కేదారేశ్వరుని దర్శనం
కేదారేశ్వరునిఆలయం కనిపించే ముందు వెనుక మంచుతో నిండి న పర్వ తశిఖరాల వరుస దర్శనం. ఆతర్వాత ఆలయదర్శ నం. మెట్లు ఎక్కుతూ ఆలయందగ్గరకు చేరుకోవాలి.ఆలయ ప్రాంగణంముందు ఒక పెద్ద గంట దానినిదాటి ముందుకు వెళితే కొద్ది దూరంలో ఆలయం. పెద్ద నంది విగ్రహం..
మంచు పర్వ తాలు ప్ర కృతి సౌందర్యం నిండిఉన్నా కేదార్నాధ్ ఆలయం చూపు పక్క కు తిప్పనివ్వదు .అంత అద్భుతమైనటువంటి ఆలయం. ఆలయ ద్వారం మనోహరంగా అలంకరించి ఉంది.ద్వారా నికి ఇరువైపులా ద్వారపాలకులు. వినాయకుడు విగ్రహం ఆలయంలోకి ప్రవేశించగానే ఒక మండపం అందులో ఒక చిన్న నంది విగ్రహం దాటి లోపలికి వెడితే చిన్న మండువా దాటగనే సరిగ్గా గర్భగృహంలోకి వెళ్తాం గర్భగృహం చిన్నది ఆధునికంగా బంగారంతో తాపడం చేశారు చాలా అద్భుతంగా మెరుస్తూ ఉంది. గోడల లోపల దేవతామూర్తులు విగ్రహాలు నాలుగు గోడలో ఉన్నాయి వాటిలో శ్రీకృష్ణుని గ్రహం ధర్మరాజు, భీముడు,నరుడు విగ్రహాలు ద్రౌపది విగ్రహం ఉన్నాయి. నారాయణ మూర్తి విగ్రహం ఉంది. కేదార్నాథ్ ఆలయంలో లోపల ఉన్నటువంటి ఈ విగ్రహాలు ఇప్పుడు కొత్తగా బంగారు తాపడంతో మెరిసిపోతున్నాయి .ఉదయం పూట అభిషేకసమయం గనుక కేదారేశ్వరుని దర్శించవచ్చు .మూర్తి రూపం నంది మూపురం లాగా విశాలంగా ఉంటుంది పైకి మొనతేలిన భాగాలు కనిపిస్థాయి. అభిషేకం చేస్తన్నప్పుడు చందనాది ద్రవ్యాలు సామిపై రాస్తూ అభిషేకం చేయిస్తున్నారు.నాలుగు వైపులా భక్తులతో అభిషేకం జరుగుతుంంది. దాదాపు 16 మంది అభిషేకం చేసుకోవచ్చు. నాలుగు వైపులనుండి.
ఉదయం అభిషేకం తరువాత అలంకారం చేస్తారు. చూడటానికి రెండు కళ్ళుచాలవు. అంత అధ్భుతంగా ఉంది అలంకారం. అభిషేకం తరువాత అంతరాలయ దర్శనం ఉండదు. గర్బగృహం బైట వాకిలి నుండి స్వామి దర్శనం ఉంటుంది. ఎక్కడనుండి చూసి నా ఆదర్శనభాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతమే.
