బదరీనాద్ ఆలయం
7/9/24 వినాయక చవితి
ఏడో తారీఖు ఉదయాన్నే బద్రీనాథుని దర్శనానికి వెళ్ళాము. మేఘాలు దట్టంగా ఉన్నాయి. చలి ఉంది . అలకనంద పాత బ్రిడ్జి మీద వెళ్ళేటప్పుడు దగ్గరగా ఉన్న దారిని మూసి కొత్త వంతెన మీదుగా కొంత దూరంగా ఉన్నటువంటి దారిలో నుంచి తిరిగి వెళ్లాము. ఆ ప్రాంతం మీద అవగాహనతో బ్రహ్మకపాలం వైపు వెళ్లేటువంటి బ్రిడ్జి మీద లోపలికి వెళ్లి అక్కడ నుంచి మధ్యలో ఉన్నటువంటి తప్తకుండం చూసి ఆది కేదారేశ్వరుని దర్శించుకుని అక్కడి నుంచి పైన ఉన్నటువంటి ఆదిశంకరుల దర్శనం తరువాత బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి మరలా తిరిగి లోపల భోగ్ జరుగుతూ ఉండటం చేత (బోగ్ అంటే అక్కడ జరిగే ఎటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవము) ఆ ఉత్సవంలో లోపల ప్రత్యేకంగా స్వామివారికి సేవ సమయంలో స్వామివారికి ప్రత్యేకంగా చేసేటువంటి అలంకారంతోపాటుగా అభిషేకం లాంటి జరుగుతుంది బయటనుంచి లోపల జరుగుతున్నటువంటి అభిషేకాన్ని అక్కడ జరుగుతున్నటువంటి అలంకారాలను చూసాము .అభిషేకం అయింది. అంతరాలయ దర్శనం మొదలు అయింది.బదరీనాద్ దర్శనంపెద్దగా రద్దీ లేదు. మంచి దర్శనం జరిగింది.లోపల ఉన్న స్వామి ని అంతరాలయ దేవతలను దర్శించుకున్నాం.
ఈ రోజు వినాయక చవితి . వినాయక చవితి రోజున స్వామి వారిదర్శనం. ప్రాకారంలో వినాయకుని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని అక్కడి నుంచి మరలా తిరిగి గుడి కి వెళ్ళాము. దర్శనం చాలా చక్కగాజరిగింది. లోపలికి వెళ్లి లోపల ఉన్నటువంటి స్వామి వారికి నమస్కరించి కొద్దిసేపు ఒక పక్కగా ఉండి చూసాము. అక్కడ నుండి ప్రసాదంగా స్వామివారికి ప్రసాదం గా ముగ్గురికి కూడా అక్కడ ఉన్నటువంటి పూజారి తులసి మాలలు ఇచ్చారు చాలా ఆనందంగా తులసిమాలలను తీసుకొని స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని తిరిగి మా ప్రసాదంలో కలుపుకుని అన్నిటిని తీసుకుని అక్కడి నుంచి ఆనందంగా బయటికి వచ్చాము. 10:30 వరకు అదే ప్రాంతంలో తిరుగుతూ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని చూసాము తర్వాత అక్కడి నుంచి మొదటిసారిగా వచ్చినటువంటి రాజాతో కలసి అటు వైపు ఉన్నటువంటి బ్రహ్మ కపాలం వెళ్ళాము . ఇంతకు ముందే మేము అక్కడ చేసే పితృ దేవతాప్రక్రియలు అన్ని చేసి ఉండటం చేత ఇప్పుడు కేవలం బ్రహ్మకపాలన్ని చూసి దాన్ని స్పర్శించి తర్పణం వదిలి నమస్కారం చేసుకొని ఆతీరంలో ఉన్న అలకనంద నదిలో దిగి ఆ తీర్థాన్ని పుణ్య జలాన్ని తీసుకున్నా. మరల స్వామి దర్శనాన్ని చేసుకున్నాం పునర్దర్శనంకలగాలని స్వామి ని కోరుకుని ఆనందం అక్కడి నుంచి బయలుదేరి అలకనంద ఝరిని దాటి కొన్ని పూజా వస్తువులు. కొని రూమ్ కి చేరుకున్నాము. 11 ప్రాంతానికి ఈ రూమ్ కి వచ్చిన అక్కడి నుంచి ఈ దగ్గరలో ఉన్నటువంటి మానా గ్రామానికి వెళ్దామని అడగటం జరిగింది. అయితే అప్పుడు వర్షం పడుతుంది. వర్షం ఆగి తగ్గే వరకు ఆగి 12 గంటల వరకు ఉండి అక్కడి నుంచి బయలుదేరి నుంచి తిరిగి హరిద్వార్ కు ప్రయాణం
యాత్ర శుభప్రదం గా జరిగింది
మధ్యలో చాలా ప్రాంతాలలో ఎక్కువగా కొండపడిపోయి కనిపిస్తుంది వర్షం పడటం చేత అది మరలా పడుతుందేమైనటువంటి ఒక ఆతృత డ్రైవర్ కలగడం అతను కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని నడుపుతున్న ా డు.విచిత్రంగావచ్చే సందర్భంలో ఒక మూడు నాలుగు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.అదృ ష్టవశాత్తు ఎక్కడా ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడలేదు కాకపోతే కొంచెం ఆలస్యం జరిగింది . *నగరసు* సాయంత్రం ఆరు గంటలకు చేరాం. చలి లేదు. అక్కడ రాత్రి బస. భోజనం కూడా.


No comments:
Post a Comment