష ఎక్కిన గుర్రం పేరు పూజ

 కార్లు తక్కువ ఉంటే చేత జనాలు ఎక్కువైనటువంటి కారణం  కారులో 20 మంది కింద కూర్చున్నారు జీబులో నేను మాత్రం జీవు పైకి కూర్చుని అక్కడినుంచి సోన్ ప్రయాగ వరకు వెళ్ళాం .ప్రయాగ ముందు పడిపోయినటువంటి మార్గానికి ముందు దిగి అక్కడి నుంచి ఆ ఒక కిలోమీటర్ నడిచివెళ్ళాము.  మా కారు కోసం ఫోన్ చేస్తే మా శర్మ రాంపూర్ దగ్గర రోడ్డు బాగాలేక ఆగిపోయింది వస్తున్నాను అన్నారు మమ్మల్ని రాంపూర్ వరకు రమన్నారు మేము సోన్ ప్రయాగ్ నుంచి ముందుకు నడుచుకుంటూ రాంపూర్ అంటే దాదాపుగా రెండు కిలోమీటర్లు మొత్తంగా నడుచుకుంటూ వెళ్ళాము .నేను రాంపూర్ వెళ్లి ఫోన్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలకి కారు వచ్చింది అక్కడి నుంచి అందరం కలిసి ఈ కారులో సర్ సి కి (మేము బయలుదేరినటువంటి ప్రాంతానికి) ఐదు గంటలకల్లా చేరుకున్నాం. కాకపోతే ఆరోజు రాత్రి అక్కడే ఉండి విశ్రాంతి తీసుకున్నాం. కేదారేశ్వరుని దర్శనం ఒక అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. రాత్రి అంతా కేదార్ లో ఉన్న అనుభూతి. 6/9/24 ఉదయాన్నే7.30 అక్కడి నుంచి బయలుదేరి బద్రీనాథ్ వెళ్దామనేటువంటి ఆలోచనతో ఆరోజు రాత్రికి అక్కడే ఆ రూంలోని పడుకున్నాం అక్కడ భోజనం చేసి ఈ రాత్రి 7:30 కల్లా పడుకున్నాము రాత్రి మంచి వర్షం పడుతోంది మా పక్కనే ఉన్నటువంటి యాత్రికులు కూడా మరుసటి రోజు ఉదయాన్నే కేదారి్ వెళ్ళటానికి హెలికాఫ్టర్ బయలుదేరుతుందా లేదా అనేటువంటి ఒక ఆదుర్దాలో ఉండటం గమనించా.

కేదార్ నాద్ ఎత్తు3583 మీ టర్లు .హిమాలయ పర్వత ప్రాంతం. ఆరునెలు మంచుతో కప్ఫబడి ఉంటుంది.

  క్షేత్రాలలో దర్శించడానికి కష్టతరమైనది కేదార్ నాథ్.సంకల్పం తోబాటు శివుని అనుమతి ఉంటేనే దర్శనభాగ్యం కలుగుతుంది.

జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి|

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥







 

Tuesday, October 8, 2024

కేదార్ నాథ్ kedarnath

 4/9/24 కేదార్ నాథ్












మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః ।

సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥ 

ఉదయాన్నే లేచి ఏడు గంటలకు సోన్ ప్రయాగకు బయలుదేరి వెళ్లాం అక్కడ పెద్ద క్యూ ఉంది ఉదయాన్నే ఐదు నుంచి వరుసలో నుంచుని ఉన్నారు  ముందు రెండు మూడు  తారీకులలో యాత్రను ఆపివేశారు అందుకని నాలుగవ తారీకు చాలామంది వరుసలో నుంచుని ఉన్నారు మేము వెళ్లి వరుసలోనుంచున్నాము. రాజా యాత్రకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ను చెక్ చేయటానికి వెళ్ళాడు. అక్కడే ఒక గుర్రం వాడిని కూడా మాట్లాడం గుర్రానికి మూడు వేల రెండ వందల రూపాయలు ముగ్గురికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత గుర్రాలకి కూడా డబ్బులు ఆన్లైన్లో కట్టి వాళ్ల దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకున్నాం ఉష రాజా  ప్రయాగలో ఇడ్లీ తిన్నారు .నేను దోశ తిన్నాను ఎనిమిదిన్నరకి సోన్ ప్రయాగ నుండినడిచి వెళ్ళటం మొదలుపెట్టాం.సోన్ ప్రయాగనుండి 1/2 కిలోమీటర్ నడీస్తే మందాకినీ నది దాని మీద వంతెన దాటాక పూర్తిగా పడిపోయిన దారి తాత్కాలిక మరమ్మతులు చేసారు. 300మీటర్లు. రాళ్ళుపడి ఉన్నాయి. వాటిని దాటి ముందు కు వెళ్ళాము.  పెద్దలు కొంతమంది అక్కడ ఆగారు ముందు కు వెళ్ళ. లేక.గుర్రాలకోసం. రద్దీ ఎక్కువగా ఉంది అందుకే వారిని కూర్చోబెట్టారు.కేదార్ కు   మొత్తం 22 కిలోమీటర్లు దూరం సోన్యాగం నుంచి నడుస్తూ ముందుకు వెళితే ముందుగా ఒక బ్రిడ్జి వచ్చింది దాని మీద నుంచి వరుసలో పంపిస్తున్నారు గుర్రాలు పడిపోయినటువంటి సోనుప్రియా గ బ్రిడ్జి అవతల ఉన్నటువంటి ప్రదేశం నుంచి బయలుదేరుతాయి మొత్తం ఒక కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి అక్కడ నుంచి ఒక 10 నిమిషాల వెయిటింగ్ అనంతరం అక్కడ గుర్రాల ఎక్కాము 9 గంటలకు సోన్ ప్రయాగ నుంచి గౌరీకుండ్  ప్రాంతం ఆరు కిలోమీటర్లు ఉంది. ఈ ఆరు కిలోమీటర్లు గుర్రం మీద  మార్గము బాగున్నప్పుడు అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి కొన్ని కార్లుద్వారా గౌరీకుండ్ చేరవచ్చు. ఇప్పుడు కూడా పడిపోయిన  కొండ కుఅటువైపుఉన్న కార్లు  అక్కడే తిరుగుతూ జనాలని  అటు గౌరీకుండ్ వరకు చేరుస్తూ ఉన్నాయి. మేము గౌరీకుండ్ వరకు గుర్రం మీద వెళ్ళాము. అక్కడి నుంచి కేదార్నాథ్ 16 కిలోమీటర్ల దూరం ప్రయాణము 9:30 కి కొండమీదికి ప్దరయాణంలైంది ఇంతకుముందు కేదార్ వెళ్ళాము. 