సునందనందనాంగసంగరాగరఞ్జిత హితధునోతు మే మనోమలం
యమునాష్టకం
1/09/24
యమునోత్రి
ఉదయాన్నే ఐదు గంటలకు లేచి బయలుదేరడానికి సిద్ధమయ్యాము. యమునోత్రికి జానకి చహచట్టి నుండి ఐదు కిలోమీటర్లు . కోసం గుర్రాల కోసం మేము సిద్ధంగా ఉన్నాం. జానకి చిట్టి మనకు 25 76 మీటర్ల ఎత్తులో ఉంటే యమునోత్రి 33 23 మీటర్లు ఎత్తు అంటే జానకి చట్టీ నుంచి యమునోత్రి చేరడానికి 747 మీటర్లు అంటే 2,426 అడుగుల ఎత్తు ఎక్కాలి. కొండ మార్గంలో ఎక్కుతూ పైకి వెళ్లాలి అది ఐదు కిలోమీటర్లు పొడవు ఐదు కిలోమీటర్ల దూరంలో మనం ఎక్కేటువంటి ఎత్తు 2426 అడుగులు
ఇలా మనం ఐదు కిలోమీటర్ల మార్గము నిటారుగా చాలా 5/6 అడుగు లు వెడల్పు తో సన్నగా పొడుగ్గా దారి సాగిపోతూ ఉంటుంది .మెట్లు కొన్ని చోట్ల కొన్నిచోట్ల మామూలు దారి అడ్డదిడ్డంగా ఉన్నటువంటి రాళ్లు కనిపిస్తూ ఉంటాయి .మనకు యమునోత్రి కిచేరడానికి మూడు/4 రకాలైనటువంటి ప్రయాన సాధనాలు ఉన్నాయి. ఒకటి గుర్రం గుర్రం మీద వెళ్ళటానికి భయపడితే *పిట్టు* అంటే ఒక మనిషి వీపు మీద ఒక బుట్టలో కూర్చోబెట్టి మనల్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. మూడోది పల్లకి నలుగురు మనుషులు కలిపి తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ మూడు మనకు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సాధనాలు . నాలుగు. ..,నడక..మేముమాత్రం గుర్రాన్ని మాట్లాడుకున్నాము. గుర్రము ఆరింటికల్లా సిద్ధమైంది దాదాపుగా చాలా అందరికన్నా ముందుగానే బయలుదేరితే ఉన్నాము. నడకదారిలో వెళ్ళేటటువంటి వాళ్ళు నాలుగు గంటలకే బయలుదేరి నడిచి వెళుతూ ఉన్నారు. అక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణం భయమైతే ఏమీ లేదు ఇంతకు ముందు గుర్రం ఎక్కిన అనుభవం మా ఇద్దరికీ ఉంది రాజాకి కొత్తగా ఉంది .తను కూడా చాలా ఉత్సాహంగా ధైర్యంగా గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రాలవాల్లుజాగ్రత్తలు చెప్పారు. ముగ్గురం బయలుదేరి యమునోత్రివైపుగా ప్రయాణం మొదలుపెట్టాం. మాతో పక్కనే వస్తూ గుర్రాలకి సూచనలుఇస్తూ మధ్య మధ్యలో మమ్మల్ని పలకరించుకుంటా హుషారుగా కొండ ఎక్కిస్తున్నారు. స్నానం చేయడానికి అవసరమైనటువంటి ఒక జత బట్టలు, ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాము. వర్షం పడటం సర్వసాధారణమైనటువంటి విషయం కనుక దానికి తడిసిపోకుండా ఉండడం కోసం ఒక వంద రూపాయలు పెట్టి ఒక రైన్ కోట్ లాంటివి కూడా ఆ ముగ్గురం తీసుకున్నాము.ఆబ్యాగ్ మావీపున ఉంది. చేతిలో సెల్ ఫోన్ ఫొటోలు తప్పదు. అక్కడి నుంచి బయలుదేరి ఆరు గంటలకల్లా బయలుదేరి కొండగట్టు మొదలు పెట్టామో చాలా పైకి ఎక్కటం ఎక్కేటువంటి వాళ్ళుగా పైకి ఎక్కటం అనేటువంటిది మెట్లు ఎక్కటం ఉంది కొన్నిచోట్ల ఏ విధమైన మెట్లు లేకుండా మనకు గుర్రాలు అనటానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశంగా ఉంది అలా నడుస్తూ ఒక రెండున్నర కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక రోడ్డు పక్కనే ఆగి అక్కడ టీ తాగాము .అక్కడి నుంచి మరల బయలుదేరి 8.30 యమునోత్రి చేరాము .గుర్రాలు ఆగే దగ్గర నుండి
