గంగాయమునయోర్మధ్యే.. (గంగా యమునల పుణ్యస్నానం)
హరిద్వార్ నుంచి రిషికేష్ మీదగా డెహ్రాడూన్ బయలుదేరి వెళ్ళాము రోడ్డు చాలా విశాలంగా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు మేము ప్రయాణించినటువంటి ఆ రోడ్డుకి రోడ్డుకి ఏమాత్రం సాపత్యం లేదు చాలా హాయిగా ఉంది ప్రయాణం. ప్రకాశేశ్వర్ మందిరంలో దర్శనం.8.30 ప్రసాదం అటు ఇటు అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలు పెద్ద పెద్ద చెట్లు. పచ్చని ప్రకృతి మేఘాలు పలకరిస్తున్నాయి. కొండ అంచున ప్రయాణం మొదలు .
ఈ డెహ్రాడూన్ దగ్గరి నుంచి కొండ అంచున ప్రయాణం మొదలవుతుంది డెహ్రాడూన్ కొండల మధ్యలో ఉన్నటువంటి చక్కనైనటువంటి ఒక లోయ ప్రాంతం. చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఆ ఊరు చాలా పెద్దది.ఉత్తరా ఖండ్ రాజధాని. ఆ ఊరిని చూస్తూ అక్కడి నుంచి ముందుకు వెళుతున్నాము. చాలా ప్రశాంత వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఆర్మీ కి సంబంధించిన కళాశాల ట్రైనింగ్ సెంటర్ IAS క్వార్టర్లు శిక్షణా కళాశాల కనిపించాయి. ఇంకాముస్సూరీ ఒక పదహారు కిలోమీటర్లు ఉంది ముస్సోరి వెళ్లేటువంటి మధ్యలోనే ఒక మలుపు ప్రదేశంలో ఆగాము.అక్కడి నుండి డూన్ అధ్భుతంగా ఉంది. హోటల్ కూడా కొండ అంచున ఇనుప కమ్మీలపై లో యలోకి కట్టారు. టిఫిన్ గా మనకు అక్కడ దొరికేటువంటి మ్యాగీ తిని అక్కడి నుంచి బయలుదేరి ముస్సూరీ మీదుగా కెమ్ టీ వాటర్ ఫాల్ కు ప్రయాణం మొదలుపెట్టాము. ఎక్కువైనటువంటి రద్దీ కూడా లేదు రోడ్డు చాలా చాలా పాడెంది. అంతగా బాలేదు మధ్యలో చిన్న వర్షపు జల్లులు కూడా పడుతున్నాయి వాతావరణం లో స్పష్టంగా మార్పుకనిపిస్తుంది బాగా చల్లదనం కూడా వచ్చింది ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ముస్సోరి దగ్గర మేఘాలు కమ్మాయి. మేఘాల మద్య ప్రయాణం మధ్యాహ్నం 11 గంటల సమయం అయింది .
కెంప్టిఫాల్స్ (Kempty Falls) కొండమీద నుంచి ఒక జలపాతం క్రిందకు పడుతూ వుంటుంది. కేవలం రెండువందల అడుగుల ఎత్తునుండి మాత్రమే క్రిందకు పడుతూ వుండే చిన్న జలపాతం ఇది. సాధారణంగా కొండ ప్రాంతంలో వుండే ఏ జలపాతాన్నైనా మనం చాలా దూరం నుంచే చూడగలము. ఇక్కడ ఈ జలపాతం క్రింద పడే చోట, ఒక పెద్ద తొట్టిలాగ నిర్మించారు. మనం ఆ తొట్టె లోపలకు వెళ్లి ఆ జలపాతం పడే ధారక్రింద నుంచుని స్నానం చెయ్యవచ్చు.
కెమ్
టీ వాటర్ ఫాల్ చేరాము. దాదాపుగా ఒక
500 మెట్లు దిగి కిందకు వెళ్లాలి ఇంతకుముందు వెళ్లినటువంటి అనుభవం ఉంది గనుక నడిచాము.