12సంవత్సరాల క్రితం. అప్పుడు పిల్లలు అమ్మ అత్తయ్య గారు డోలీఎక్కారు.నేను ఉష గుర్రాలు. మేము గుర్రాల మీద ప్రయాణం ఉండటం వల్ల అలవాటు అయినటువంటి ఒక ధైర్యం మాలో ఉంది. కొండమీదకి గుర్రాలు ఎక్కుతూ ఉన్నాయి .ఉష గుర్రం సోనాక్షి.నాగుర్రం రాజా గుర్రం వరుసగా బయలుదేరాయి ముందు ఉష తర్వాత రాజా అది తర్వాత నేను వరుసగా కొండమీదికి వెళ్తున్నాము దాదాపుగా ఒక రెండు మూడు వేల మంది జనాలు ఒకేసారి బయలుదేరి వెళ్తున్నాం. కొంత ఎదురు వచ్చేవాళ్లు ఎవరూ లేరు చాలాసేపు పదిన్నర వరకు దాదాపుగా మేము వెళుతూనే ఉన్నాము.ఈ దారంతా పాత దారే..వర్షం మొదలైంది.6.30 కిమీ భీమ బలి అనే ప్రాంతం చేరుకున్నాం .మధ్యలో వర్షం పడుతోంది ఈ వర్షం పడినప్పుడు అక్కడ వాడేటువంటి రైన్ కోట్ వేసుకొని జాగ్రత్తగా భీమ బలి అంటే 6:30 కి.మీ దూరం వరకు చక్కగా ప్రయాణం సాగింది .పక్కనే మందాకినీ పరవళ్లు. కొండవాలులో ప్రయాణం పైనుంచి పడే నీరు. దారి కూడా సన్ననిదారి.భీమబలి కి ముందు కొండమారాము. నది దాటి కొత్త దారి లో కి వెళ్ళాము. అవతల కొండ పాతదారి కనపడుతుంది. అక్కడ టీ తాగి అక్కడ నుంచి బయలుదేరాం.   .ఎదురు గా పాత దారి పడిపొయిన ప్రాంతం పడిపోయినటువంటి దారి. అనిపిస్తుంది ఇప్పుడు అక్కడి నుంచి కొండ మారి కొత్తగా వేసినటువంటి మార్గంలోకి ప్రయాణం సాగింది దాదాపుగా ఒక నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మమ్మల్ని గుర్రాల మీద నుంచి దిగి నడవాలి అని చెప్పారు.   జంగిల్చట్టీ దగ్గర దిగి.  నడిచాము. దారి పూర్తిగా పడింది. దాని వల్లే యాత్ర ఆగిందని చెప్పారు. మార్గము గత రెండు రోజుల నుంచి పూర్తిగా మూసుకొని పోయి ఉండటం వల్ల మార్గము అంతా పడిపోయి ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా ఆ మార్గాన్ని రాళ్లతో నిర్మిస్తున్నారు.  వర్షం పడుతూ ఉండటంతో కొంత మార్గమంతా జారుడుగా ఉంది రాళ్లమీద జాగ్రత్తగా నడవాలి. ఒకరినొకరం పట్టుకుని నడిచాము .రాళ్ళు పేరు స్తున్నారు. పనిజరుగుతుందీ.గుర్రం ఎక్కి అక్కడి నుంచి ముందుకు వెళ్లాము మరల అక్కడ దారి లేదు గుర్రాలు మీద నిదానంగా ప్రయాణం సాగించాం .ఎదురు గుర్లారాలు రావడం మొదలు అయింది.11.30 మేఘాలు వచ్చాయి. చలి.  వర్షం పడింది వర్షంతో పాటు చక్కనైనటువంటి మేఘాలు మా చుట్టుపక్కల మా మీద నుంచి మేఘాలు వెళ్ళటం కనిపిస్తూనే ఉంది చక్కనైనటువంటి ప్రకృతి ఆస్వాదిస్తూ పైనుంచి దుముకుతు ఉన్నటువంటి సెలయేర్లను చూస్తూ గుర్రం జారుతుందేమో అనేభయం  జారిపడినటువంటి మట్టి పెల్లలు వాటి మీద జాగ్రత్తగా వెళుతూ ఉన్నటువంటి గుర్రాలను చూస్తూ తగిన జాగ్రత్తలతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగము .మరల మరొకచోట ఇలానే పడిపోవడం జరిగింది.నడిచి వచ్చే భక్తులు పోలీ.డోలీ అంతా హడావుడి గా ఉంది. అందరూ ఒకటే నామస్మరణ. కేదార్  బాబికీ జై..పక్కనే ఉన్న దుకాణాలు భక్తిపాటలు12.00 కొండపడిపోయినటువంటి ప్రాంతంలోదిగి మరలా తిరిగి అక్కడ నుంచి ఈ నడుచుకుంటూ కొంతదూరం వెళ్లి అక్కడి నుంచిగుర్రాలు ఎక్కాము. ఎదురు గుర్రాల రాక పెరిగింది. ఎలా వచ్చామోతెలియకుండా పైకి కేదార్నాథ్లో ఉన్నటువంటి గుర్రాలు ఆగే ప్రదేశానికి మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకున్నాం.వాతావరణం తేలికగా ఉంది. ఎండ. చలి ఉంది అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు కేదార్నాథ్ గుడి కిహకి నడిచి వెళ్లాలి . గుర్రం దిగగానే ఒక గగుర్పాటు. ఆనందం ఎగిరెగిరి పడింది. ఎంత అదృష్టం. రెండో సారి కేదారేశ్వరుని దర్శనం. అదృష్టం ఏవిఘ్నం లేకుండా దరికి తీసుకుని వచ్చారు