ఒక అర కిలోమీటర్ దూరం నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది .ప్రయాణం అంతా కూడా వెళ్లే దారి అంతా కూడా కొండ అంచుని వెళ్తూ ఉండటం .మేము వెళ్లేటప్పుడు మాకు ఉదయం పూట సమయం కాబట్టి ఎదురుగా వచ్చేటువంటి గుర్రాలు అంటే కిందకు వెళ్లేటువంటి గుర్రాలైతే మాకు ఏం తగలేదు కానీ మనుషులు మాత్రం కొన్నిచోట్ల ఎక్కుతూ ఉన్నారు. వారిని పక్క తప్పుకోమంటూ కొన్ని చోట్ల వారికి దగ్గర దగ్గరగా వెళ్ళటం జరిగింది. తల కూడా పైనతగల కుండా కొండ కు రాచుకోకుండా జాగ్రత్తగా ఉంటూ జారుతున్న జలపాతాలు చూస్తూ, జారిపడి పోయిన కొండ లను చూసి ఉద్విగ్న పడుతూ,కింద వాలులో పరిగెడుతున్న యముననుచూస్తూ ,అగాధపు అంచులలోకి వెళుతున్న గుర్రాలను గమనిస్తూ, చేతిలో ని ఫోన్ లో అనుభూతులు చిత్రిస్తూ భవభయనాశిని యముననుస్మరిస్తూ. ..ఓహ్.. అద్భుతమైన ప్రయాణం.అనుభవైకవేద్యమైన అనుభూతి, ఆనందసాగరాలలో తేలియాడాము.ఏ విధమైన భయం లేకుండా వెళ్లేటప్పుడు మధ్యలో చాలా చోట్ల పైనుంచి పడుతున్నటువంటి నీరు అక్కడక్కడ మీద పడే నీళ్లు తడుస్తూ వెళ్ళటం జరిగింది. చాలా బ్రహ్మాండంమైన అనుభవం. అక్కడి నుంచి ఒక ఆర కిలోమీటర్ నడిస్తే యమునా దేవి గుడి అక్కడికి వెళ్ళడానికి మనం కొంత కొండ దిగి ఒక 200 మెట్లు దిగి మనం అక్కడ దాక వెళ్లాలి. ఎదురు గా కోసం ఆ ముందుకు వెళితే యమునోత్రి దగ్గర మనకు వేడిగా ఉన్నటువంటి ఉష్ణ కుండాలు . అక్కడిదాకా వెళ్ళాము . యమునోత్రి సమయంలో ముందుకు వెళ్ళబోయే ఎటువంటి ప్రాంతాన్ని కొంచెం ముందుగానే కుడి వైపు యమున దాటడానికి ఒక బ్రిడ్జి కూడా ఉంది ఆ బ్రిడ్జి మీద నుంచి కొంచెం ముందుకు వెళితే మనకు ఎదురుగా ఉన్నటువంటి యమునోత్రి ఆలయం ఒక పక్క నుంచి కనిపిస్తూ ఉంటుంది.చాలా చాలా బాగుంటుంది ఆదృశ్యం. అలా తిరిగి మరల యమునోత్రి ఆలయం బయలుదేరి వెళ్ళాము అక్కడ ఉష్ణ కుండాలలో నీరు బాగా వేడిగా ఉన్నాయి. నీటిలో దిగాము మొదటి కొంచెం బాగా వేడిగా ఉన్న తర్వాత మనం భరించగలిగేటువంటి స్థాయిలోని నీరు ఉన్నాయి. చక్కగా ఈ దాంట్లో స్నానం చేసాము మధ్యలో మాత్రం ఒకచోట విపరీతమైన వేడితో నీరు పైకి ఉబికి వస్తుంది. ఆ నీరు ఆ ప్రాంతం కాకుండా మిగతా అంతా కూడా మనము స్నానం చేయడానికి అనుకూలమైనటువంటి వేడిలో ఉన్నాయి .ఇక్కడ మగవారికి ఆడవారికి వేరువేరుగా కుండాలు ఉన్నాయి దాంట్లో మనం స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి పైన ఉన్నటువంటి యమునా దేవి ఆలయానికి వెళ్ళాము.