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ॥
ఉదయాన్నే గంటలకు లేచాం.5.30 అభిషేకం కు వెళదాం అని.రూమ్ లో నీళ్లు రావటం లేదు .చలి బాగా ఉంది టెంపరేచర్ 8% .కిందకు వెళ్లి నీరు తెచ్చుకోవాలి. చల్లటి నీళ్లు తప్పని పరిస్థితి కిందకి వెళ్లి బకెట్ తో నీళ్లు తెచ్చుకుని స్నానం చేసి అభిషేకానికి బయలుదేరాం 5.30am
అప్పటికి నితిన్ గారు రెండుసార్లు ఫోన్ చేశారు 6 లోపు రమ్మని ఐదు ముప్పావు కల్లా బయలుదేరి స్వామివారి అభిషేకానికి అవసరమైనటువంటి అభిషేక సామగ్రి తీసుకొని ఒక రుద్రాక్ష మాలను కూడా తీసుకొని నితిన్ గారిని కలిసాము అతను స్వామి వారి యొక్క దర్శనానికి లోపలికి తీసుకుని వెళ్లి లోపల ఉన్నటువంటి ఒక పండిట్ కి మమ్మల్ని అప్పగించారు. స్వామివారి ముందు సంకల్పసహితం గా గోత్రనామాలతో లఘు పూర్వకంగా శ్రీ రుద్ర అభిషేకాన్ని చేశారు .మేము తీసుకొని వెళ్ళినటువంటి నెయ్యిని మరియు గంధాన్ని స్వామివారి మీద అభిషేకం చేసి తరువాత గంగాజలంతో అభిషేకం చేసారు. నేను వారి తో గొంతు కలిపాను. ప్రశంసాపూర్వకంగా పఠనం విని నైవేద్యం పెట్టి మాకు ప్రసాదాన్ని ఇచ్చి స్వామివారి యొక్క శేష వస్త్రాన్ని కూడా బహుకరించారు.రుద్రాక్ష మాల రాజామొడలో వేసారు. స్వామిదర్శనం,అభిషేకం అధ్భుతం. భక్తుల రద్దీ పెరిగింది. మేము ప్రదక్షిణ చేస్తూ ఒకపక్క మూల నుంచొనిశ్రీ రుద్రాన్ని పఠీస్తూ అక్కడే స్వామివారి దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నాను .నా పక్కనే ఉషారాజ కూడా ఉన్నారు దాదాపుగా ఒక 45 నిమిషాల సేపు మేము గుడి లో ఉన్నాము.ఉష రాజా ఇద్దరు స్వామివారి మరల ప్రదక్షిణానికి వెళ్లారు నేను మాత్రము శ్రీ రుద్ర పారాయణ నమక చమకం పురుషసూక్తం శ్రీ సూక్తం పఠించి తర్వాత మరొకసారి తృప్తిగా స్వామికి ప్రదక్షిణ చేసాను.
అనాయాసేన మరణం - వినాదైన్యేన జీవనం
దేహాంతే తవ సాయుజ్యం - దేహిమే పరమేశ్వరా!కిందనే మాకోసం ఉష ఎదురు చూస్తుంది. ఉదయం పూట బాగా ఎక్కువైనటువంటి భక్తుల రద్దీ ఉంది .కేదారేశ్వరుని గుడి వెనుక ప్రాంతంలో ఉన్న శంకరాచార్య సమాధి ప్రాంతానికి వెళ్ళాము.పూర్వం ఒక మందిరంలో ఉండేది .ఇప్పుడు బహిరంగ ప్రాంతంలో చూట్టూ శ్రీ చక్ర ఆకృతి మధ్య లో కూర్చుని ఉన్న శంకచార్య విగ్రహం అధ్భుతంగా ఉంది. ఇటీవల ప్రతి ష్ఠాపన.అధ్భుతమైన కళతో ఉంది. అక్కడ పండిట్ ఉన్నారు. విశేషాలు వివరించి పూజ చేసారు. దర్శనం చేసుకుని తిరిగి గుడి వైపు వచ్చాము.ఒకసాధువు తెలుగు లో పలఖరించారు. గోదావరి తీరవాసి. గుడి దగ్గర వెనుకవైపు భీమ శిల (వరద సమయంలో గూడివెనుకువైపుకు కొట్టుకువఛ్చి గుడి కి రక్షణ గా ఉన్న పెద్దశిల)చూసి రూమ్ కిచేరాము.టిఫిన్ చేసి అక్కడి నుంచి తిరిగి కిందికి వెళ్ళటానికి బయలుదేరుతూ తగినటువంటి ప్రసాదాలు తీసుకుని అక్కడి నుంచి పదిన్నర ప్రాంతంలో రూముని ఖాళీ చేసి కిందకి బయలుదేరాము చలి కొంచెం అనిపిస్తూనే ఉంది మరొకసారి దర్శనం చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేసాము కానీ ఎక్కువైనటువంటి భక్తుల రద్దీ ఉండడంతో బయటనుండి నమస్కరించి బయలు దేరాము. పునర్దర్శనంకలగాలని ఆకాంక్షతో. చుట్టుపక్కల మేఘాలు కొమ్ముకొని ఉన్నాయి వర్షం పడుతుంది రెండు కిలోమీటర్ల నడక. గుర్రాలాగే ప్రదేశం వరకు నడుచుకుంటూ 11:30 కి ఆ ప్రాంతానికి చేరాము .