హరిద్వార్'
30/08/2024
అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మ హిమాలయో
నామనగాధి రాజః అనిమహాకవి
కాళిదాసు చెప్పినటువంటి దేవతా స్వరూపం అయినటువంటి దేవ భూమిగా ప్రఖ్యాతమైనటువంటి హిమాలయ
పర్వతాలలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్‌లో ప్రసిద్ధమైనటువంటి హరిద్వార్ మరియు యమునోత్రి గంగోత్రి
బద్రి కేదార్ చూడటానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లాం. 30వ తారీకు మధ్యాహ్నం 11.00
ప్రసిద్ధమైనటువంటి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ లో దిగాము చక్కనైనటువంటి భారతీయ సాంస్కృతి
సాంప్రదాయాలు ప్రసిద్ధమైనటువంటి సంస్కృత సూక్తులతో నిండు ఉన్నటువంటి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్
నుంచి మేము హరిద్వార్ కి బయలుదేరి వెళ్లాం .
హరిద్వార్‌లో
బూపత్వాలాలో ప్రాచీన రామా లయంలో ఉన్నటువంటి గౌతమి ఆశ్రమం తెలుగు ఆశ్రమానికి మధ్యాహ్నం
ఒకటిన్నరకి చేరుకున్నాం.మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత హర్ కి పౌరీ చూడటం కోసం ఆటో లో
వెళ్ళాాము. ముందుగా హరిద్వార్ లో ప్రసిద్ధమైనటువంటి మానస దేవి ఆలయానికి బయలుదేరి వెళ్ళాము
. మానస దేవి ఆలయము హరి కి పోరి కి దక్షిణంగా
ఉన్నటువంటి ఒక కొండమీద ఉంటుంది . మానసా
దేవి ఆలయానికి కింద నుంచి పైకి చేరుకోవటానికి ఒక రోప్ వే ఉంది. అక్కడే మానసా దేవి ఆలయము
మరియు చండీ దేవి ఆలయము రెండు చోట్ల ఉన్నటువంటి రోప్ వే లో ప్రయాణించడానికి మరియు మానసా
దేవి ఆలయం నుండి చండీ దేవి ఆలయానికి వెళ్ళటానికి అవసరమైనటువంటి రవాణా సదుపాయాలతో కూడిన
టికెట్ తీసుకున్నాం .ధర 520/-
ముగ్గురం టిక్కెట్ తీసుకొని అక్కడున్నటువంటి రోప్ వేలో నలుగురు కూర్చోవడానికి
వీలుగా ఉన్నటువంటి ఒక చిన్న పెట్టె లో మానసా దేవి ఆలయానికి వెళ్ళాము. కొండ పైకి వెళుతున్న ప్పుడు మధ్యలో చుట్టూరా ఉన్నటువంటి హరిద్వార్ ప్రాంతము అద్భుతంగా
కనిపిస్తూ ఉంది. దాన్ని చూస్తూ ఒక 10 నిమిషాల సమయానికి మేము పైన ఉన్నటువంటి మానస దేవి
ఆలయానికి చేరుకున్నాం.