శివాదన్యథా దైవతం నాభిజానే

శివోఽహం శివోఽహం శివోఽహం శివోఽహమ్. కేదార్ ప్రయాణ సంకల్పం రాజాది. అనుమతి పరమేశ్వరునిది కేదార్ చూడగనే ఉద్విగ్న పడ్డాడు. ఒక జలదరింపు పులకరింపు మైమరపు చూసాను. ముందు రొండు రోజులు యాత్ర ఆగటం ముగ్గురం ఫోన్ లో చూసాం. కానీ ఎవరం ఎవరికీ చెప్పలేదు. మాటకూడా అనుకోలేదు. కేదార్ వెళుతున్నాం అంతే .నిజంగా నే అలా నే వచ్చాం. 

 టీ తాగి కొంత విశ్రాంతి తీసుకున్నాము. బాగా ఎక్కువైనటువంటి చల్లదనం ఉంటుంది చేత ఉష రాజ ఇద్దరు కూడా బాగా అలసిపోయి ఉన్నారు నేను కూడా కొంత విరామంతీసుకొని కూర్చున్నా.కేదార్ చేరాం అనే తృప్తి కదలనీయలేదు. అక్కడ నుంచి కొంత మంది  పిట్టూవారు మోసుకు తీసుకొని వెళ్లేటువంటివారు మమ్మల్ని  గుడి దగ్గరికి తీసుకొని వెళ్తాము ఎక్కండి అని అడిగారు కానీ మేము నడుచుకుంటూ గుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాము రెండు గంటల ప్రాంతానికి గుడి దగ్గరికి చేరుకున్నాము.రద్దీ ఉంది. గుడికి బాగా దగ్గరలో ఉన్నటువంటి ఒక రూమ్ లో ఉండటానికి నిర్ణయించుకుని ఆ రూమ్లో దిగాము టైం మూడు అయింది రాజాఉష ఇద్దరు కూడా చలికి రూంలో ఉన్నారు. నేను మాత్రం స్నానం చేసి కేదారేశ్వరుని దర్శనానికి బయలుదేరి వెళ్లాను పెద్దగా ఎక్కువైనటువంటి క్యూ లేదు కానీ చలి మాత్రం ఉంది అయినా  స్నానం చేసి  కేదారేశ్వరుని దర్శనానికి బయలుదేరి వెళ్లాను సరిగ్గా 12 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ  కేదారేశ్వర దర్శనాన్ని ముందుగా చేసుకోవడం జరిగింది అప్పుడు అమ్మ అత్తయ్య గారు పిల్లలు అందరూ వచ్చాము ఇప్పుడు మాత్రం నేను మా ఉష రాజా ముగ్గురు మాత్రమే వచ్చాము. ఏ విధమైనటువంటి మార్పులు లేవు అంత గుడి చాలా గంభీరంగా ఎదురుగా కనిపిస్తూ ఉంది.గతం కన్నులముందుకు వచ్చిందిగత స్మృతులుగా మిగిలిపోయినటువంటి కొన్ని భవనాలు విశాలం అయిపోయి అంటే 13 లో జరిగినటువంటి విలయల్లో అవన్నీ పడిపోయాయి. గుడి చాలా విశాలంగా కనిపించింది అప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి తేడాలని చూస్తూ ముందుగా కేదారేశ్వర గుడికి నమస్కరించి గుడిలోకి వెళ్లాను.పైకి భక్తులు అప్పుడే వస్తున్నారు. గుడి లో పెద్దగా జనాలు లేరు బయట నుంచి దర్శనం అంతరాలయ దర్శనం లేదు. తృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వచ్చి అక్కడ నుంచి పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి తిరిగి చూశాను. తర్వాత నాలుగు ప్రాంతంలో మరలా  రూమ్ లోకి వెళ్లి అక్కడ మన ఫ్యాంట్ షర్టు వేసుకొని  బయటకు వచ్చాను.   చలిబాగా పెరుగుతుంది తగినటువంటి జాగ్రత్తలతో బయటికి వచ్చాను ఈ లోపు ఉష కూడా లేచి తను కూడా వస్తానంది ఇద్దరం కలిసి మరల గుడిలోకి  అరగంట ఆగి బయలుదేరి వెళ్ళాము.  మరుసటి రోజు అభిషేకం చేసుకొనటానికి అవసరమైనటువంటి పండిట్ కు ఫోన్ చేసి అతని యొక్క తమ్ముడు అక్కడే ఉంటే నా తన్ని ఫోన్ నెంబర్ తీసుకొని అతనితో మాట్లాడాము అతను సాయంకాలము 6 గంటలకు హారతి ఉంది హారతి తర్వాత మాట్లాడదామన్నారు ఉషా నేను వెళ్లి చక్కగా కేదారేశ్వర దర్శనం చేసుకున్నాము అప్పుడే జనాలు పై అప్పుడే జనాలు పైకి రావడం చేత కొంత రద్దీ ఏర్పడింది ఈ లోపు ఆ ప్రాంతమంతా ఒకసారి చూసి మరలా తిరిగి గుడి దగ్గరికి వచ్చాము ఇక్కడ 6 గంటలకి హారతి మొదలైంది హారతి మొదలవగానే లోపలికి వెళ్లి హారతి దర్శనం చేసాము మరల ఇంకొకసారి జనాలు బాగా ఉన్నారు. అంచేత మరలా తిరిగి ఇంకోసారి మరలా తిరిగి వెళ్లి రెండవసారి మరల హారతి దర్శనం చేసుకుని బయటికి వచ్చి హారతిని చూస్తూ ఉంటున్నాము జనాలందరూ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ భక్తులందరూ అక్కడికి వచ్చారు చాలా కోలాహాలంగా ఉంది.6 00 లెట్లు వేశారు. ఎంత అధ్భుతంగా ఉందో గుడి ఫుటో లో బందించడాని సరిపోదు. అదేసమయంలో వెనుక తెల్లని హిమవత్ పర్వతంవెలుగులో. అక్కడ వెలుగు. ఇక్కడ చీకటి. మాటలకు అందని అనుభూతి. మేఘాలు వెళ్ళపోయి మంచు కనపడుతుంది. పైగా ఆప్రాంతం లో వెలుతురు ఉంది. మేము చీకట్లో ఉన్నాం.  హారతి మొదలు. ప్రకృతి మైమరిపిస్తోంది.  చక్కనైనటువంటి జై జగదీశ్ హరే అనేటువంటి ఈ పాట మైక్ లో వినిపిస్తూ ఉండగా ఒక 6:30 వరకు హారతి గుడిలో మొదలైంది. అందరూ భజనలు హారతులు. ఆధ్యాత్మికసౌందర్యం ఉద్విగ్న భరిత వాతావరణం భక్తి ఉప్పొంగుతున్నభావతరంగాలు. ఆరున్నర తర్వాత బయటికి హారతి తీసుకొని వచ్చి బయట ఉన్నటువంటి వినాయకునికి నందీశ్వరునికి హారతి  మా అందరికీ అందరం హారతిని చూస్తూ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి అందరికీ హారతి చూపించడం జరిగింది చక్కగా దైవదర్శనమైన తర్వాత రాజా కూడా హారతి కిబయటకి వచ్చాడు. చలితోకొంత ఇబ్బంది ఉంది. తర్వాత అందరము గుడిలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నాము బయటికి వచ్చిన తర్వాత కొన్ని ఫోటోలు దిగి బాగా చల్లి పెరగడం చేత అక్కడే కొంచెం సేపు తిరిగి  7:30 ప్రాంతంలో తిరిగి మరల వెళ్ళిపోయాము రూమ్ లో నుంచి రూమ్ తలుపు తీస్తే ఎదురుగా ఉన్నటువంటి కేదార్నాథ్ స్వామి ఆలయం కనిపిస్తూ ఉంది అలానే ఆ రూమ్ లోనే పడుకున్నాము .టిఫిన్ కి బయటకు వచ్చాము. చలి ఎక్కువగా ఉంది. తర్వాత 8:30 ఆ టైంలో నేను ఒక్కడినే బయటికి వచ్చి రాత్రి ఆ లయ ప్రాంగణం మొత్తం కూడా 10:30 దాకా ఆ ప్రాంతాల్లోనే తిరుగాడా.అలౌకిక అనిర్వచనీయమైన అనుభూతి. మరల తిరిగి లభిస్తుందోలేదో. ఆ సౌందర్యాన్ని పరిసర ప్రాంతాలను చూస్తూఅక్కడే గడిపాను చాలామంది రాత్రి10:30 వరకు పైకి నడిచి వస్తూనే ఉన్నారు వచ్చినటువంటి వారందరూ స్వామివారి గుడిని గుడి ముగిసినప్పటికీ స్వామివారి గుడిని దర్శించడము ఆ ప్రాంతాల్లో కూర్చుని తన్మయత్వం లో ఉండటము ఒక అద్వితీయ ఆనంద తో ఆ ప్రాంతంలో వివరిస్తూ ఉన్నారు. తర్వాత బాగా చలి పెరుగింది. 8% ఇక మరసటి రోజు ఉదయాన్నే అభిషేకానికి రావలసినటువంటి కారణం చేత రూమ్ కి వెళ్లి స్వామివారి నమస్కరించి పడుకున్నాను . ఎదురు గా గుడి నిద్ర పట్టలేదు. మధ్యలో బయటకు వచ్చి చూడటం. ఎంత అధ్భుతంగా ఉందో రాత్రి సమయంలో గుడి నిశ్శబ్దంగా  భక్తులు అక్కడే ఉన్నారు.మొత్తానికి నిద్ర పోయా.

జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 

కేదారేశ్వరం కేదారనాద

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, బద్రీనాథ్ భాగంగా ఉంటాయి. భక్తులు ముందుగా యమునోత్రితో చార్‌ధామ్ యాత్రను ప్రారంభించి.. పైన పేర్కొన్న క్రమంలో బద్రీనా‌థ్‌తో ముగిస్తారు. ఈ కేదార్ నాథ్ యాత్ర చాలా ఆనందం కలిగిస్తుంది. గంగోత్రి నుంచి  శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా మూడో క్షేత్రమైన కేదార్నాథ్ కు చేరుకున్నాము. ఇదొక జ్యోతిర్లింగ క్షేత్రం. సముద్రమట్టానికి 3584మీటర్ల ఎత్తులో హిమాలయాలలో ఉంటుంది. దీని గురించి స్కంద పురాణంలో చెప్పబడింది.


కేదార్ నాథ్ జ్యోతిర్లింగం  



దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరుపొందిన 12వ శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్ నాథ్. కేదార్ నాథ్ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీసరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుండి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్ నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుకుంటాయి. అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. ఈ శివాలయంలో ఎద్దు పృష్ఠభాగం రూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది.


ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారు ఈ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు. ఇది వైశాఖమాంలో అనగా ఏప్రిల్లో నెల ఆఖరున లేదా మే మొదటి వారంలో వస్తుంది. తిరిగి వ్రుశ్చిక సంక్రమణం రోజున, అంటే సూర్యుడు వ్రుశ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మసి వేస్తారు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరు వారంలో గాని, నవంవబర్ నెల మొదటి వారంలోగాని వస్తుంది. ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు.


పురాణాల ప్రకారం


ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగం. నరనారయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలపై బదరీక్షేత్రమున తపస్సు చేసినప్పుడు ద్యోతకముయిన శివలింగము. కేదారము నందు ఉన్న శివలింగంను దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే! బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయాల్లో కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగను ఉంచి ఆరాధచేస్తుండేవారు. మట్టితో చేసి ఈ శివలింగంను వారు సాక్షాత్తు ఈశ్వరుడని అని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు, అప్పుడు ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగంకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకోమని అడిగారు. అప్పుడు వారు స్వామీ ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయ పర్వతశ్రుంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు.


అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండవది. దర్శించడానికి కఠినతరమైంది. 


అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటిగా వెలుగొందుతున్నది. కేదార్ నాథ్ ఆలయం ఆది శంకరులచే 8వ శతాబ్దంలో పేనర్ నిర్మించబడిన శివాలయం. సుమారు 1000సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు

కేదారేశ్వరస్వామి రెండు సార్లు రెండు విధాలుగా పూజింపబడుతాడు. ఉదయం బాలభోగ్ అష్టోత్తరం, మహాభిషేకం మొదలైన పూజలు ఎన్నో చేస్తారు. ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణపూజ అంటారు. కేదార్ నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేసి తిరిగి సాయంత్రం నాలుగు అయిదు గంటల మధ్య తెరుస్తారు.సాయంత్రం జరిగే పూజను శ్రుంగార పూజ అంటారు. సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామి వారిని అందమైన పూలతో అలంకరిస్తారు. కేదార్ నాథ్ లో 4 లేక 5 గంటలకే చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత ఆలయం ప్రాంగణం అత్యద్భుతంగా ఉంటుంది. కేదారేశ్వరస్వామి వారికి 6గంట నుండి 7గంటల వరకు విశేష హారతిని ఇస్తారు. ఆలయం లోపల హారతిని ఇస్తుంటే, ఆలయం వెలుపల సాధువులు శంఖం పూరిస్తుంటారు. రాత్రి సమయంన స్వామివారికి అర్చనలు ఉండవు. అలంకార మూర్తుడైన స్వామి దర్శనం మాత్రమే లభిస్తుంది.






 

Monday, October 7, 2024

త్రియుగీ నారాయణ్ మందిరం

 3/9/24 త్రియుగీ నారాయణ దర్శనం

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ






ఘర్సాలి నుంచి ఏడున్నరకు కేదార్ కి బయలుదేరా మధ్యలో దారి చాలా పాడైపోయింది చాలా చోట్ల కొండలు పడిపోయి తాత్కాలికంగా మరమ్మతులు చేసినటువంటి దారి నిదానంగా వెళ్తున్నాము మధ్యలో ఆగస్త్యముని అనేటువంటి పట్టణంతగిలింది చాలా చక్కనైనటువంటి వారు ఊరికి అటు ఇటు రెండు వైపులా గంగ ప్రవహిస్తూ ఉంది ఆ ఊరిని దాటి అక్కడి నుంచి గుప్తకాశీ మీదుగా  సేర్శీ   చేరాము.  కేదార్నాథ్ కి వెళ్ళటానికి హెలికాప్టర్ సర్వీసెస్ ఇక్కడి నుండి ఉన్నాయి.  ఆ రోజు హెలికాఫ్టర్ సర్వీస్ ఉందేమో కనుకున్నాము . వాతావరణము అనుకూలంగా లేకపోవడం చేత ఆరోజు కూడా హెలికాప్టర్ సర్వీసు రద్దు చేశారు. మరుసటి రోజుకి కూడా టికెట్స్ లేవు అని చెప్పారు .రెండోది వాతావరణ కారణంగా మరుసటి రోజు కూడా హెలికాప్టర్ సర్వీసు ఉంటుంది లేదో అనేటువంటి సందేహం ఉంది. ఈరోజు చాలామంది సాయంకాలం వరకు అక్కడే హెలికాప్టర్లో బయలుదేరడంకోసం వేచిచూడడం హెలికాప్టర్ బయలుదేరకపోవడంతో వారందరూ అక్కడే కూర్చొని ఉన్నారు .మేము హెలికాప్టర్ గ్రౌండ్  పక్కనే ఉన్నటువంటి రూంలో ఉన్నాము అక్కడి నుంచి మేము నాలుగు గంటలకు  త్రియుగీ నారాయణ్  దర్శనం కోసం  వెళ్ళాం.సోన్ ప్రయాగ దగ్గర నుంచి ఒక 14 కిలోమీటర్లుదూరం. దారి అంతా కూడా చాలా కఠినంగా ఉంది అంటే దాదాపుగా దారి చాలా చోట్ల మూసుకుపోయి ఉంది చాలా చోట్ల కొండ పడిపోయింది. తాత్కాలికంగా మరమత్తులు చేశారు కారు కూడా చక్రాలు తిరిగి కొన్ని ప్రదేశాల్లో కారు ముందుకు పోలేదు. కొంథ భయం వేసే పరిస్థితి. బయలుదేరినటువంటి సమయం సాయంకాలం నాలుగు గంటల ప్రాంతం కాబట్టి కొంచెం చీకటి పడుతుందా అనేటువంటి సందేహం కూడా ఉంది.  కార్లు కూడా మా ముందు ఏమీ లేవు. ఇది చాలా విశిష్టత కలిగిన ప్రాంతం .శివపార్వతులకువివాహం జరిగినటువంటి క్షేత్రం గా చెప్పబడేటటువంటిది చాలా అందమైనటువంటి గుడి ఈ ఆలయంలో మనకు రెండు అడుగులు ఉన్నటువంటి లక్ష్మీనారాయణ విగ్రహాలు చాలా అందంగా ఉన్నవి.ఎడమవైపు నాలుగు అడుగు ల విష్ణంమూర్తి విగ్రహం చాలా అందంగా  ఉంది .గర్భగుడిలో  పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. శైవ క్షేత్రం అయినప్పటికిని  విష్ణుమూర్తి విగ్రహం ఉండటమే విశేషం. కేదార్నాథ్ ఆలయం వంటి గుడి .గుడి కింద కు ఉంది .ఒక 10మెట్లు దిగాలి. చాలా విశాలమైన ప్రాంగణం మూడు కుండాలు . ఉన్నాయి  ఒకటి బ్రహ్మగుండం రెండు విష్ణుకుండము మూడు రుద్ర కుండమన్నారు . నీరు బాగా స్వచ్ఛంగా ఉంది. చాలా పాతకాలం నాటి గుడి నాలుగు వైపులా కూర్చొనడానికి అనువుగా పానపట్టం లాగా ఉంది. శివపార్వతుల యొక్క వివాహం జరిగిన ప్రదేశం. శివపార్వతుల విగ్రహం తో ప్రాంగణంలో ప్రత్యేక ప్రదేశం ఉంది. అది

