Monday, October 7, 2024

త్రియుగీ నారాయణ్ మందిరం

 3/9/24 త్రియుగీ నారాయణ దర్శనం

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ






ఘర్సాలి నుంచి ఏడున్నరకు కేదార్ కి బయలుదేరా మధ్యలో దారి చాలా పాడైపోయింది చాలా చోట్ల కొండలు పడిపోయి తాత్కాలికంగా మరమ్మతులు చేసినటువంటి దారి నిదానంగా వెళ్తున్నాము మధ్యలో ఆగస్త్యముని అనేటువంటి పట్టణంతగిలింది చాలా చక్కనైనటువంటి వారు ఊరికి అటు ఇటు రెండు వైపులా గంగ ప్రవహిస్తూ ఉంది ఆ ఊరిని దాటి అక్కడి నుంచి గుప్తకాశీ మీదుగా  సేర్శీ   చేరాము.  కేదార్నాథ్ కి వెళ్ళటానికి హెలికాప్టర్ సర్వీసెస్ ఇక్కడి నుండి ఉన్నాయి.  ఆ రోజు హెలికాఫ్టర్ సర్వీస్ ఉందేమో కనుకున్నాము . వాతావరణము అనుకూలంగా లేకపోవడం చేత ఆరోజు కూడా హెలికాప్టర్ సర్వీసు రద్దు చేశారు. మరుసటి రోజుకి కూడా టికెట్స్ లేవు అని చెప్పారు .రెండోది వాతావరణ కారణంగా మరుసటి రోజు కూడా హెలికాప్టర్ సర్వీసు ఉంటుంది లేదో అనేటువంటి సందేహం ఉంది. ఈరోజు చాలామంది సాయంకాలం వరకు అక్కడే హెలికాప్టర్లో బయలుదేరడంకోసం వేచిచూడడం హెలికాప్టర్ బయలుదేరకపోవడంతో వారందరూ అక్కడే కూర్చొని ఉన్నారు .మేము హెలికాప్టర్ గ్రౌండ్  పక్కనే ఉన్నటువంటి రూంలో ఉన్నాము అక్కడి నుంచి మేము నాలుగు గంటలకు  త్రియుగీ నారాయణ్  దర్శనం కోసం  వెళ్ళాం.సోన్ ప్రయాగ దగ్గర నుంచి ఒక 14 కిలోమీటర్లుదూరం. దారి అంతా కూడా చాలా కఠినంగా ఉంది అంటే దాదాపుగా దారి చాలా చోట్ల మూసుకుపోయి ఉంది చాలా చోట్ల కొండ పడిపోయింది. తాత్కాలికంగా మరమత్తులు చేశారు కారు కూడా చక్రాలు తిరిగి కొన్ని ప్రదేశాల్లో కారు ముందుకు పోలేదు. కొంథ భయం వేసే పరిస్థితి. బయలుదేరినటువంటి సమయం సాయంకాలం నాలుగు గంటల ప్రాంతం కాబట్టి కొంచెం చీకటి పడుతుందా అనేటువంటి సందేహం కూడా ఉంది.  కార్లు కూడా మా ముందు ఏమీ లేవు. ఇది చాలా విశిష్టత కలిగిన ప్రాంతం .శివపార్వతులకువివాహం జరిగినటువంటి క్షేత్రం గా చెప్పబడేటటువంటిది చాలా అందమైనటువంటి గుడి ఈ ఆలయంలో మనకు రెండు అడుగులు ఉన్నటువంటి లక్ష్మీనారాయణ విగ్రహాలు చాలా అందంగా ఉన్నవి.ఎడమవైపు నాలుగు అడుగు ల విష్ణంమూర్తి విగ్రహం చాలా అందంగా  ఉంది .గర్భగుడిలో  పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. శైవ క్షేత్రం అయినప్పటికిని  విష్ణుమూర్తి విగ్రహం ఉండటమే విశేషం. కేదార్నాథ్ ఆలయం వంటి గుడి .గుడి కింద కు ఉంది .ఒక 10మెట్లు దిగాలి. చాలా విశాలమైన ప్రాంగణం మూడు కుండాలు . ఉన్నాయి  ఒకటి బ్రహ్మగుండం రెండు విష్ణుకుండము మూడు రుద్ర కుండమన్నారు . నీరు బాగా స్వచ్ఛంగా ఉంది. చాలా పాతకాలం నాటి గుడి నాలుగు వైపులా కూర్చొనడానికి అనువుగా పానపట్టం లాగా ఉంది. శివపార్వతుల యొక్క వివాహం జరిగిన ప్రదేశం. శివపార్వతుల విగ్రహం తో ప్రాంగణంలో ప్రత్యేక ప్రదేశం ఉంది. అది