చక్కనైనటువంటి ఆలయం మనసా దేవి శివుని మానస పత్రిక అని స్థలపురాణం చెప్తుంది ఈమెను శక్తి అవతారంగా భావిస్తారు. మద్యాహ్నసమయం వల్ల భక్తుల రద్దీ లేదు. ఆలయం దగ్గర నుంచి చూస్తే హరిద్వార్ మనోహారం గా కనిపిస్తూ ఉంటుంది. గంగా నది ప్రవాహము గంగా నది మధ్యలో ఉన్నటువంటి హర్ కి పౌరీ. ఎతైన శివుని విగ్రహం ఇక్కడి నుంచి చూడొచ్చు. మానసా దేవి భక్తుల ఆర్థిక సమస్యలు తీరతాయని లోకోక్తి. అక్కడ నుంచి ఈ పక్కనే మరో కొండ మీద ఉన్నటువంటి చండీ దేవి ఆలయానికి ట్రావెల్ లో వెళ్ళాం. చండీ దేవి ఆలయం హర్ కి పౌరీ కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న కొండ మీద ఉంది . గంగానది ఒక పాయ దాటి నుంచి మేము చండీ దేవి ఆలయానికి వెళ్ళాము ఈ కొండను నీల పర్వతం అని అంటారు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో గుడి ఉంది .కొండకి అంచుగా కొంత నడిచిన తర్వాత ప్రాంగణం చివర క ఆలయం కనిపిస్తుంది దాదాపుగా ఒక 70 80 మెట్లు ఎక్కాలి. ఈ చండీ అమ్మవారి దర్శనంతో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తీరుతాయని నమ్మకం. అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఎక్కువైనటువంటి రద్దీ కూడా లేదు చక్కనైనటువంటి ఆలయ పరిసర ప్రాంతాలను చూసి ఆలయంలోని బైరవ, మహాశక్తి గుడులు బయలుదేరి కిందకు వచ్చాము. కోతలు ఎక్కువ ఉన్నాయి. రద్దీ తక్కువగా ఉంది. దర్శనం బాగా జరిగింది. రోప్ వే ప్రయాణం బాగుంది.ట్రావెలో తిరుగు ప్రయాణం. మధ్యలో నే దిగి హరిద్వార్‌లో ప్రసిద్ధమైనటువంటి మాయాదేవి ఆలయానికి నడుస్తూ చేరాము. దారి వెంట రకరకాల ధర్మశాలలు (సత్రాలు)ఉన్నాయి. రద్దీ బాగానే ఉంది .సమయం 5.00 హారతి కొసం అందరూ హర్ కి పౌరీ వస్తున్నారు. ఈ అమ్మవారి పేరు మీదనే మాయాపూర్ అనేటువంటి పేరు వచ్చింది. ఆలయంలో విగ్రహానికి మూడు ముఖాలు. త్రిమాశక్తి అని పిలుస్తారు. దుర్గాదేవి అనేటువంటి పేరుతో మనము పిలుస్తూ ఉంటాము. చేతిలో శూలం ధరించి చూడటానికి దుర్గలా రౌధ్రంగా ఉంది. చాలా ప్రశాంతమైనటువంటి ఆలయము చాలా చక్కగా అమ్మవారి దర్శనం జరిగింది. అక్కడినుంచి హర్ కి పౌరి బయలుదేరాము. మాకు ఇది రెండవ సారి హరిద్వార్ రావడం.రాజా కి మొదటి సారి. పూర్తి ఆధ్యాత్మిక తతో ప్రాచీనత్వతకు గుర్తుగా ఆధ్యాత్మిక నవ్యతలను కలబోసి ఉన్న హరిద్వార్ ను ఆసక్తి గా చూస్తున్నాడు. సాధుసంతులను ,ధర్మశాలలను,భారతీయ తను చూపే వివిధ ప్రాంతవాసుల సందర్శనం అధ్బుతమైన అనుభవం. హరిద్వార్ లో అన్నిటికన్నా ప్రధానమైనది అతి పవిత్రమైనదిగా చెప్పబడేది హర్ కి పౌరి అనేటువంటి ప్రదేశం. గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక పెద్దదైనటువంటి స్నాన ఘట్టం దీన్ని బ్రహ్మకుండమనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఇక్కడే భూమి మీదకి గంగా వచ్చిన ప్రదేశం. ఇది హరిద్వార్ కిఈ మధ్యలో ఉన్నటువంటిది ఉంటుంది. వరుసగా రెండు వైపులా స్నాన ఘట్టాల వరుసగా కనిపిస్తూ ఉంటాయి.ఒకవైపు గంగా హారతి ఇచ్చే ప్రాంతం. ఎదురు గా మరో వైపు ఎత్తైన స్థంబపు నిర్మాణం. రెండు వైపులా స్నానం చేయవచ్చు. నది ఒరవడి గా ఉంటుంది. చల్లటి స్వేచ్ఛ మైన పవిత్ర మైన గంగాప్రవాహం. రిషికేశ్ నుంచి ప్రవహించుకుంటూ వచ్చినటువంటి గంగానది హరిద్వార్ పట్టణానికి దగ్గర రెండుగా చీలి హర్ కి పౌరీ వైపుఒక పాయ వస్తుంది. గంగా నది ఒడ్డుని ఒక గోడ మీద రెండు పాదముద్రలు చూసాం. ఇక్కడే గంగా భూమికి దిగినటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం గోడపై చిత్రించారు. గంగానది విష్ణు పాదాలనుంచి జన్మించింది. అందుకే విష్ణుపది అంటాం.