వివాహం జరిగినటువంటి పీఠంగా చెప్పారు. అక్కడ కూర్చుని పూజ చేయించుకున్నాము .తర్వాత గర్భ ఆలయానికివెళ్ళి మరలదర్శనం చేసుకున్నాము.గుడిలో గర్భాలయం ఎదురుగానే  పెద్ద ధుని. మూడు యుగాలుగా వెలుతున్న జ్వాల దానికి  సాక్షి గనుక ఈ స్వామికి త్రియుగీ నారాయణ అనే పేరు వచ్చిందిర. మూడు యుగాలు నుంచి ఆ అగ్ని అలానే మండుతుంది. దాని లో ఒక సమిధ వేసి విభూది తీసుకుని పునర్దర్శనంకలగాలని వేడుకొని బయలుదేరాము.చుట్టూ కొండలమద్య  అందమైన దేవాలయం.  వాతావరణం ప్రశాంతంగా ఉంది. పరమ పుణ్య పదప్రదేశం రమణీయంగా ఆద్యంతం పవిత్రతను కలిగించే వాతావరణం. ఆదిదంపతుల  వివాహ సంరంభాన్నిప్రోదిచేసుకున్న ఎందరో దేవతలు సందర్శించిన పుణ్య స్థలం. ఐదున్నర కల్లా దర్శనం చేసుకుని మరలా తిరిగి ఒక అర కిలోమీటర్ నడిచి కారుదగ్గరికి చేరాము. అప్పుడు కూడా కొన్ని కార్లు వచ్చాయి.స్వామ. అక్కడ నుంచి చాలా ప్రశాంతంగా మరలా తిరిగి 6.30 సేర్శీ చేరాము.   భోజనం చేసాము. ఈ రోజు మధ్యాహ్నం టిఫిన్ కూడా తిన్నాము. మూడు రోజుల తరువాత. 

అప్పుడే వచ్చినటువంటి యాత్రికులు చాలామంది మా పక్కన ఉన్నటువంటి రూములో దిగారు.చాలా కోలాహలంగా ఉంది. వారందరూ హెలికాప్టర్ బుక్ చేసుకున్నటువంటి వారు వెళుతుందా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి సందేహంఉంది చూద్దాం ఈ రెండు రోజుల నుంచి ఆగినటువంటి కేదార్నాథ్ యాత్ర ఈరోజు బయలు మొదలైంది కనుక రేపు మేము పైకి వెళ్లొచ్చు అనేటువంటి భరోసా. ఆపై దైవనిర్ణయం అనేటువంటి ఒక ధీమాతో పడుకున్నాము రేపు ఉదయాన్నే బయలుదేరి కేదారికి వెళ్లాలి ఉదయాన్నే 6 గంటలకు ప్రయాణం రాత్రి వాతావరణం బాగా చల్లగా ఉంది కాకపోతే ఇక్కడ రూమ్లో ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ వేసుకుని పడుకున్నాము రేపు ఉదయం4/9/24 కేదార్ ప్రయాణం.


కేదార్ కి వెళడానికి బేస్ గౌరీకుండ్.. ఇక్కడి నుండి కేదార్ 16 కిమి. అందరూ రాత్రికి గౌరీకుండ్, సోన్ ప్రయాగ ,రామ్ పూర్ ,సీతాపూర్ సేర్శీ లకు చేరతారు. సేర్శీ ప్రమాదం లేని ప్రాంతం. మిగతావి కొండ పడే ప్రాంతం .వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయి మరల నిర్మాణం జరిగిన ప్రాంతం. ఇప్పుడు సోన్ ప్రయాగవరకే కారు. అక్కడే రిజిస్ట్రేషన్ చెకింగ్. అక్కడి నుండి 6 కి.మి జీపులు గౌరీకుండ్ వరకూ. అక్కడి నుండి గుర్రం లేదా ఇతరములు 

Sunday, October 6, 2024

గంగోత్రి गंगोत्री धाम्

 గంగోత్రి 

గఙ్గాఫేనసితా జటా పశుపతేశ్చన్ద్రః సితో మూర్ధని

సో‌உయం సర్వసితో దదాతు విభవం పాపక్షయం సర్వదా


భావము:--శివుని జటాజూటముపైని గంగ నురుగు తెల్లగానూ , తలపైని నెలవంక తెల్లగానూ వుంది మొత్తము శివుడు కూడా తెల్లగా ప్రకాశిస్తూ మనకు వైభవము,పాపక్షయమూ కలిగించు గాక!

—------------------------

  మరుల్లీలాలోలల్లహరి పునానాః సౌరభ్యైః సతతమలినో నిత్యమలినాన్‌

సఖాయో నః సంతు త్రిదశతటినీతీరతరవః








2/9/24రెండో తారీకు ఉదయాన్నే  ధరళిలో ఉన్నటువంటి కల్ప కేదార్ ఆలయాన్ని సందర్శించాము .ఆలయం కిందకి ఉంటుంది. గుడి లో గర్భగుడి లేదు. కేదార్ లాంటి గుడి కింద ఒక పెద్ద ఖాళీ ప్రదేశంలో నీటి అడుగు న శివలింగం.   అక్కడికి చాలా దగ్గరలోనే గంగా నది ప్రవహిస్తూ ఉందిచుట్టూ అంతా యాపిల్ తోటలు.పండ్లు కిందరాలి పడి ఉన్నాయి. యాపిల్ తోటల మధ్యలో నుంచి నడుస్తూ వెళ్లి గంగానది దర్శనం చేసుకున్నాము.స్నానం చేయలేము. చాలా ఉధృతి ఆచమనం చేసి గంగోత్రి కి బయలు దేరాము. ఈరోజు పోలాల అమావాస్య. చాలా మంది స్థానికులు గంగకు పూజలు చేస్తున్నారు.  20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గంగోత్రి కి ఉదయాన్నే ఏడున్నర కల్లా బయలుదేరి వెళ్ళాము . ధరళి లో గంగ దగ్గరగా ఉంది. మరల కొండ ఎక్కుతున్నాము. రెండు వైపులా చీడ్ చెట్లు. చలిగా ఉంది. మధ్యలో కొంచెం వర్షం. మరల ఎండ.ఎండ ఉన్నా చలి ఉంది.దారి అక్కడ అక్కడ పాడైంది. కొండ పడింది. చాలా చోట్ల తాత్కాలికంగా బాగుచేస్తున్నారు. కొన్ని చోట్ల పడటానికి సిద్ధంగా ఉన్నట్లు చెట్లు ఉన్నాయి. జాగ్రత్తగా చూస్తూ ప్రయాణం. జలపాతాలు పలకరిస్తున్నాయి. ఊరిస్తున్నాయి. కానీ రాళ్లు పడతాయి అని దూరం నుంచి చూస్తూ దగ్గర నుండి దాటుతూ సాగుతోంది ప్రయాణం. భయం కాదు కాని ఉద్విగ్న త కలుగుతుంది. కారులో నేరుగా గంగోత్రి దగ్గరికి వెళ్లొచ్చు .ఒక అర కిలోమీటర్ ముందు కార్లు ఆగుతాయి .8.30చేరాము. అక్కడి నుంచి నడుస్తూగంగా నది యొక్క పుట్టుక స్థానంగా చెప్పేటువంటి గంగోత్రి ఆలయానికి చేరాము. గంగోత్రి ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మధ్యలో కుడివైపున కిందకి దిగితే అక్కడ అక్కడి నుంచి గంగా నది .పెద్దగంట దాని కిందనుంచి గంగ ఒడ్డున ఉన్న స్నానఘట్టాలు. అంతకు ముందు వరదకి అన్నీ కోట్టుకు పోయి రాళ్ళు బెటపడ్డాయి. కొంత ప్రాంతంలో షెడ్లు ఉన్నాయి. అక్కడ గంగకు పూజ చేసాము. అమావాస్య కాలం కలిసి వచ్చింది. పితృ తర్పనం వదిలే అవకాశం కలిగింది. స్నానం చేయడం సాహసమే. వాతావరణం చల్లగా ఉంది. నీరు గడ్డకట్టిచేలా ఉన్నాయి. లఘుస్నానంతో సరి. ఎదురు గా గంగ పైనుంచి వేగంగా చుట్టూ కొండలు. ఎదురు గా కొండలకింద కొన్ని అధునాతన వసతి గృహాలు. కనుచూపు మేర గంగా ప్రవాహం. పరమ పావన మూర్తి గంగ.కదిలి పక్కన రావడం కష్టమే. కొంతసేపు తరువాత పక్కనే ఉన్న  భాగీరథిశిల.ఈప్రాంతమే గంగ భువికి అవతరించి న ప్రదేశం. ఇదితపస్సుచేసిన శిల. గుడి ఉంది దర్శనం చేసుకున్నాము. భగీరథుడు తపస్సు చేసిన ప్రదేశం.  నమస్కరించి గంగోత్రి ఆలయానికి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి సరిగా 9:00 భోగ్  సమయం. నివేదన సమయం.  ఒక పావుగంట గుడి గుడి తీసిన తర్వాత దర్శనం చేసుకున్నాము చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నటువంటి విగ్రహం. ప్రథాన విగ్రహం పక్కన మూడు విగ్రహాలు.తెల్లనిఆలయం.  వాతావరణం బాగా చల్లగా. గుడి ముందుకు మేఘాలు వచ్చాయి. కొంచెం రద్దీ పెరిగింది. ఆలయం ఎదురుగా  అఖండ ధుని.లోపల వెచ్చగా ఉంది.  అక్కడే కూర్చున్నాము కొంచెం సేపు.మరల అమ్మవారి దర్శనం  దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మరలా గంగా నది వైపు వెళ్ళాము. గంగా నీరు తీసుకుని మరల దర్శనానికి వెళ్లి దర్శనం చేసుకుని పునర్దర్శనంకలగాలని ప్రార్ధించాము. పక్కనే  శివుని ఆలయం ఉంది శివాలయంలోకి వెళ్లి అక్కడ శివునికి గంగతో అభిషేకం  చేసాము. చూస్తూ 11:00 కల్లా కారు దగ్గరికి చేరుకున్నాము.నడవలేని వారికి వీల్ ఛైర్ సౌకర్యం ఉంది. దారి అంతా రెండు వైపులా దుకాణాలు. పూజా సామగ్ర. రుద్రాక్ష మాలలు. ఇతరములు. బాగా చల్లని వాతావరణం.వాతావరణం లో ఆధ్యాత్మిక త ప్రశాంతత.అనిర్వచనీయమైన అనుభూతి. మార్గమధ్యంలో గోముఖానికి వెళ్ళే దారి కనిపించింది. గుర్రాలమీద ప్రయాణం రెండు రోజులు పడుతుంది ట. గంగ పుట్టిన గంగా గ్లేసియర్ .అక్కడ గోముఖం వంటి ఒక ప్రాంతంనుండి గంగ వస్తుంది. గంగోత్రి ఆలయం దగ్గర రెండు పెద్ద స్క్రీన్ లపై చూపుతున్నారు. ఇప్పటికి ఇంతే. చుట్టూ కొండలు చూస్తూ  నుంచి మరలా తిరుగు ప్రయాణం.ఇక్కడి  మూడు కి మి దూరంలో జాహ్నవి నది గంగలో కలుస్తుంది. 12.00గంటలకు మేమున్నటువంటి  ధరళి  తిరిగి వచ్చాము. ఆరోజు అక్కడి నుంచి మేము తిరిగి కేదార్ నాధ్ కి ప్రయాణం. నంద ప్రయాగ దగ్గర రోడ్డు మూసివేసారు. ఉత్తర కాశీ  గుప్తేశ్వర్ మీదుగా ఆరోజు సాయంకాలం 7.30గంటలకు ఘరశాలీ. చేరాము.ఘర్శాలీ