అక్కడ గుర్రాన్ని మాట్లాడుకోవడం కోసం టీ తాగుతూ కూర్చున్నాము.తప్పనిసరి గా ప్రస్తావించవలసిన సంఘటన జరిగింది. కింద నుంచి అప్పుడే పైకి వచ్చినటువంటి ఒక తెలుగువారు కలిసారు వారు రెండవ తారీకు వచ్చారు సర్ సి నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి రావటం కోసం ప్రయత్నించిన వారికి రెండు మూడు నా తారీకులలో హెలికాఫ్టర్ క్యాన్సల్ అవ్వడంతో వారు ఈరోజు5/9/24 ఉదయాన్నే గుర్రం మీద పైకి వచ్చారు. వారు పైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటన్నప్పుడు మీరు మరలా ఎప్పుడు వెళ్తారు అని అడిగితే వారు తిరిగి ఈరోజే వెళ్లాలి అన్నారు. అలా అయితే త్వరగా వెళ్ళండి 12:00 వరకు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు అంతరాలయంలో స్వామివారి దర్శించుకోవచ్చు అంటే వారు వెనుక వచ్చేవారికి ఆ మాట చెప్పి త్వర త్వరగా వారిని అక్కడి నుంచి బయలుదేరి గుడి వెళ్ళిపోయారు. 12 గంటలకి కిందకి రావడానికి గుర్రాన్ని మాట్లాడుకున్నాము ఒక్కొక్కరికి 2300 ముగ్గురు గుర్రాన్ని మాట్లాడుకుని అక్కడి నుంచి గౌరీకుండ్ బయలుదేరాము.గుర్రాలు గౌరీకుండ్ వరకే.
మరలా తిరిగి 12.00 గంటలకి బయలుదేరి 1 .30 కల్లా భీమబలి అంటే కేదార్నాథ్ గుడి నుంచి తొమ్మిదిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి భీమబలికి చేరుకున్నాం. మధ్యలో వచ్చేటప్పుడు వర్షం పడింది రోడ్డు కూడా బాగా మధ్యమధ్యలోపడిపోయింది. పడిపోయినటువంటి ప్రాంతం మరీ ఎక్కువగా ఉంది.కిందకి దిగేటప్పుడు గుర్రం పై జాగ్రత్తగా ఉండాలి. ముందు కు దిగడం వల్ల ఎక్కువ ఒత్తిడి. గుర్రం మీద బలం పడకుండా వెనక్కి వెళ్ళి జాగ్రత్త కూర్చోవాలి. బాగావాలుగా ఉన్నచోట్ల దిగి నడిచాము.కేదార్ నుండి నాలుగు కి.మి తరువాత పూర్తిగా రోడ్డు దిగి పోయింది. జంగిల్ చట్టీ దగ్గర. రాళ్ళు పేర్చి తాత్కాలికంగా నిర్మాణం జరిగింది. జాగ్రత్తగా నడవాలి. వచ్చేటప్పుడు మధ్యలో ఒక మనిషి పడిపోతూ ఉంటే బయటికి లాగడం కూడా చూసాం. ఆ దేవుడిదేవుడు దయ.ఆమె కు దెబ్బలేంతగలలేదు కానీ పునర్జన్మే.ఆమె కూడా చాలా సురక్షితంగా దాంట్లో నుంచి బయటపడింది.చిన్న దెబ్బకూడాలేదు. చాలా జాగ్రత్తగా ఆ ప్రాంతమంతా నడుచుకుంటూ వచ్చాము. తర్వాత దిగేటువంటి ప్రదేశం కొంత ఉంటే అది కూడా నడిచిన దాదాపుగా రెండు కిలోమీటర్లు నడిచిన అక్కడి నుంచి మరల గుర్రాల మీదకి వచ్చాము. వర్షం పడింది వర్షంలో తడిసి భీమ బలి చేరేటువంటి సమయానికి 1:30 అయింది. ఒక అరగంట సేపు ఒక్కడే కూర్చుని టీ తాగాము గుర్రాల వాళ్ళు కూడా టిఫిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి మరల బయలుదేరి కిందకి వచ్చాము .వర్షంపడుతూనే ఉంది.గౌరీకుండ్ చేరేటువంటి సమయానికి టైం మూడు గంటలు అయింది . అందరినీ దించే ప్రాంతం కన్నా మమ్మల్ని మరొక కిలోమీటర్ దూరం ఎక్కువ తీసుకుని వచ్చిదించారు. అక్కడినుంచి తిరిగి సోన్ ప్రయాగ వెల్ల డానికి అవసరమైనటువంటి కార్ దగ్గరికి వెళ్ళాము.