ఇక్కడ స్నానం చేయడం గొప్ప అనుభూతి కలిగిస్తుంది. బ్రహ్మకుండం ప్రత్యేక మైన ప్రదేశంటా దేవతలు రాక్షసులు
క్షీరసాగర మథనం చేసిన ప్పుడు అమృతంభాండంలోనుడి
నాలుగు చుక్కలు పడిన ప్రదేశాలు మన దేశంలో నాలుగు
చోట్ల నాలుగు నదులలో పడ్డాయి. అందుకే ఆ నాలుగు పవిత్ర స్థలాలలో 12 సంవత్సరాలకు ఒకసారి
కంభమేళా జరుగుతోంది. హరిద్వార్ లో బృహస్పతి
కుంభరాశిలో ఉన్న సందర్భంలో2021లో కుంభమేళా
జరిగింది .ఇక్కడ సాయంకాలం పూట ప్రతిరోజు ఆరున్నర గంటల ప్రాంతంలో గంగాదేవికి హారతిని
ఇస్తారు. పవిత్ర బ్రహ్మకుండ దగ్గర సాయంకాల సమయంలో పావన గంగామాతకు ఇచ్చే హారతి చాలా
ఆనంద దాయకంగా ఉద్వేగంభరితంగా ఉంటుంది. ఈ రోజు
సాయంకాలం ఆరు గంటలకి చాలా మంది భక్తుల తో రద్దీ గాఉంది. మేము అక్కడికి వెళ్లి గంగకి పూజ
చేసి అక్కడ గంగలో ఒక దీపాన్ని వదిలి అక్కడే గంగాహారతి కోసం కూర్చున్నాము. 6:30 కి గంగా
హారతి మొదలయింది.దాదాపు 10పూజారులు స్థానికమైనటువంటి సంకల్పాన్ని చెబుతున్నారు. అక్కడ
వారికి భాద్రపద మాసం మనకు శ్రావణ మాసం కృష్ణ పక్షం. వారికి భద్రపద మాసం కృష్ణ పక్షం.
తరువాత భాద్రపద శుక్లపక్షం మొదలు. సంకల్పం
అందరిచేత చెప్పించారు. 6.40 కి గంగాలహరి శ్ర్తోత్రం తో గంగాహారతి మొదలైంది. ఆంధ్రప్రాంతీయులు
జగన్నాథ పండితరాయలు వ్రాసిన గంగాలహరి వింటూ పవిత్రహారతి చూడటం మధురానుభూతి.తర్వాత మన
ఆంధ్ర ప్రాంతీయుడు మరియు ఆంధ్రుడు అయినటువంటి జగన్నాథ పండితురయలు రాసినటువంటి గంగాలహరి అద్భుత స్తోత్రం దాదాపుగా ఒక 15 నిమిషాలకు గంగకిగా హారతి జరిగింది. గంగా మాత గంగా మాకి నినాదాలతో మారుమోగుతూ ఉన్నటువంటి
గంగా హారతిని చూస్తే ఉద్విగ్న మనస్కూలౌట సాధారణం. అక్కడినుంచి మరుసటిరోజు31/08/24 చార్ధామ్
యాత్రకు బయలుదేరి వెళ్ళటం కోసం అవసరమైనటువంటి ట్రావెల్స్ మాట్లాడటం కోసము అక్కడ ఉన్నటువంటి ట్రావెల్స్ దగ్గరికి
వెళ్లి మరుసటి రోజుకి అవసరమైనటువంటి కార్ బుకింగ్ గురించి ఎంక్వయిరీ చేసాము
29000/- తొమ్మిది రోజులు
ప్రయానంలో భోజనం చేయడానికి అవసరమైనటువంటి బియ్యం ఇతరములు తీసుకొని
ఆశ్రమానికి వెళ్ళాము. ఆటో 300/-
రాత్రి టిఫిన్ ఇడ్లీలు
మరుసటి రోజు యమునోత్రి కి ప్రయాణం


Super detailing Bavagaru. Waiting for day-2 details.
ReplyDelete