మెట్లకి ఎదురు గా సూర్య కుండం సూర్య కుండానికి పక్కనే యమున అమ్మవారి ఆలయంచిన్నది ఉంది. ఇదే యమున ఉద్భవించిన ఆలయం . గోత్రనామాలతో అమ్మవారికి పూజ చేసి లో పల చిన్న కటకటాల లో పల కేవలం పడుకొని అమ్మవారి పాదాలు తాకి వేడిగా పొగలుకక్కే నీటిని తీసుకుని శిలపై అభిషేకం చేసాము . గర్భగుడి ఒక చిన్న ప్రాంతంలో వేడిగా బాగా వేడిగా ఉన్నటువంటి నీరు బయటకు వస్తోంది అదే అమ్మవారి యొక్క పుట్టుక జన్మస్థానంగా చెప్పారు దాన్ని నీరు తీసుకొని అక్కడే అమ్మవారికు అక్కడ ఉన్నటువంటి గోడ మీద అమ్మవారి కిపూజ చేశాము చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి సూర్య కుండం దగ్గరికి వెళ్ళాము. దాంట్లో బాగా కాగేటువంటి నీరు.పెన మూత ఉంది. ఒక మన మూటలో బియ్యం మూటగట్టి ఇస్తే దాంట్లో పెట్టి ఉడికించి ఇస్తారు.ఒక పది నిమిషాలు. ఆంత వేడినీరు. అది ప్రసాదంగా అమ్మవారి నైవేద్యంగా దాన్ని తీసుకున్నాము. అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి యమునోత్రి అమ్మవారి గుడికి వెళ్ళాము. చాలా బ్రహ్మాండంగా ఉంది . గుడి ముందు విశాలమైనటువంటి ప్రాంగణం ఉంది గుడి లో అమ్మవారు యమునా నది ప్రవహించేటువంటి వైపు చూస్తూ ఉంది.యమునా దేవి మూర్తి ఆకర్షణీయం అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి ప్రదక్షిణ చేసి ప్రసాదం తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చాము. ఆలయం ముందు సందడిగా ఉంది. గుర్తుగా కొన్ని ఫుటొలు. చక్కరైనటువంటి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారి గుడి ముందు కొన్ని గుర్తుగా కొన్ని ఫోటోలు దిగాము అక్కడి నుంచి పక్కనే అమ్మవారి గుడికి కొంచెం పక్కనే ఉన్నటువంటి యమునా నది వైపు వెళ్ళాము. దాంట్లో దిగటానికి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి ప్రదేశమైనప్పటికిని ఒక పక్క నుంచి అక్కడ ఉన్నటువంటి యమునా నీరుని తీసుకున్నాం. ఆ పైనుంచి మనకు కంటికి కనిపించేటటువంటి దూరంలో కొండల మధ్యలో నుంచి యమునా నది కిందకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి మరలా తిరిగి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని పక్కనే ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కూడా చూసి అక్కడే ఒక గంట సేపు కూర్చున్నాము. అక్కడ పది సమయాన్ని కల్లా అక్కడ నుంచి మరల తిరిగి వెనక్కి గుర్రాల వైపుగా బయలుదేరి వచ్చాము. వచ్చేటప్పుడు తిరిగి కిందకి వచ్చేటువంటి సందర్భంలో రాజా నడిచి కిందకి వస్తానన్నాడు. తను నడిచి కిందకి బయలుదేరాడు నేను ఉష ఇద్దరం. మాత్రం గుర్రాలు మీద మరలా తిరిగి కిందకు బయలుదేరాము వచ్చేటప్పుడు పైకి వచ్చేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఎదురు గుర్రాలు వస్తున్నాయి. కొంత భయాన్ని కలిగించేటువంటి సందర్భమైనప్పటికీ గుర్రాలు చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చాయి కాకపోతే మేము తిరిగి వచ్చేటువంటి సందర్భంలో ఎదురైనటువంటి అనుభవం ఏంటి అంటే అప్పుడు చాలామంది పైకి వస్తున్నారు అంటే గుర్రాలు వచ్చేటటువంటి గుర్రాలు యొక్క వరుస మాకు ఎదురుగా కనిపిస్తూ ఉంది చాలా జాగ్రత్తగా గుర్రాలు ఒక పక్కన జాగ్రత్తగా కింద దిగాము. మధ్యలో బాగా దిగేటువంటి మెట్లున్న ప్రాంతంలో దాదాపుగా ఒక కిలోమీటర్లు ఆ ప్రాంతంలో గుర్రాల వాళ్ళు మీరు దిగినడవగలిగితే నడవండి అన్నారు. ఆ మెట్లు మాత్రం దిగి దాదాపుగా ఒకటిన్నర రెండు కిలోమీటర్లు నడుస్తూ కిందకు వచ్చాము. అక్కడినుంచి మరలా తిరిగి గుర్రాలు ఎక్కి మేము చాలా జాగ్రత్తగా కిందకి వచ్చాము .