రాత్రి7.30

వాతావరణం పొడి గా ఉంది

గంగ పక్కనే

ఇక్కడ గంగ ఎదురు ప్రవహిస్తోంది అని మనుశర్మ చెప్పాడు. నాకు పల్లంకి ప్రవహిస్తోంది అని అని అనిపించింది.నిజమే గా. నీరు పల్లానికేఎపుడూ

    అంటే ఇంతవరకు మేము కొండ ఎక్కుతూ గంగానది ప్రవహించేటువంటి ప్రవాహానికి ఎదురుగా వెళుతూ ఉంటాము. ఈ ప్రాంతంలో మాత్రం గంగా నది కిందకు ప్రవహిస్తూ ఉంటుంది .అంతే.  రాత్రికి అక్కడే విశ్రాంతి. దాదాపుగా 7 గంటలు ప్రయాణం 270 కిమీ .గంగోత్రి 3140 మీ ఎత్తున ఉంది అక్కడ నుండి   నుంచి  శ్రీనగర్(579 మీ ఎత్తు) వరకు కిందకి ప్రయాణం. కొండదిగటం మరో కొండ ఎక్కడం సహజం .మరల శ్రీనగర్ నుండి ఎత్తు కి వెలడం మొదలు  .చిన్నగా చలి పెరుగుతుంది .దారి అనూహ్య మలుపు లు గతుకులు , వర్షం. ప్రయాణం మరపురాని అనుభవం. ఎక్కువగా రద్దీ లేని మార్గంలో శ్రీనగర్ చేరాము అక్కడి నుంచి  కేదార్ మార్గం శ్రీనర్ నుండి రద్దీ పెరిగింది. రోడ్లు వెడల్పు గా ఉన్నాయి. కానీ చాలా చోట్ల రోడ్డు కొట్టుకు పోయింది. తాత్కాలిక ఏర్పాటు గా దారి చేసారు. ..రాత్రి భోజనం చేసి పడుకున్నాము.  కేదార్ యాత్ర  నిన్న టి1/9/2024 నుండిఆపారు. సోన్ ప్రయాగ దగ్గర కొండ పడింది.

