Tuesday, October 8, 2024

కేదార్ నాథ్ kedarnath

 4/9/24 కేదార్ నాథ్












మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః ।

సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥ 

ఉదయాన్నే లేచి ఏడు గంటలకు సోన్ ప్రయాగకు బయలుదేరి వెళ్లాం అక్కడ పెద్ద క్యూ ఉంది ఉదయాన్నే ఐదు నుంచి వరుసలో నుంచుని ఉన్నారు  ముందు రెండు మూడు  తారీకులలో యాత్రను ఆపివేశారు అందుకని నాలుగవ తారీకు చాలామంది వరుసలో నుంచుని ఉన్నారు మేము వెళ్లి వరుసలోనుంచున్నాము. రాజా యాత్రకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ను చెక్ చేయటానికి వెళ్ళాడు. అక్కడే ఒక గుర్రం వాడిని కూడా మాట్లాడం గుర్రానికి మూడు వేల రెండ వందల రూపాయలు ముగ్గురికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత గుర్రాలకి కూడా డబ్బులు ఆన్లైన్లో కట్టి వాళ్ల దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకున్నాం ఉష రాజా  ప్రయాగలో ఇడ్లీ తిన్నారు .నేను దోశ తిన్నాను ఎనిమిదిన్నరకి సోన్ ప్రయాగ నుండినడిచి వెళ్ళటం మొదలుపెట్టాం.సోన్ ప్రయాగనుండి 1/2 కిలోమీటర్ నడీస్తే మందాకినీ నది దాని మీద వంతెన దాటాక పూర్తిగా పడిపోయిన దారి తాత్కాలిక మరమ్మతులు చేసారు. 300మీటర్లు. రాళ్ళుపడి ఉన్నాయి. వాటిని దాటి ముందు కు వెళ్ళాము.  పెద్దలు కొంతమంది అక్కడ ఆగారు ముందు కు వెళ్ళ. లేక.గుర్రాలకోసం. రద్దీ ఎక్కువగా ఉంది అందుకే వారిని కూర్చోబెట్టారు.కేదార్ కు   మొత్తం 22 కిలోమీటర్లు దూరం సోన్యాగం నుంచి నడుస్తూ ముందుకు వెళితే ముందుగా ఒక బ్రిడ్జి వచ్చింది దాని మీద నుంచి వరుసలో పంపిస్తున్నారు గుర్రాలు పడిపోయినటువంటి సోనుప్రియా గ బ్రిడ్జి అవతల ఉన్నటువంటి ప్రదేశం నుంచి బయలుదేరుతాయి మొత్తం ఒక కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి అక్కడ నుంచి ఒక 10 నిమిషాల వెయిటింగ్ అనంతరం అక్కడ గుర్రాల ఎక్కాము 9 గంటలకు సోన్ ప్రయాగ నుంచి గౌరీకుండ్  ప్రాంతం ఆరు కిలోమీటర్లు ఉంది. ఈ ఆరు కిలోమీటర్లు గుర్రం మీద  మార్గము బాగున్నప్పుడు అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి కొన్ని కార్లుద్వారా గౌరీకుండ్ చేరవచ్చు. ఇప్పుడు కూడా పడిపోయిన  కొండ కుఅటువైపుఉన్న కార్లు  అక్కడే తిరుగుతూ జనాలని  అటు గౌరీకుండ్ వరకు చేరుస్తూ ఉన్నాయి. మేము గౌరీకుండ్ వరకు గుర్రం మీద వెళ్ళాము. అక్కడి నుంచి కేదార్నాథ్ 16 కిలోమీటర్ల దూరం ప్రయాణము 9:30 కి కొండమీదికి ప్దరయాణంలైంది ఇంతకుముందు కేదార్ వెళ్ళాము. 12సంవత్సరాల క్రితం. అప్పుడు పిల్లలు అమ్మ అత్తయ్య గారు డోలీఎక్కారు.నేను ఉష గుర్రాలు. మేము గుర్రాల మీద ప్రయాణం ఉండటం వల్ల అలవాటు అయినటువంటి ఒక ధైర్యం మాలో ఉంది. కొండమీదకి గుర్రాలు ఎక్కుతూ ఉన్నాయి .ఉష గుర్రం సోనాక్షి.నాగుర్రం రాజా గుర్రం వరుసగా బయలుదేరాయి ముందు ఉష తర్వాత రాజా అది తర్వాత నేను వరుసగా కొండమీదికి వెళ్తున్నాము దాదాపుగా ఒక రెండు మూడు వేల మంది జనాలు ఒకేసారి బయలుదేరి వెళ్తున్నాం. కొంత ఎదురు వచ్చేవాళ్లు ఎవరూ లేరు చాలాసేపు పదిన్నర వరకు దాదాపుగా మేము వెళుతూనే ఉన్నాము.