రోప్ వే కూడా ఉంది.
ఇంతకుముందు వెళ్లినప్పుడు వాటర్ ఫాల్ దగ్గర టిఫిన్ చేసాము. రిషి ఋత్విజ ఉష
నేను నలుగురం వెళ్ళాము . పెద్దవాళ్ళు దిగలేమని రాలేదు. అప్పుడు నేను స్నానం చేయడానికి మాత్రం కిందకి
దిగలేదు. కెమ్ టి వాటర్ ఫా ల్ చాలా అద్భుతమైనటు
జలపాతం .ఇక్కడ మనం కింద దాకా వెళ్లి స్నానం చేయవచ్చు ఏ విధమైన భయం లేదు .విడిగా మనం
వెళ్లేటువంటి ప మార్గమధ్యంలో చాలా చోట్ల అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి
కానీ అక్కడ మనం ఆగాలంటే పైనుంచి చిన్న చిన్న రాళ్లు లాంటివి పడుతూ ఉంటాయి . జలపాతం
దగ్గరకు కూడా మనం వెళ్లేటువంటి అవకాశం ఉండదు దూరం నుంచి చూడటమే. కానీ ఈ కమిటీ వాటర్
ఫాల్ దగ్గర మాత్రమే కిందకి మనం వెళ్ళొచ్చు
చాలా ఉదృతంగా నీళ్లు పడుతూ.నాలుగు ఐదు పాయలుగా. దాదాపు 100మీ ఎత్తునుండి కింద కు పడుతుంది ఎక్కువ
లోతు కూడా ఉండదు నడుములోతు. జలపాతం కిందకు వెళ్ళి తలపెట్టాను. అదిరిపోయింది. చాలా అద్భుతంగా ఉంది .
రాజా నేను ఇద్దరం ఒక 30 ని ఉన్నాం. ఇప్పుడు కొత్త మార్పులు మన బట్టలు మార్చుకోవడానికి లాకర్స్ లాంటివి కూడా ఏర్పాటు చేశారు అక్కడే మనకు స్నానానికి అవసరమైనటువంటి దుస్తులు కూడా దొరుకుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది బాగా చల్లగా ఉన్నాయి కానీ దాదాపుగా దిగిన తర్వాత నడుములో మీరు మాత్రమే ఉన్నాయి చాలా హాయిగా వెళ్ళాము కింద అప్పుడే జనాలు వస్తున్నారు కొంత రద్దు అప్పుడప్పుడు మొదలవుతుంది ఆ వాటర్ ఫాల్లో స్నానం చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది అదే కనుక మనము అక్కడ చలికాలంలో గనక వెళ్లినట్లయితే పక్కనే గడ్డకట్టినటువంటి మంచు ఉంటుంది దాని లోనే మనకు కూల్ డ్రింక్స్ ని దాంట్లో పెట్టి అది మనకు తీసి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం అంత మంచు లేదు కానీ తాగేటువంటి కూల్ డ్రింక్స్ వాటిని మాత్రం నీళ్లలోనే పెట్టి వాటిని ఉన్నారు ఫ్రిజ్ గాని ఏ విధమైనటువంటివి ఉపయోగించకుండా దాంట్లోనే చల్లదాన్ని చేస్తున్నారు. చాలా బాగుంది చూడటానికి. దాదాపుగా ఈ వాటర్ ఫాల్ 1724 మీటర్ల ఎత్తులో ఉంది అంటే మనము యమునోత్రి కి దాదాపుగా సగం ఎత్తులో ఉన్నట్లు. 12.30 ప్రయాణం యమునోత్రి వైపు ఇక్కడి నుంచి ఈ యమునోత్రికి బయలుదేరి వెళ్లడం కోసం 12:30 కి ఎక్కడి నుంచి బయలుదేరి యమునోత్రివైపుగా బయలుదేరి వెళుతున్నాము. నేను రాజా ఎదురుగా స్నానం చేశాము మాత్రం మధ్యలో దిగి కొన్ని ఫోటోలు తీసాం అక్కడ చాలా అద్భుతంగా ఉంది.