Saturday, October 5, 2024

యమునోత్రి యమునానది జన్మస్థలం


 సునందనందనాంగసంగరాగరఞ్జిత హిత

ధునోతు మే మనోమలం 
యమునాష్టకం

1/09/24

యమునోత్రి
ఉదయాన్నే ఐదు గంటలకు లేచి బయలుదేరడానికి సిద్ధమయ్యాము. యమునోత్రికి జానకి  చహచట్టి నుండి ఐదు కిలోమీటర్లు .  కోసం గుర్రాల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. జానకి చిట్టి మనకు 25 76 మీటర్ల ఎత్తులో ఉంటే యమునోత్రి 33 23 మీటర్లు ఎత్తు అంటే జానకి చట్టీ  నుంచి యమునోత్రి చేరడానికి 747 మీటర్లు అంటే 2,426 అడుగుల ఎత్తు ఎక్కాలి.  కొండ మార్గంలో ఎక్కుతూ పైకి వెళ్లాలి అది ఐదు కిలోమీటర్లు పొడవు ఐదు కిలోమీటర్ల దూరంలో మనం ఎక్కేటువంటి ఎత్తు 2426 అడుగులు 
ఇలా మనం ఐదు కిలోమీటర్ల మార్గము నిటారుగా చాలా 5/6 అడుగు లు వెడల్పు తో సన్నగా పొడుగ్గా దారి సాగిపోతూ ఉంటుంది .మెట్లు కొన్ని చోట్ల కొన్నిచోట్ల మామూలు దారి  అడ్డదిడ్డంగా ఉన్నటువంటి రాళ్లు కనిపిస్తూ ఉంటాయి .మనకు  యమునోత్రి కిచేరడానికి  మూడు/4 రకాలైనటువంటి ప్రయాన సాధనాలు ఉన్నాయి. ఒకటి గుర్రం గుర్రం మీద వెళ్ళటానికి భయపడితే  *పిట్టు* అంటే   ఒక మనిషి వీపు మీద ఒక బుట్టలో  కూర్చోబెట్టి మనల్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. మూడోది పల్లకి నలుగురు మనుషులు కలిపి తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ మూడు మనకు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సాధనాలు . నాలుగు.  ..,నడక..మేముమాత్రం గుర్రాన్ని మాట్లాడుకున్నాము. గుర్రము ఆరింటికల్లా సిద్ధమైంది దాదాపుగా చాలా అందరికన్నా ముందుగానే బయలుదేరితే ఉన్నాము. నడకదారిలో వెళ్ళేటటువంటి వాళ్ళు నాలుగు గంటలకే బయలుదేరి నడిచి వెళుతూ ఉన్నారు.  అక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణం భయమైతే ఏమీ లేదు ఇంతకు ముందు గుర్రం ఎక్కిన అనుభవం మా ఇద్దరికీ ఉంది రాజాకి కొత్తగా ఉంది .తను కూడా చాలా ఉత్సాహంగా ధైర్యంగా గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రాలవాల్లుజాగ్రత్తలు చెప్పారు.  ముగ్గురం బయలుదేరి యమునోత్రివైపుగా ప్రయాణం మొదలుపెట్టాం. మాతో పక్కనే వస్తూ గుర్రాలకి సూచనలుఇస్తూ మధ్య మధ్యలో మమ్మల్ని పలకరించుకుంటా హుషారుగా కొండ ఎక్కిస్తున్నారు.  స్నానం చేయడానికి అవసరమైనటువంటి ఒక జత బట్టలు,  ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాము. వర్షం పడటం సర్వసాధారణమైనటువంటి విషయం కనుక దానికి తడిసిపోకుండా ఉండడం కోసం   ఒక వంద రూపాయలు పెట్టి ఒక రైన్ కోట్ లాంటివి కూడా ఆ ముగ్గురం తీసుకున్నాము.ఆబ్యాగ్ మావీపున ఉంది. చేతిలో సెల్ ఫోన్ ఫొటోలు తప్పదు. అక్కడి నుంచి బయలుదేరి ఆరు గంటలకల్లా బయలుదేరి కొండగట్టు మొదలు పెట్టామో చాలా పైకి ఎక్కటం ఎక్కేటువంటి వాళ్ళుగా పైకి ఎక్కటం అనేటువంటిది మెట్లు ఎక్కటం ఉంది కొన్నిచోట్ల ఏ విధమైన మెట్లు లేకుండా మనకు గుర్రాలు అనటానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశంగా ఉంది అలా నడుస్తూ ఒక రెండున్నర కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక రోడ్డు పక్కనే ఆగి అక్కడ టీ తాగాము .అక్కడి నుంచి మరల బయలుదేరి 8.30 యమునోత్రి  చేరాము .గుర్రాలు ఆగే దగ్గర నుండి
 ఒక అర కిలోమీటర్ దూరం నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది .ప్రయాణం అంతా కూడా వెళ్లే దారి అంతా కూడా కొండ అంచుని వెళ్తూ ఉండటం .మేము వెళ్లేటప్పుడు మాకు ఉదయం పూట  సమయం కాబట్టి ఎదురుగా వచ్చేటువంటి గుర్రాలు అంటే కిందకు వెళ్లేటువంటి గుర్రాలైతే మాకు ఏం తగలేదు కానీ మనుషులు మాత్రం కొన్నిచోట్ల ఎక్కుతూ ఉన్నారు. వారిని పక్క తప్పుకోమంటూ  కొన్ని చోట్ల వారికి దగ్గర దగ్గరగా వెళ్ళటం జరిగింది. తల కూడా పైనతగల కుండా కొండ కు రాచుకోకుండా జాగ్రత్తగా ఉంటూ జారుతున్న జలపాతాలు చూస్తూ, జారిపడి పోయిన కొండ లను చూసి ఉద్విగ్న పడుతూ,కింద వాలులో పరిగెడుతున్న యముననుచూస్తూ ,అగాధపు అంచులలోకి వెళుతున్న గుర్రాలను గమనిస్తూ, చేతిలో ని ఫోన్ లో అనుభూతులు చిత్రిస్తూ భవభయనాశిని యముననుస్మరిస్తూ. ..ఓహ్.. అద్భుతమైన ప్రయాణం.అనుభవైకవేద్యమైన అనుభూతి, ఆనందసాగరాలలో తేలియాడాము.ఏ విధమైన భయం లేకుండా వెళ్లేటప్పుడు మధ్యలో చాలా చోట్ల పైనుంచి పడుతున్నటువంటి నీరు అక్కడక్కడ మీద పడే నీళ్లు తడుస్తూ  వెళ్ళటం జరిగింది. చాలా బ్రహ్మాండంమైన అనుభవం.  అక్కడి నుంచి ఒక ఆర కిలోమీటర్ నడిస్తే  యమునా దేవి గుడి  అక్కడికి వెళ్ళడానికి మనం కొంత కొండ దిగి ఒక 200 మెట్లు దిగి మనం అక్కడ దాక వెళ్లాలి. ఎదురు గా కోసం ఆ ముందుకు వెళితే యమునోత్రి దగ్గర మనకు వేడిగా ఉన్నటువంటి ఉష్ణ కుండాలు . అక్కడిదాకా వెళ్ళాము . యమునోత్రి సమయంలో ముందుకు వెళ్ళబోయే ఎటువంటి ప్రాంతాన్ని కొంచెం ముందుగానే కుడి వైపు యమున దాటడానికి ఒక బ్రిడ్జి కూడా ఉంది ఆ బ్రిడ్జి మీద నుంచి కొంచెం ముందుకు వెళితే మనకు ఎదురుగా ఉన్నటువంటి యమునోత్రి ఆలయం ఒక పక్క నుంచి కనిపిస్తూ ఉంటుంది.చాలా చాలా బాగుంటుంది ఆదృశ్యం. అలా తిరిగి మరల  యమునోత్రి ఆలయం బయలుదేరి వెళ్ళాము అక్కడ ఉష్ణ కుండాలలో నీరు బాగా వేడిగా ఉన్నాయి. నీటిలో దిగాము మొదటి కొంచెం బాగా వేడిగా ఉన్న తర్వాత మనం భరించగలిగేటువంటి స్థాయిలోని నీరు ఉన్నాయి. చక్కగా ఈ దాంట్లో స్నానం చేసాము మధ్యలో మాత్రం ఒకచోట విపరీతమైన వేడితో నీరు పైకి ఉబికి వస్తుంది.  ఆ నీరు ఆ ప్రాంతం కాకుండా మిగతా అంతా కూడా మనము  స్నానం చేయడానికి అనుకూలమైనటువంటి వేడిలో ఉన్నాయి .ఇక్కడ మగవారికి ఆడవారికి వేరువేరుగా  కుండాలు ఉన్నాయి దాంట్లో మనం స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి పైన ఉన్నటువంటి యమునా దేవి ఆలయానికి వెళ్ళాము.