ఈ దారంతా పాత దారే..వర్షం మొదలైంది.6.30 కిమీ భీమ బలి అనే ప్రాంతం చేరుకున్నాం .మధ్యలో వర్షం పడుతోంది ఈ వర్షం పడినప్పుడు అక్కడ వాడేటువంటి రైన్ కోట్ వేసుకొని జాగ్రత్తగా భీమ బలి అంటే 6:30 కి.మీ దూరం వరకు చక్కగా ప్రయాణం సాగింది .పక్కనే మందాకినీ పరవళ్లు. కొండవాలులో ప్రయాణం పైనుంచి పడే నీరు. దారి కూడా సన్ననిదారి.భీమబలి కి ముందు కొండమారాము. నది దాటి కొత్త దారి లో కి వెళ్ళాము. అవతల కొండ పాతదారి కనపడుతుంది. అక్కడ టీ తాగి అక్కడ నుంచి బయలుదేరాం.   .ఎదురు గా పాత దారి పడిపొయిన ప్రాంతం పడిపోయినటువంటి దారి. అనిపిస్తుంది ఇప్పుడు అక్కడి నుంచి కొండ మారి కొత్తగా వేసినటువంటి మార్గంలోకి ప్రయాణం సాగింది దాదాపుగా ఒక నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మమ్మల్ని గుర్రాల మీద నుంచి దిగి నడవాలి అని చెప్పారు.   జంగిల్చట్టీ దగ్గర దిగి.  నడిచాము. దారి పూర్తిగా పడింది. దాని వల్లే యాత్ర ఆగిందని చెప్పారు. మార్గము గత రెండు రోజుల నుంచి పూర్తిగా మూసుకొని పోయి ఉండటం వల్ల మార్గము అంతా పడిపోయి ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా ఆ మార్గాన్ని రాళ్లతో నిర్మిస్తున్నారు.  వర్షం పడుతూ ఉండటంతో కొంత మార్గమంతా జారుడుగా ఉంది రాళ్లమీద జాగ్రత్తగా నడవాలి. ఒకరినొకరం పట్టుకుని నడిచాము .రాళ్ళు పేరు స్తున్నారు. పనిజరుగుతుందీ.గుర్రం ఎక్కి అక్కడి నుంచి ముందుకు వెళ్లాము మరల అక్కడ దారి లేదు గుర్రాలు మీద నిదానంగా ప్రయాణం సాగించాం .ఎదురు గుర్లారాలు రావడం మొదలు అయింది.11.30 మేఘాలు వచ్చాయి. చలి.  వర్షం పడింది వర్షంతో పాటు చక్కనైనటువంటి మేఘాలు మా చుట్టుపక్కల మా మీద నుంచి మేఘాలు వెళ్ళటం కనిపిస్తూనే ఉంది చక్కనైనటువంటి ప్రకృతి ఆస్వాదిస్తూ పైనుంచి దుముకుతు ఉన్నటువంటి సెలయేర్లను చూస్తూ గుర్రం జారుతుందేమో అనేభయం  జారిపడినటువంటి మట్టి పెల్లలు వాటి మీద జాగ్రత్తగా వెళుతూ ఉన్నటువంటి గుర్రాలను చూస్తూ తగిన జాగ్రత్తలతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు సాగము .మరల మరొకచోట ఇలానే పడిపోవడం జరిగింది.నడిచి వచ్చే భక్తులు పోలీ.డోలీ అంతా హడావుడి గా ఉంది. అందరూ ఒకటే నామస్మరణ. కేదార్  బాబికీ జై..పక్కనే ఉన్న దుకాణాలు భక్తిపాటలు12.00 కొండపడిపోయినటువంటి ప్రాంతంలోదిగి మరలా తిరిగి అక్కడ నుంచి ఈ నడుచుకుంటూ కొంతదూరం వెళ్లి అక్కడి నుంచిగుర్రాలు ఎక్కాము. ఎదురు గుర్రాల రాక పెరిగింది. ఎలా వచ్చామోతెలియకుండా పైకి కేదార్నాథ్లో ఉన్నటువంటి గుర్రాలు ఆగే ప్రదేశానికి మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకున్నాం.వాతావరణం తేలికగా ఉంది. ఎండ. చలి ఉంది అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు కేదార్నాథ్ గుడి కిహకి నడిచి వెళ్లాలి . గుర్రం దిగగానే ఒక గగుర్పాటు. ఆనందం ఎగిరెగిరి పడింది. ఎంత అదృష్టం. రెండో సారి కేదారేశ్వరుని దర్శనం. అదృష్టం ఏవిఘ్నం లేకుండా దరికి తీసుకుని వచ్చారు