యమునోత్రికి వెళ్ళటం కోసం మధ్యలో
ఉన్నటువంటి ప్రాంతాలుగా భారాకోడ్ చేరము. బారాకోట్ దగ్గర నుంచి సానా చట్టి మీదగా
రా నా చట్టి,
హనుమాన్ చట్టి, సాయంకాలం నాలుగు నాలుగున్నర సమయానికి హనుమాన్ చట్టి చేరేము. ఇక్కడి
నుంచి మాకు ఎదురుగా గుర్రాలు రావటం మొదలైంది
హనుమాన్ చట్టీ నుండి జానకి చట్టి చేరాముదాదాపుగా
సాయంకాలం 5 కి. యమునోత్రికి జానకి చట్టి చివరి
మజిలీ. ఇక్కడనుండి కొండ ఎక్కాలి.
యమున ఒడ్డునే ఉన్నటువంటి హోటల్ లోరూమ్ 1500/- రూపాయలు అక్కడే రూమ్‌లో మనం ఉదయాన్నే స్నానం చేయడానికి అవసరమైనటువంటి హీటర్ ఉందా లేదా అని చూసాము అక్కడ దిగిన తర్వాత వెంటనే టీ తాగి పక్కనే ఉన్నటువంటి యమున బ్రిడ్జ్ వైపు వెళ్ళాము. జానకి చట్టి దగ్గరమనకు యమునాదాటడానికి వంతెన లు ఉన్నాయి. పాతకాలపు వంతెన కాలిబాట గా ఉపయోగించే ది తీగలమీద ఉంది. పాత కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ కాలంనాటి బ్రిడ్జి చాలా అద్భుతమైన బ్రిడ్జి ఉంది కొత్తగా కట్టినటువంటి బ్రిడ్జి కూడా ఆ పక్కనే ఉంది కొత్తగా కట్టే బ్రిడ్జి మీద నుంచి కార్లు గాని మిగతా వెళ్ళటం కోసం ఉపయోగిస్తున్నారు ఆ దగ్గరలోనే పెద్ద పార్కింగ్ ప్రదేశం కూడా కారు కోసం ఏర్పాటు చేశారు. మా రూమ్ వెనుక పాథ బ్రిడ్జి ఉంది దాని మీదకు వెళ్ళాము ఎదురుగా ఉన్నటువంటి యమునా చాలా అద్భుతంగా ప్రవహిస్తుంది . కొండలమధ్య యమున గలగలలు వినిపిస్తూనే ఉన్నాయి. మేముయమునా స్నానం కోసం నదిలో కి దిగాము. దిగి స్నానం చేయడానికి ఏ విధమైనటువంటి ఘాట్ అయితే అక్కడ ఏర్పాటు చేయలేదు. కానీ రాళ్ళమీద జాగ్రత్తగా దిగి స్నానం చేయవచ్చు .నీరుబాగా చల్లగా ఉన్నాయి నేను రాజా ఇద్దరం దిగాము. ఉష సంప్రోక్షణ చేసుకుంది. ద చల్లనైనటువంటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంది . ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి ఉత్తరాదిలో గంగా స్నానం యమునా జల పానం చాలా విశేషం . అంటే గంగలో స్నానం చేయాలి యమునా నీటిని తాగటం పుణ్య ప్రదం అని ఒక నమ్మకం . అదృష్టవశాత్తు ఈ రోజు ఉదయాన్నే హరిద్వార్‌లో హర్ కి పౌరీ లో గంగా స్నానం సాయంకాలం యమునా స్నానం .