మెట్లకి ఎదురు గా  సూర్య కుండం సూర్య కుండానికి పక్కనే  యమున  అమ్మవారి ఆలయంచిన్నది ఉంది. ఇదే యమున ఉద్భవించిన ఆలయం . గోత్రనామాలతో అమ్మవారికి పూజ చేసి లో పల చిన్న కటకటాల లో పల కేవలం పడుకొని  అమ్మవారి పాదాలు తాకి వేడిగా పొగలుకక్కే నీటిని తీసుకుని శిలపై అభిషేకం చేసాము . గర్భగుడి ఒక చిన్న ప్రాంతంలో వేడిగా బాగా వేడిగా ఉన్నటువంటి నీరు బయటకు వస్తోంది అదే అమ్మవారి యొక్క పుట్టుక జన్మస్థానంగా చెప్పారు దాన్ని నీరు తీసుకొని అక్కడే అమ్మవారికు అక్కడ ఉన్నటువంటి గోడ మీద అమ్మవారి కిపూజ చేశాము చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి సూర్య కుండం దగ్గరికి వెళ్ళాము. దాంట్లో  బాగా కాగేటువంటి నీరు.పెన మూత ఉంది. ఒక మన మూటలో బియ్యం  మూటగట్టి ఇస్తే దాంట్లో  పెట్టి ఉడికించి ఇస్తారు.ఒక పది నిమిషాలు. ఆంత వేడినీరు. అది ప్రసాదంగా అమ్మవారి నైవేద్యంగా దాన్ని తీసుకున్నాము. అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి యమునోత్రి అమ్మవారి గుడికి వెళ్ళాము. చాలా బ్రహ్మాండంగా ఉంది . గుడి ముందు విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది  గుడి లో అమ్మవారు  యమునా నది ప్రవహించేటువంటి  వైపు చూస్తూ ఉంది.యమునా దేవి మూర్తి ఆకర్షణీయం అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి ప్రదక్షిణ చేసి ప్రసాదం తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చాము. ఆలయం ముందు సందడిగా ఉంది. గుర్తుగా కొన్ని ఫుటొలు. చక్కరైనటువంటి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారి గుడి ముందు కొన్ని గుర్తుగా కొన్ని ఫోటోలు దిగాము అక్కడి నుంచి పక్కనే అమ్మవారి గుడికి కొంచెం పక్కనే ఉన్నటువంటి యమునా నది వైపు వెళ్ళాము. దాంట్లో దిగటానికి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి ప్రదేశమైనప్పటికిని ఒక పక్క నుంచి అక్కడ ఉన్నటువంటి యమునా నీరుని తీసుకున్నాం. ఆ పైనుంచి మనకు కంటికి కనిపించేటటువంటి దూరంలో కొండల మధ్యలో నుంచి యమునా నది కిందకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి మరలా తిరిగి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని పక్కనే ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కూడా చూసి అక్కడే ఒక గంట సేపు కూర్చున్నాము. అక్కడ పది సమయాన్ని కల్లా అక్కడ నుంచి మరల తిరిగి వెనక్కి గుర్రాల వైపుగా బయలుదేరి వచ్చాము. వచ్చేటప్పుడు తిరిగి కిందకి వచ్చేటువంటి సందర్భంలో రాజా నడిచి కిందకి వస్తానన్నాడు. తను నడిచి కిందకి బయలుదేరాడు నేను ఉష ఇద్దరం. మాత్రం గుర్రాలు మీద మరలా తిరిగి కిందకు బయలుదేరాము వచ్చేటప్పుడు పైకి వచ్చేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఎదురు గుర్రాలు వస్తున్నాయి. కొంత భయాన్ని కలిగించేటువంటి సందర్భమైనప్పటికీ  గుర్రాలు చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చాయి కాకపోతే మేము తిరిగి వచ్చేటువంటి సందర్భంలో ఎదురైనటువంటి అనుభవం ఏంటి అంటే అప్పుడు చాలామంది పైకి వస్తున్నారు అంటే గుర్రాలు వచ్చేటటువంటి గుర్రాలు యొక్క వరుస మాకు ఎదురుగా కనిపిస్తూ ఉంది చాలా జాగ్రత్తగా గుర్రాలు ఒక పక్కన జాగ్రత్తగా కింద దిగాము.  మధ్యలో బాగా దిగేటువంటి మెట్లున్న ప్రాంతంలో దాదాపుగా ఒక కిలోమీటర్లు  ఆ ప్రాంతంలో గుర్రాల వాళ్ళు మీరు దిగినడవగలిగితే నడవండి అన్నారు. ఆ మెట్లు మాత్రం దిగి  దాదాపుగా ఒకటిన్నర రెండు కిలోమీటర్లు  నడుస్తూ కిందకు వచ్చాము. అక్కడినుంచి మరలా తిరిగి గుర్రాలు ఎక్కి మేము చాలా జాగ్రత్తగా కిందకి వచ్చాము .మేము వచ్చినతరువాత ఒక పది నిమిషాలకి రాజా కూడా చాలా ఉత్సాహంగా పైనుంచి కిందకి దిగి వచ్చాడు చాలా అద్భుతమైనటువంటి అనుభవం పైన చాలా చల్లగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి యొక్క దర్శనము కొండల మధ్యలో ఒక నది యొక్క జన్మస్థానాన్ని చూడటం ఒక అద్భుతమైనటువంటి అదృష్టంగా భావించాము. అది యమునా ఉత్తరి యమునా దిగినటువంటి ప్రదేశంగా చెప్పినటువంటి ఆ ప్రాంతం చాలా మహిమాన్వితమైన ది. కిందకి దిగి వచ్చినప్పటికిని పైన ఉన్నటువంటి ఆ ప్రాంతం ఇంకా కల్లలోనే మెదులుతూ ఉండది . పది నిమిషాలు అక్కడే విశ్రాంతి తీసుకుని మరలా తిరిగి అక్కడ నుంచి గంగోత్రి వైపు వెళ్లడం కోసం అమ్మవారికి నమస్కరించి బయలుదేరాము.  యమునా నది లో కి వెళ్లి మా దగ్గర అప్పుడే చేసి సిద్ధంగా ఉన్నటువంటి రెండు వాటర్ బాటిల్స్ లో యమునానీటిని తీసుకొని గుర్తుగా రెండు  చక్కని రాళ్ల నుండి తీసుకుని వచ్చాము. మరలా తిరిగి కారులో 12.00 గంగోత్రి వైపుగా ప్రయాణం మొదలుపెట్టాము.  మధ్యలో ప్రయాణం సాగుతూ ఉంది 12 గంటలకి బయలుదేరినటువంటి మేము సాయంకాలము 7.00 గంటల వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నాము. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం గంగోత్రి వెళ్ళేటటువంటి దారి మధ్యలో హార్సిలీ అనేటువంటి ఒక ప్రాంతంలో మనకు మన ప్రాంతాలలో కనిపించినటువంటి   ఈ యాపిల్ చెట్లు బాగా కనిపించాయి యాపిల్ చెట్లను చూస్తూ మధ్యలో ఉన్నటువంటి ఒకచోట యాపిల్స్  తీసుకొని వాటిని తింటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాము .మేము ఆరోజు మరల ఆరోజు మరల మా మజిలీ ఎంతవరకు అంటే ఘర్
ధరళీ చేరేవరకు .అది కూడా గంగోత్రి కి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఆరోజు సాయంకాలం 7:00 కల్లా మేము ధరళీ ప్రాంతానికి చేరుకున్నాము అది కూడా యాపిల్ తోటలకు ప్రసిద్ధమైనటువంటి ప్రాంతము అక్కడే కేదారేశ్వరుని గుడి కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి గంగా నది భాగీరధి అక్కడ ప్రవహిస్తూ ఉన్నటువంటిది ఆ నదీ ప్రాంతంలో ఆరోజు రాత్రికి విశ్రాంతి. భోజనం 8.00గంటల కు. చలి బాగా ఉంది. 1/9/2024
ఈరోజు ప్రయాణం యమునోత్రి నుంచి ధరళి వరకు 209 కి.మీ..........
యమునోత్రి 3323 మీ ఎత్తు ప్రయాణం ధరసు వరకు కిందకి 1036 మీ ఎత్తు వరకూ
మరల ఎత్తు పైకి ఎక్కడం గంగోత్రి 3140 మీ
ధరళి 2652  అంటే జానకి చట్టీ ఎత్తు
వాతావరణం14 డిగ్రీలు చలి ఉంది.
యమునోత్రి ప్రయాణం లో
రాజా ఎక్కిన గుర్ర పేరు బాలు
మరుసటి రోజు ప్రయాణం గంగోత్రి2/9/24