శివాదన్యథా దైవతం నాభిజానే

శివోఽహం శివోఽహం శివోఽహం శివోఽహమ్. కేదార్ ప్రయాణ సంకల్పం రాజాది. అనుమతి పరమేశ్వరునిది కేదార్ చూడగనే ఉద్విగ్న పడ్డాడు. ఒక జలదరింపు పులకరింపు మైమరపు చూసాను. ముందు రొండు రోజులు యాత్ర ఆగటం ముగ్గురం ఫోన్ లో చూసాం. కానీ ఎవరం ఎవరికీ చెప్పలేదు. మాటకూడా అనుకోలేదు. కేదార్ వెళుతున్నాం అంతే .నిజంగా నే అలా నే వచ్చాం. 

 టీ తాగి కొంత విశ్రాంతి తీసుకున్నాము. బాగా ఎక్కువైనటువంటి చల్లదనం ఉంటుంది చేత ఉష రాజ ఇద్దరు కూడా బాగా అలసిపోయి ఉన్నారు నేను కూడా కొంత విరామంతీసుకొని కూర్చున్నా.కేదార్ చేరాం అనే తృప్తి కదలనీయలేదు. అక్కడ నుంచి కొంత మంది  పిట్టూవారు మోసుకు తీసుకొని వెళ్లేటువంటివారు మమ్మల్ని  గుడి దగ్గరికి తీసుకొని వెళ్తాము ఎక్కండి అని అడిగారు కానీ మేము నడుచుకుంటూ గుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాము రెండు గంటల ప్రాంతానికి గుడి దగ్గరికి చేరుకున్నాము.రద్దీ ఉంది. గుడికి బాగా దగ్గరలో ఉన్నటువంటి ఒక రూమ్ లో ఉండటానికి నిర్ణయించుకుని ఆ రూమ్లో దిగాము టైం మూడు అయింది రాజాఉష ఇద్దరు కూడా చలికి రూంలో ఉన్నారు. నేను మాత్రం స్నానం చేసి కేదారేశ్వరుని దర్శనానికి బయలుదేరి వెళ్లాను పెద్దగా ఎక్కువైనటువంటి క్యూ లేదు కానీ చలి మాత్రం ఉంది అయినా  స్నానం చేసి  కేదారేశ్వరుని దర్శనానికి బయలుదేరి వెళ్లాను సరిగ్గా 12 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ  కేదారేశ్వర దర్శనాన్ని ముందుగా చేసుకోవడం జరిగింది అప్పుడు అమ్మ అత్తయ్య గారు పిల్లలు అందరూ వచ్చాము ఇప్పుడు మాత్రం నేను మా ఉష రాజా ముగ్గురు మాత్రమే వచ్చాము. ఏ విధమైనటువంటి మార్పులు లేవు అంత గుడి చాలా గంభీరంగా ఎదురుగా కనిపిస్తూ ఉంది.గతం కన్నులముందుకు వచ్చిందిగత స్మృతులుగా మిగిలిపోయినటువంటి కొన్ని భవనాలు విశాలం అయిపోయి అంటే 13 లో జరిగినటువంటి విలయల్లో అవన్నీ పడిపోయాయి. గుడి చాలా విశాలంగా కనిపించింది అప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి తేడాలని చూస్తూ ముందుగా కేదారేశ్వర గుడికి నమస్కరించి గుడిలోకి వెళ్లాను.