ఉష ఎక్కిన గుర్రం పేరు పూజ
కార్లు తక్కువ ఉంటే చేత జనాలు ఎక్కువైనటువంటి కారణం కారులో 20 మంది కింద కూర్చున్నారు జీబులో నేను మాత్రం జీవు పైకి కూర్చుని అక్కడినుంచి సోన్ ప్రయాగ వరకు వెళ్ళాం .ప్రయాగ ముందు పడిపోయినటువంటి మార్గానికి ముందు దిగి అక్కడి నుంచి ఆ ఒక కిలోమీటర్ నడిచివెళ్ళాము. మా కారు కోసం ఫోన్ చేస్తే మా శర్మ రాంపూర్ దగ్గర రోడ్డు బాగాలేక ఆగిపోయింది వస్తున్నాను అన్నారు మమ్మల్ని రాంపూర్ వరకు రమన్నారు మేము సోన్ ప్రయాగ్ నుంచి ముందుకు నడుచుకుంటూ రాంపూర్ అంటే దాదాపుగా రెండు కిలోమీటర్లు మొత్తంగా నడుచుకుంటూ వెళ్ళాము .నేను రాంపూర్ వెళ్లి ఫోన్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలకి కారు వచ్చింది అక్కడి నుంచి అందరం కలిసి ఈ కారులో సర్ సి కి (మేము బయలుదేరినటువంటి ప్రాంతానికి) ఐదు గంటలకల్లా చేరుకున్నాం. కాకపోతే ఆరోజు రాత్రి అక్కడే ఉండి విశ్రాంతి తీసుకున్నాం. కేదారేశ్వరుని దర్శనం ఒక అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. రాత్రి అంతా కేదార్ లో ఉన్న అనుభూతి. 6/9/24 ఉదయాన్నే7.30 అక్కడి నుంచి బయలుదేరి బద్రీనాథ్ వెళ్దామనేటువంటి ఆలోచనతో ఆరోజు రాత్రికి అక్కడే ఆ రూంలోని పడుకున్నాం అక్కడ భోజనం చేసి ఈ రాత్రి 7:30 కల్లా పడుకున్నాము రాత్రి మంచి వర్షం పడుతోంది మా పక్కనే ఉన్నటువంటి యాత్రికులు కూడా మరుసటి రోజు ఉదయాన్నే కేదారి్ వెళ్ళటానికి హెలికాఫ్టర్ బయలుదేరుతుందా లేదా అనేటువంటి ఒక ఆదుర్దాలో ఉండటం గమనించా.
కేదార్ నాద్ ఎత్తు3583 మీ టర్లు .హిమాలయ పర్వత ప్రాంతం. ఆరునెలు మంచుతో కప్ఫబడి ఉంటుంది.
క్షేత్రాలలో దర్శించడానికి కష్టతరమైనది కేదార్ నాథ్.సంకల్పం తోబాటు శివుని అనుమతి ఉంటేనే దర్శనభాగ్యం కలుగుతుంది.
జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి|
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥











No comments:
Post a Comment