వివాహం జరిగినటువంటి పీఠంగా చెప్పారు. అక్కడ కూర్చుని పూజ చేయించుకున్నాము .తర్వాత గర్భ ఆలయానికివెళ్ళి మరలదర్శనం చేసుకున్నాము.గుడిలో గర్భాలయం ఎదురుగానే  పెద్ద ధుని. మూడు యుగాలుగా వెలుతున్న జ్వాల దానికి  సాక్షి గనుక ఈ స్వామికి త్రియుగీ నారాయణ అనే పేరు వచ్చిందిర. మూడు యుగాలు నుంచి ఆ అగ్ని అలానే మండుతుంది. దాని లో ఒక సమిధ వేసి విభూది తీసుకుని పునర్దర్శనంకలగాలని వేడుకొని బయలుదేరాము.చుట్టూ కొండలమద్య  అందమైన దేవాలయం.  వాతావరణం ప్రశాంతంగా ఉంది. పరమ పుణ్య పదప్రదేశం రమణీయంగా ఆద్యంతం పవిత్రతను కలిగించే వాతావరణం. ఆదిదంపతుల  వివాహ సంరంభాన్నిప్రోదిచేసుకున్న ఎందరో దేవతలు సందర్శించిన పుణ్య స్థలం. ఐదున్నర కల్లా దర్శనం చేసుకుని మరలా తిరిగి ఒక అర కిలోమీటర్ నడిచి కారుదగ్గరికి చేరాము. అప్పుడు కూడా కొన్ని కార్లు వచ్చాయి.స్వామ. అక్కడ నుంచి చాలా ప్రశాంతంగా మరలా తిరిగి 6.30 సేర్శీ చేరాము.   భోజనం చేసాము. ఈ రోజు మధ్యాహ్నం టిఫిన్ కూడా తిన్నాము. మూడు రోజుల తరువాత. 

అప్పుడే వచ్చినటువంటి యాత్రికులు చాలామంది మా పక్కన ఉన్నటువంటి రూములో దిగారు.చాలా కోలాహలంగా ఉంది. వారందరూ హెలికాప్టర్ బుక్ చేసుకున్నటువంటి వారు వెళుతుందా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి సందేహంఉంది చూద్దాం ఈ రెండు రోజుల నుంచి ఆగినటువంటి కేదార్నాథ్ యాత్ర ఈరోజు బయలు మొదలైంది కనుక రేపు మేము పైకి వెళ్లొచ్చు అనేటువంటి భరోసా. ఆపై దైవనిర్ణయం అనేటువంటి ఒక ధీమాతో పడుకున్నాము రేపు ఉదయాన్నే బయలుదేరి కేదారికి వెళ్లాలి ఉదయాన్నే 6 గంటలకు ప్రయాణం రాత్రి వాతావరణం బాగా చల్లగా ఉంది కాకపోతే ఇక్కడ రూమ్లో ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ వేసుకుని పడుకున్నాము రేపు ఉదయం4/9/24 కేదార్ ప్రయాణం.


కేదార్ కి వెళడానికి బేస్ గౌరీకుండ్.. ఇక్కడి నుండి కేదార్ 16 కిమి. అందరూ రాత్రికి గౌరీకుండ్, సోన్ ప్రయాగ ,రామ్ పూర్ ,సీతాపూర్ సేర్శీ లకు చేరతారు. సేర్శీ ప్రమాదం లేని ప్రాంతం. మిగతావి కొండ పడే ప్రాంతం .వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయి మరల నిర్మాణం జరిగిన ప్రాంతం. ఇప్పుడు సోన్ ప్రయాగవరకే కారు. అక్కడే రిజిస్ట్రేషన్ చెకింగ్. అక్కడి నుండి 6 కి.మి జీపులు గౌరీకుండ్ వరకూ. అక్కడి నుండి గుర్రం లేదా ఇతరములు 

No comments:

Post a Comment