పైకి భక్తులు అప్పుడే వస్తున్నారు. గుడి లో పెద్దగా జనాలు లేరు బయట నుంచి దర్శనం అంతరాలయ దర్శనం లేదు. తృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వచ్చి అక్కడ నుంచి పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి తిరిగి చూశాను. తర్వాత నాలుగు ప్రాంతంలో మరలా  రూమ్ లోకి వెళ్లి అక్కడ మన ఫ్యాంట్ షర్టు వేసుకొని  బయటకు వచ్చాను.   చలిబాగా పెరుగుతుంది తగినటువంటి జాగ్రత్తలతో బయటికి వచ్చాను ఈ లోపు ఉష కూడా లేచి తను కూడా వస్తానంది ఇద్దరం కలిసి మరల గుడిలోకి  అరగంట ఆగి బయలుదేరి వెళ్ళాము.  మరుసటి రోజు అభిషేకం చేసుకొనటానికి అవసరమైనటువంటి పండిట్ కు ఫోన్ చేసి అతని యొక్క తమ్ముడు అక్కడే ఉంటే నా తన్ని ఫోన్ నెంబర్ తీసుకొని అతనితో మాట్లాడాము అతను సాయంకాలము 6 గంటలకు హారతి ఉంది హారతి తర్వాత మాట్లాడదామన్నారు ఉషా నేను వెళ్లి చక్కగా కేదారేశ్వర దర్శనం చేసుకున్నాము అప్పుడే జనాలు పై అప్పుడే జనాలు పైకి రావడం చేత కొంత రద్దీ ఏర్పడింది ఈ లోపు ఆ ప్రాంతమంతా ఒకసారి చూసి మరలా తిరిగి గుడి దగ్గరికి వచ్చాము ఇక్కడ 6 గంటలకి హారతి మొదలైంది హారతి మొదలవగానే లోపలికి వెళ్లి హారతి దర్శనం చేసాము మరల ఇంకొకసారి జనాలు బాగా ఉన్నారు. అంచేత మరలా తిరిగి ఇంకోసారి మరలా తిరిగి వెళ్లి రెండవసారి మరల హారతి దర్శనం చేసుకుని బయటికి వచ్చి హారతిని చూస్తూ ఉంటున్నాము జనాలందరూ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ భక్తులందరూ అక్కడికి వచ్చారు చాలా కోలాహాలంగా ఉంది.6 00 లెట్లు వేశారు. ఎంత అధ్భుతంగా ఉందో గుడి ఫుటో లో బందించడాని సరిపోదు. అదేసమయంలో వెనుక తెల్లని హిమవత్ పర్వతంవెలుగులో. అక్కడ వెలుగు. ఇక్కడ చీకటి. మాటలకు అందని అనుభూతి. మేఘాలు వెళ్ళపోయి మంచు కనపడుతుంది. పైగా ఆప్రాంతం లో వెలుతురు ఉంది. మేము చీకట్లో ఉన్నాం.  హారతి మొదలు. ప్రకృతి మైమరిపిస్తోంది.  