మేము వచ్చినతరువాత ఒక పది నిమిషాలకి రాజా కూడా చాలా ఉత్సాహంగా పైనుంచి కిందకి దిగి వచ్చాడు చాలా అద్భుతమైనటువంటి అనుభవం పైన చాలా చల్లగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి యొక్క దర్శనము కొండల మధ్యలో ఒక నది యొక్క జన్మస్థానాన్ని చూడటం ఒక అద్భుతమైనటువంటి అదృష్టంగా భావించాము. అది యమునా ఉత్తరి యమునా దిగినటువంటి ప్రదేశంగా చెప్పినటువంటి ఆ ప్రాంతం చాలా మహిమాన్వితమైన ది. కిందకి దిగి వచ్చినప్పటికిని పైన ఉన్నటువంటి ఆ ప్రాంతం ఇంకా కల్లలోనే మెదులుతూ ఉండది . పది నిమిషాలు అక్కడే విశ్రాంతి తీసుకుని మరలా తిరిగి అక్కడ నుంచి గంగోత్రి వైపు వెళ్లడం కోసం అమ్మవారికి నమస్కరించి బయలుదేరాము. యమునా నది లో కి వెళ్లి మా దగ్గర అప్పుడే చేసి సిద్ధంగా ఉన్నటువంటి రెండు వాటర్ బాటిల్స్ లో యమునానీటిని తీసుకొని గుర్తుగా రెండు చక్కని రాళ్ల నుండి తీసుకుని వచ్చాము. మరలా తిరిగి కారులో 12.00 గంగోత్రి వైపుగా ప్రయాణం మొదలుపెట్టాము. మధ్యలో ప్రయాణం సాగుతూ ఉంది 12 గంటలకి బయలుదేరినటువంటి మేము సాయంకాలము 7.00 గంటల వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నాము. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం గంగోత్రి వెళ్ళేటటువంటి దారి మధ్యలో హార్సిలీ అనేటువంటి ఒక ప్రాంతంలో మనకు మన ప్రాంతాలలో కనిపించినటువంటి ఈ యాపిల్ చెట్లు బాగా కనిపించాయి యాపిల్ చెట్లను చూస్తూ మధ్యలో ఉన్నటువంటి ఒకచోట యాపిల్స్ తీసుకొని వాటిని తింటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాము .మేము ఆరోజు మరల ఆరోజు మరల మా మజిలీ ఎంతవరకు అంటే ఘర్
ధరళీ చేరేవరకు .అది కూడా గంగోత్రి కి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఆరోజు సాయంకాలం 7:00 కల్లా మేము ధరళీ ప్రాంతానికి చేరుకున్నాము అది కూడా యాపిల్ తోటలకు ప్రసిద్ధమైనటువంటి ప్రాంతము అక్కడే కేదారేశ్వరుని గుడి కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి గంగా నది భాగీరధి అక్కడ ప్రవహిస్తూ ఉన్నటువంటిది ఆ నదీ ప్రాంతంలో ఆరోజు రాత్రికి విశ్రాంతి. భోజనం 8.00గంటల కు. చలి బాగా ఉంది. 1/9/2024
ఈరోజు ప్రయాణం యమునోత్రి నుంచి ధరళి వరకు 209 కి.మీ..........
యమునోత్రి 3323 మీ ఎత్తు ప్రయాణం ధరసు వరకు కిందకి 1036 మీ ఎత్తు వరకూ
మరల ఎత్తు పైకి ఎక్కడం గంగోత్రి 3140 మీ
ధరళి 2652 అంటే జానకి చట్టీ ఎత్తు
వాతావరణం14 డిగ్రీలు చలి ఉంది.
యమునోత్రి ప్రయాణం లో
రాజా ఎక్కిన గుర్ర పేరు బాలు










No comments:
Post a Comment