గంగా యమునల దర్శనం ఒకేరోజు రెండు పుణ్య నదులలో స్నానం చేయడం నీరు సేవించడం అద్భుతమైన అనుభవంగా ఉంది. ఒక అరగంట సేపు స్నానం చేసిన తర్వాత ఐదున్నరకి జానకి చట్టిలో ఉన్నటువంటి యమునా దేవి ఆలయానికి పాత వంతెన మీదుగా వెళ్ళాము బ్రిటిష్ కాలం నాటి తీగల బ్రిడ్జి మీదగా నడుచుకుంటూ వెళ్తే కొంత కొండ ఎక్కాలి. ఒక 100 మీటర్లు కనుక నడిచినట్లైతే సరాసరిగా యమునా దేవి యొక్క గుడి అద్భుతమైనటువంటి యమునా దేవి గుడి ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది. గుడి చక్కనొనటువంటి అలంకారంతో ఆరోజు ఏదో విశేషమైన పర్వదినం లాగా ఉంది చక్కనైనటువంటి అలంకారం చేశారు. మేము వెళ్లే సమయానికి ఎక్కువ మంది భక్తులు లేకపోవడం చే పూజారి గుడి మూయడానికి సిద్ధపడుతున్నారు దూరంగా ఉన్నటువంటి మమ్మల్ని చూసి ఆగారు లోపలికి వెళ్లి యమునాదేవి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజారి ఇంకా ఎవరైనా వస్తున్నారు అని అడిగారు తర్వాత అటు ఇటు చూసి మేమున్నప్పుడేగుడిమూసి వెళ్ళిపోయారు .యమునా దేవి యొక్క ఆ గుడిని చూసి చీకటి పడక ముందే తిరిగి వెనక్కి వచ్చాము . అక్కడేగుర్రాలు బయలుదేరేటువంటి ప్రదేశము .చాలామంది గుర్రాల వాళ్ళు మా దగ్గరికి వచ్చారు . గుర్రాలు మాట్లాడుకోవడం కోసం మేము గుర్రాలు ఎంత అనేటివంటి దాన్ని మాట్లాడాము చాలా తక్కువకే ఇక్కడ గుర్రాలు అయితే దొరికాయి పోను రాను మాకు మొత్తం వెయ్యి రూపాయలు. 5:00 ఇంటికల్లా బయలుదేరుతామని చెప్పి ఆరోజు వారిని పంపించి వేసాను. రూమ్ లోనే భోజనం . అప్పుడు కార్లు రావడం మొదలయ్యాయి. రద్దీ పెరిగింది. ఊరంతా తిరిగి చూసాను. యమనకు రెండు వైపులా కాటేజ్ లు మంచి హోటల్స్ ఉన్నాయి. మంచి వసతి సదుపాయాలు ఉన్నాయి. రోడ్డు మాత్రం బాగా పాడైంది. మద్య లో వర్షాల వల్ల బురదగా ఉంది. రాత్రి 8:30 కల్లా పడుకున్నాము. రూమ్‌లో దిగినప్పుడు పైన ఫ్యాన్ లేదో అనే విషయం గమనించలేదు అప్పుడు కొంచెం వాతావరణం వేడిగా ఉంది కానీ సాయంకాలం అయ్యేసరికి చల్లబడింది పక్కనే ఉన్నటువంటియమునా నది వలన కాని ఎత్తైన ప్రదేశం 3000మీటర్లు అవటంవలన అవ్వచ్చు బాగా చల్లబడింది వాతావరణం యమునా నదికి తూర్పు వైపుగా కొండ ఎక్కాలి . రాత్రి సమయంలో బాగా చల్లగా ఉంది వాతావరణం . ఉదయాన్నే ప్రయాణం. మధ్యలో బయటకు వచ్చి చూస్తూనే ఉన్నాను. ఉత్సుకతతోనిద్ర పట్టలేదు .





Very nice Raju...... Thankyou for sharing...... మేమూ వెళ్లిన అనుభూతి పొందాం.....
ReplyDelete