చక్కనైనటువంటి జై జగదీశ్ హరే అనేటువంటి ఈ పాట మైక్ లో వినిపిస్తూ ఉండగా ఒక 6:30 వరకు హారతి గుడిలో మొదలైంది. అందరూ భజనలు హారతులు. ఆధ్యాత్మికసౌందర్యం ఉద్విగ్న భరిత వాతావరణం భక్తి ఉప్పొంగుతున్నభావతరంగాలు. ఆరున్నర తర్వాత బయటికి హారతి తీసుకొని వచ్చి బయట ఉన్నటువంటి వినాయకునికి నందీశ్వరునికి హారతి  మా అందరికీ అందరం హారతిని చూస్తూ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి అందరికీ హారతి చూపించడం జరిగింది చక్కగా దైవదర్శనమైన తర్వాత రాజా కూడా హారతి కిబయటకి వచ్చాడు. చలితోకొంత ఇబ్బంది ఉంది. తర్వాత అందరము గుడిలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నాము బయటికి వచ్చిన తర్వాత కొన్ని ఫోటోలు దిగి బాగా చల్లి పెరగడం చేత అక్కడే కొంచెం సేపు తిరిగి  7:30 ప్రాంతంలో తిరిగి మరల వెళ్ళిపోయాము రూమ్ లో నుంచి రూమ్ తలుపు తీస్తే ఎదురుగా ఉన్నటువంటి కేదార్నాథ్ స్వామి ఆలయం కనిపిస్తూ ఉంది అలానే ఆ రూమ్ లోనే పడుకున్నాము .టిఫిన్ కి బయటకు వచ్చాము. చలి ఎక్కువగా ఉంది. తర్వాత 8:30 ఆ టైంలో నేను ఒక్కడినే బయటికి వచ్చి రాత్రి ఆ లయ ప్రాంగణం మొత్తం కూడా 10:30 దాకా ఆ ప్రాంతాల్లోనే తిరుగాడా.అలౌకిక అనిర్వచనీయమైన అనుభూతి. మరల తిరిగి లభిస్తుందోలేదో. ఆ సౌందర్యాన్ని పరిసర ప్రాంతాలను చూస్తూఅక్కడే గడిపాను చాలామంది రాత్రి10:30 వరకు పైకి నడిచి వస్తూనే ఉన్నారు వచ్చినటువంటి వారందరూ స్వామివారి గుడిని గుడి ముగిసినప్పటికీ స్వామివారి గుడిని దర్శించడము ఆ ప్రాంతాల్లో కూర్చుని తన్మయత్వం లో ఉండటము ఒక అద్వితీయ ఆనంద తో ఆ ప్రాంతంలో వివరిస్తూ ఉన్నారు. తర్వాత బాగా చలి పెరుగింది. 8% ఇక మరసటి రోజు ఉదయాన్నే అభిషేకానికి రావలసినటువంటి కారణం చేత రూమ్ కి వెళ్లి స్వామివారి నమస్కరించి పడుకున్నాను . ఎదురు గా గుడి నిద్ర పట్టలేదు. మధ్యలో బయటకు వచ్చి చూడటం. ఎంత అధ్భుతంగా ఉందో రాత్రి సమయంలో గుడి నిశ్శబ్దంగా  భక్తులు అక్కడే ఉన్నారు.మొత్తానికి నిద్ర పోయా.

జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణవిరహితం శంకరం న స్మరామి

క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భో శ్రీమహాదేవ శంభో ॥ 

కేదారేశ్వరం కేదారనాద

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. హిందువులు పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, బద్రీనాథ్ భాగంగా ఉంటాయి. భక్తులు ముందుగా యమునోత్రితో చార్‌ధామ్ యాత్రను ప్రారంభించి.. పైన పేర్కొన్న క్రమంలో బద్రీనా‌థ్‌తో ముగిస్తారు. ఈ కేదార్ నాథ్ యాత్ర చాలా ఆనందం కలిగిస్తుంది. గంగోత్రి నుంచి  శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా మూడో క్షేత్రమైన కేదార్నాథ్ కు చేరుకున్నాము. ఇదొక జ్యోతిర్లింగ క్షేత్రం. సముద్రమట్టానికి 3584మీటర్ల ఎత్తులో హిమాలయాలలో ఉంటుంది. దీని గురించి స్కంద పురాణంలో చెప్పబడింది.


కేదార్ నాథ్ జ్యోతిర్లింగం  



దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరుపొందిన 12వ శైవక్షేత్రాల్లో 11వ లింగం కేదార్ నాథ్. కేదార్ నాథ్ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది. వాటిపైన గాంధీసరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడి నుండి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్ నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుకుంటాయి. అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. ఈ శివాలయంలో ఎద్దు పృష్ఠభాగం రూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది.


ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారు ఈ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమణం రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెరుస్తారు. ఇది వైశాఖమాంలో అనగా ఏప్రిల్లో నెల ఆఖరున లేదా మే మొదటి వారంలో వస్తుంది. తిరిగి వ్రుశ్చిక సంక్రమణం రోజున, అంటే సూర్యుడు వ్రుశ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మసి వేస్తారు. ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరు వారంలో గాని, నవంవబర్ నెల మొదటి వారంలోగాని వస్తుంది. ఈ స్వామి వారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన 6నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు.


పురాణాల ప్రకారం


ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగం. నరనారయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలపై బదరీక్షేత్రమున తపస్సు చేసినప్పుడు ద్యోతకముయిన శివలింగము. కేదారము నందు ఉన్న శివలింగంను దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే! బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయాల్లో కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగను ఉంచి ఆరాధచేస్తుండేవారు. మట్టితో చేసి ఈ శివలింగంను వారు సాక్షాత్తు ఈశ్వరుడని అని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తున్నారు, అప్పుడు ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగంకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకోమని అడిగారు. అప్పుడు వారు స్వామీ ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు అవతలి వైపు హిమాలయ పర్వతశ్రుంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు.


అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండవది. దర్శించడానికి కఠినతరమైంది. 


అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటిగా వెలుగొందుతున్నది. కేదార్ నాథ్ ఆలయం ఆది శంకరులచే 8వ శతాబ్దంలో పేనర్ నిర్మించబడిన శివాలయం. సుమారు 1000సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయాన్ని దీర్ఘచతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు

కేదారేశ్వరస్వామి రెండు సార్లు రెండు విధాలుగా పూజింపబడుతాడు. ఉదయం బాలభోగ్ అష్టోత్తరం, మహాభిషేకం మొదలైన పూజలు ఎన్నో చేస్తారు. ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణపూజ అంటారు. కేదార్ నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేసి తిరిగి సాయంత్రం నాలుగు అయిదు గంటల మధ్య తెరుస్తారు.సాయంత్రం జరిగే పూజను శ్రుంగార పూజ అంటారు. సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామి వారిని అందమైన పూలతో అలంకరిస్తారు. కేదార్ నాథ్ లో 4 లేక 5 గంటలకే చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత ఆలయం ప్రాంగణం అత్యద్భుతంగా ఉంటుంది. కేదారేశ్వరస్వామి వారికి 6గంట నుండి 7గంటల వరకు విశేష హారతిని ఇస్తారు. ఆలయం లోపల హారతిని ఇస్తుంటే, ఆలయం వెలుపల సాధువులు శంఖం పూరిస్తుంటారు. రాత్రి సమయంన స్వామివారికి అర్చనలు ఉండవు. అలంకార మూర్తుడైన స్వామి దర్శనం మాత్రమే లభిస్తుంది.






 

No comments:

Post a Comment